STOCKS

News


స్ర్తీ, శిశు సంక్షేమానికి 20శాతం అధిక నిధులు

Saturday 2nd February 2019
news_main1549101685.png-23972

న్యూఢిల్లీ: స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖకు ఈ సారి బడ్జెట్లో కేటాయింపులు పెరిగాయి. తాజా బడ్జెట్లో ఈ శాఖకు రూ. 29164.90 కోట్లు కేటాయించారు. గతేడాది కేటాయించిన రూ. 24758.62 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు 20 శాతం అధికం. రాబోయే ఐదేళ్లకు చేపట్టాల్సిన పనుల గురించి రోడ్‌ మ్యాప్‌ తయారు చేస్తామని స్త్రీశిశు సంక్షేమమంత్రి మనేకా గాంధీ చెప్పారు. దేశవ్యాప్తంగా స్త్రీలు, పిల్లల కోసం ఏకీకృత కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. దేశ జనాభాలో 40 శాతమున్న పిల్లలకు జరపాల్సిన కేటాయింపులు మాత్రం అంచనాలకు అనుగుణంగా లేవని ఛైల్డ్‌ రైట్స్‌ అండ్‌ యూ సంస్థ సీఈఓ పూజా మర్వాహా పెదవివిరిచారు. బడ్జెట్‌ ప్రసంగంలోకానీ, విజన్‌ 2030లో కానీ పిల్లల ప్రస్తావనే లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సుకన్య సమృద్ధి యోజన ప్రస్తావన లేకపోవడంపై కూడా ఎన్‌జీవోలు నిరాశ వ్యక్తం చేశాయి.
ప్రధాన కేటాయింపులు:
- ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకానికి కేటాయింపులు రూ. 1200 కోట్ల నుంచి రూ. 2500 కోట్లకు పెంపు.
- ఈ పథకం కింద గర్భిణి స్త్రీలు, బాలింతలకు రూ. 6000 సాయం.
- జాతీయ పౌష్ఠికాహార మిషన్‌(ఎన్‌ఎన్‌ఎం) ద్వారా పదికోట్ల మందికి ప్రయోజనం. ఈ పథకానికి రూ. 3,400 కోట్ల కేటాయింపు.
- శిశు అభివృద్ధి సేవలకు కేటాయింపులు రూ. 925 కోట్ల నుంచి రూ. 1500కు పెంపుదల.
- బేటీ బచావ్‌, బేటీ పడావో పథకానికి రూ. 200 కోట్ల నుంచి రూ. 280 కోట్ల కేటాయింపుల పెంపుదల.
- అంగన్‌వాడీ సేవలకు రూ. 19,834.37 కోట్ల కేటాయింపులు.
- నేషనల్‌ క్రెచ్‌ స్కీమ్‌కు రూ. 30 కోట్ల నుంచి రూ. 50 కోట్లకు కేటాయింపులు పెంచారు.
- వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టల్‌ పథకానికి కేటాయింపులు రూ. 52 కోట్ల నుంచి రూ. 165 కోట్లకు పెంపు.
- మహిళా శక్తి కేంద్రాల పథకానికి కేటాయింపులు రూ. 115 నుంచి రూ. 150 కోట్లకు పెంచారు.
- ఉజ్వల(అక్రమ రవాణా నుంచి కాపాడిన మహిళలను ఆదుకునే పథకం)కు కేటాయింపులు రూ. 20 కోట్ల నుంచి రూ.30 కోట్లకు, విడో గృహాలకు రూ. 8 కోట్ల నుంచి రూ. 15 కోట్లకు పెంచారు.
- మహిళా సాధికారిత, సశక్తిత మిషన్‌కు బడ్జెట్‌ను రూ. 1156 కోట్ల నుంచి రూ. 1330 కోట్లకు పెంపుదల.



You may be interested

విదేశాంగ శాఖకు రూ.16 వేల కోట్లు!

Saturday 2nd February 2019

మాల్దీవులతోపాటు ఆఫ్రికాకు పెరగనున్న సాయం న్యూఢిల్లీ: 2019-20 మధ్యంతర బడ్జెట్‌లో విదేశాంగ శాఖకు రూ.16వేల కోట్లను ప్రభుత్వం కేటాయించింది. గత బడ్జెట్‌తో పోలిస్తే ఇది రూ.వెయ్యి కోట్లు ఎక్కువ. ఇందులో ఎంతో వ్యూహాత్మకమైన మాల్దీవులతోపాటు ఆఫ్రికా దేశాలకు అందజేసే సాయం భారీగా పెరిగింది. గత బడ్జెట్‌లో విదేశాలకు అందించిన సాయం రూ.5,545 కోట్లు కాగా ఈసారి ఆ మొత్తాన్ని రూ.6,447 కోట్లకు ప్రభుత్వం పెంచింది. దీన్లో మాల్దీవులకు అందజేసే సాయం రూ.125

ఈశాన్య రాష్ట్రాలకు రూ.58,166 కోట్లు

Saturday 2nd February 2019

21 శాతం పెరిగిన బడ్జెట్‌ కేటాయింపులు న్యూఢిల్లీ: 2019-20 మధ్యంతర బడ్జెట్‌లో కేంద్రం ఈశాన్య రాష్ట్రాలకు 21 శాతం అదనంగా కేటాయింపులు జరిపింది. ఈ విషయమై కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌ మాట్లాడుతూ.. ఈసారి ఈశాన్య రాష్ట్రాలకు రూ.58,166 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. గతేడాదితో పోల్చుకుంటే ఇది 21 శాతం అధికమన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మౌలికవసతుల అభివృద్ధితో ఈశాన్య రాష్ట్రాలు గణనీయంగా లబ్ధి పొందాయని వ్యాఖ్యానించారు. బ్రహ్మపుత్ర నదిలో

Most from this category