STOCKS

News


ఉర్జిత్‌ రాజీనామాపై బ్రోకరేజ్‌ల రియాక‌్షన్‌!

Tuesday 11th December 2018
news_main1544506932.png-22817

వ్యక్తిగత కారణాలను చూపుతూ ఆర్‌బీఐ గవర్నర్‌ పదవికి ఉర్జిత్‌పటేల్‌ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే! కేంద్ర బ్యాంకుకు, కేంద్రానికి మధ్య బయటకు కానరాని విబేధాలున్నాయన్న వార్తల నేపథ్యంలో ఉర్జిత్‌ రాజీనామా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఉర్జిత్‌ రాజీనామాతో దేశీయ మార్కెట్లు అధోముఖ పయనం ఆరంభించాయి. ఈ నేపథ్యంలో ఉర్జిత్‌రాజీనామా వ్యవహారంపై ప్రముఖ బ్రోకరేజ్‌లు స్పందించాయి. ఈ వ్యవహారం మార్కెట్లపై ప్రభావం చూపడం ఖాయమని కానీ ఇది తాత్కాలిక వ్యవహారమేనని బ్రోకరేజ్‌లు అభిప్రాయపడుతున్నాయి. 
- నోమురా: ఆర్‌బీఐకి, కేంద్రానికి మధ్య విధానపరమైన సమన్వయం లోపించడం స్వల్పకాలానికి రిస్కు ప్రీమియాన్ని భారీగా పెంచుతుంది. ఇప్పటికే ఎన్నికల సందర్భంగా అనిశ్చితి రాజ్యమేలుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారం రావడం మార్కెట్లను మరింత చికాకు పరుస్తుంది. రాజీనామా వ్యవహారం మానిటరీ పాలసీపై పెద్దగా ఉండకపోవచ్చు. కానీ ఆర్‌బీఐ దైనందిన వ్యవహారాలను ఇబ్బంది పెట్టవచ్చు. 
- మాక్క్వైరీ: రాజీనామా వ్యవహారం మార్కెట్లలో మరిన్ని ఊహాగానాలకు దారి తీయవచ్చు. మార్కెట్లు ఈ అంశానికి వేగంగా స్పందించవచ్చు. ఎన్నికల ఫలితాలు మార్కెట్లను మరింతగా కంగారు పెట్టవచ్చు.
- బోఫాఎంఎల్‌: ఇకమీదట మానిటరీ పాలసీ వ్యవహారాల్లో రాజకీయ జోక్యం ఎక్కువ కావచ్చు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది అత్యంత కీలకం. రాబోయే రోజుల్లో వడ్డీరేట్లలో 25 బీపీఎస్‌ మేర తగ్గింపు ఆశించవచ్చు. 
- యూబీఎస్‌: కేంద్రబ్యాంకు విశ్వసనీయత రిస్కులో పడితే దేశీయ బాండ్లు తదితర అసెట్లకు భారీ నెగిటివ్‌గా చెప్పవచ్చు. అందుకే మార్కెట్లు ఇలా క్షీణించాయి. కానీ దీర్ఘకాలంలో దేశీయ ఈక్విటీలు తిరిగి పుంజుకొని ఊపందుకుంటాయని అంచనా. 

 



You may be interested

52 వారాల కనిష్టానికి 200కుపైగా స్టాక్స్‌

Tuesday 11th December 2018

ఎన్‌ఎస్‌ఈలో మంగళవారం మార్నింగ్‌ ట్రేడింగ్‌లో 200కుపైగా స్టాక్స్‌ 52 వారాల కనిష్ట స్థాయికి పతనమయ్యాయి. ఇందులో అబాన్‌ ఆఫ్‌షోర్‌, అరియన్‌ప్రో సొల్యూషన్స్‌, బజాజ్‌ కార్ప్‌, భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌, బినాని ఇండస్ట్రీస్‌, సిప్లా, దీపక్‌ ఫెర్టిలైజర్స్‌, జీపీటీ, ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్‌, హిందుజా వెంచర్స్‌, ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌, వొడాఫోన్‌ ఐడియా, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్ట్‌, జైన్‌ ఇరిగేషన్‌, లక్స్‌ ఇండస్ట్రీస్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఎన్‌బీసీసీ, ఎన్‌టీపీసీ, ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌

మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 11th December 2018

వివిధ వార్తలను అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు బ్యాంకింగ్‌ రంగ షేర్లు:- ఆర్‌బీఐ ఛైర్మన్‌ ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామా చేసిన చేయడం ఆ ప్రభావం బ్యాంకింగ్‌ షేర్లపై పడవచ్చు. లుపిన్‌:- గుండె జబ్బుల నివారణ చికిత్సలో ఉపయోగించే ఎపిక్సాబాన్‌ ఔషధాలకు యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి అనుమతులు దక్కించుకున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌:- దేశీయ మార్కెట్లో బాసెల్‌-III నిబంధనలకు అనుగుణంగా అన్‌సెక్యూర్డ్‌ ధీర్ఘకాలిక బాండ్ల జారీ ద్వారా నిధుల సమీకరణకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ల కమిటీ ఆమోదం తెలిపింది. విప్రో:-

Most from this category