STOCKS

News


భయపెడుతున్న బీఓపీ

Sunday 23rd September 2018
news_main1537712292.png-20487

ఆరేళ్ల తర్వాత తొలిసారి నెగిటివ్‌ జోన్‌లోకి...
ఎకానమీని క్లోజ్‌గా ఫాలోఅయ్యే వాళ్లకు కరెంట్‌ ఖాతాలోటు, విత్తలోటులాంటివి సుపరిచితాలే. రూపీ బలహీనతకు వీటికి అత్యంత అవినాభావ సంబంధం ఉంటుంది. వీటితో పాటు రూపీపై ప్రభావం చూపే మరో కీలకాంశం.. చెల్లింపుల శేషం(బాలెన్స్‌ ఆఫ్‌ పేమెంట్‌- బీఓపీ). పైన చెప్పిన వాటితో పాటు బీఓపీ సైతం ప్రభుత్వాలకు ముచ్చెమటలు పట్టిస్తూ ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో క్యాడ్‌, విత్తలోటు విస్తరించినట్లు బీఓపీ విస్తరించకుండా కాస్త ఉపశమనాన్ని ఇస్తూ వచ్చింది. కానీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో బీఓపీ సైతం నెగిటివ్‌ జోన్‌లోకి జారుకుంది. సంవత్సరం మొత్తానికి బీఓపీ నెగిటివ్‌గానే ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2005 నుంచి పదేళ్ల పాటు బీఓపీ దేశీయ ఎకానమీ రూపకర్తలకు చుక్కలు చూపింది. 2013-15 నుంచి ఎఫ్‌డీఐలు, ఎఫ్‌ఐఐలు పెరగడం, దిగుమతుల భారం దిగిరావడంతో క్రమంగా బీఓపీ పాజిటివ్‌ జోన్‌లోకి వచ్చింది. అయితే ఇటీవల కాలంలో చమురు ధరల పెరుగుదలతో దిగుమతుల భారం పెరగడం, మరోవైపు క్యాపిటల్‌ ఇన్‌ఫ్లో మందగించడంతో క్రమంగా బీఓపీ నెగిటివ్‌ జోన్‌లోకి జారింది. ఒక పక్క బాలెన్స్‌ ఆఫ్‌ పేమెంట్స్‌ క్షీణించిన క్రమంలో మరోపక్క రూపాయి బాగా బలహీనపడడం డేంజర్‌ సంకేతాలను ఇస్తోంది. 
బీఓపీ అంటే..
ఇతర దేశాలతో ఒక దేశం చేసే అన్ని రకాల లావాదేవీలు బీఓపీ కిందకు వస్తాయి. బీఓపీలో క్యాపిటల్‌ ఖాతా, కరెంట్‌ ఖాతా ఉంటాయి. ఎఫ్‌డీఐ, ఎఫ్‌ఐఐ నిధులు, బహిర్గత నిధులు క్యాపిటల్‌ ఖాతాలోకి వస్తాయి. కరెంట్‌ ఖాతాలో దేశాల మధ్య జరిగే అన్ని రకాల వాణిజ్యాంశాలు కవర్‌ అవుతాయి. ఇన్నాళ్లూ కరెంట్‌ ఖాతాలో లోటును క్యాపిటల్‌ ఖాతా బాలెన్స్‌ చేయడంతో బీఓపీ పాజిటివ్‌గా ఉంది. కానీ తాజాగా దేశంలోకి వచ్చే విదేశీ నిధుల ప్రవాహం బాగా సన్నగిల్లింది. యూఎస్‌ ఫెడ్‌ చర్యలతో పలు వర్ధమాన దేశాల్లోంచి నిధులు యూఎస్‌వైపు మరలుతున్నాయి. దీంతో భారత్‌ క్యాపిటల్‌ ఇన్‌ఫ్లో బాగా మందగించింది. ఇదే సమయంలో క్రూడాయిల్‌ ధర విపరీతంగా పెరగడం కరెంట్‌ ఖాతాలోటును మరింత విస్తృతం చేసింది. ఈ ధరలు మరింత పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో కరెంట్‌ ఖాతా లోటును అనుకున్న టార్గెట్‌లోపు కట్టడి చేయడం ప్రభుత్వానికి కష్టం కావచ్చు. ఇదే జరిగితే చెల్లింపుల శేషం మొత్తం ఆర్థిక సంవత్సరానికి నెగిటివ్‌ జోన్‌లోనే ఉండవచ్చు. మరోపక్క రూపాయి క్రమంగా 73 స్థాయి వద్ద సెటిల్‌ కావచ్చని అంచనాలున్నాయి. దీంతో ఈ సంవత్సరం ఈక్విటీలకు గడ్డుకాలమేనని నిపుణుల అంచనా.



You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ డౌన్‌

Monday 24th September 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో సోమవారం నష్టాలతో ట్రేడవుతోంది. ఉదయం 8:37 సమయంలో సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 21 పాయింట్ల నష్టంతో 11,150 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 11,166 పాయింట్లతో పోలిస్తే 16 పాయింట్లు నష్టంతో ఉందని గమనించాలి. దీంతో నిప్టీ సోమవారం నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఒక్క హాంగ్‌ సెంగ్‌ మినహా మిగతా ఆసియా

బిగుస్తున్న ట్రేడ్‌ ముడి

Saturday 22nd September 2018

మాటల్లేవంటున్న చైనా యూఎస్‌తో జరపాల్సిన వాణిజ్య చర్చలను రద్దు చేస్తున్నట్లు చైనా ‍ప్రకటించింది. వచ్చే వారం తమ వైస్‌ ప్రీమియర్‌ లీహును చర్చల కోసం వాషింగ్టన్‌ పంపమని తేల్చిచెప్పింది. లీ పర్యటనకు ముందు పంపాల్సిన అధికారుల బృందాన్ని సైతం చైన రద్దు చేసినట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఒక కధనంలో వెల్లడించింది. అయితే వచ్చే నెల జరగాల్సిన తాజా చర్చలకు మాత్రం అభిముఖంగానే ఉన్నట్లు తెలిపింది. చైనా తీరు మారలేదంటూ తాజాగా ట్రంప్‌

Most from this category