STOCKS

News


విదేశాలకూ వైశ్యా బిజినెస్‌ నెట్‌వర్క్‌

Tuesday 30th October 2018
news_main1540879990.png-21581

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన వైశ్య బిజినెస్‌ నెట్‌వర్క్‌ (వీబీఎన్‌)... విదేశాల్లో అడుగుపెడుతోంది. ప్రస్తుతం 130 మంది సభ్యులతో రెండు చాప్టర్లను విజయవంతంగా కొనసాగిస్తున్నట్టు వీబీఎన్‌ ఫౌండర్‌ శివకుమార్‌ ఇమ్మడి సోమవారం మీడియాకు తెలిపారు. 2022 నాటికి భారత్‌లో 30, విదేశాల్లో 5 చాప్టర్లుంటాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నెట్‌వర్క్‌ సభ్యుల రెఫరల్స్‌ ద్వారా గతేడాది రూ.1,000 కోట్ల వ్యాపారం జరిగిందని వీబీఎన్‌ సభ్యులు కౌటికె విఠల్‌ వెల్లడించారు. ఔత్సాహిక యువ వ్యాపారవేత్తలను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు రానున్న రోజుల్లో ఫండ్‌ ఒకటి ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉందని మరో సభ్యులు మానేపల్లి మురళికృష్ణ పేర్కొన్నారు. ‘సభ్య కంపెనీల్లో కార్పస్‌ ఫండ్‌ చాలా మటుకు వినియోగానికి నోచుకోకుండా మిగిలిపోయి ఉంది. ఈ ఫండ్‌ను వాడుకోల్సిందిగా కంపెనీలు కోరుతున్నాయి’ అని వివరించారు. వీబీఎన్‌ తొలిసారిగా ఉత్సవ్‌ బజార్‌ పేరిట నవంబరు 3, 4 తేదీల్లో తాజ్‌ కృష్ణాలో ప్రాపర్టీ, జువెల్లరీ, లైఫ్‌స్టైల్‌ ఎక్స్‌పో నిర్వహిస్తోంది. 76 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నట్టు నెట్‌వర్క్‌ సభ్యులు శ్రీకర్‌ ఆలపాటి చెప్పారు.



You may be interested

విజయ బ్యాంక్‌ లాభం 24శాతం

Tuesday 30th October 2018

తగ్గిన మొండి బకాయిలు 12 శాతం పెరిగిన మొత్తం ఆదాయం బెంగళూరు: ప్రభుత్వ రంగ విజయ బ్యాంక్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో 25 శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.185 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.140 కోట్లకు తగ్గిందని విజయ బ్యాంక్‌ తెలిపింది. కేటాయింపులు అధికంగా ఉండటం వల్ల నికర లాభం తగ్గిందని బ్యాంక్‌ ఎమ్‌డీ, సీఈఓ ఆర్‌.ఎస్‌. శంకర

ఆర్‌బీఐలో కేంద్రం జోక్యం వద్దు

Tuesday 30th October 2018

- దాని స్వయంప్రతిపత్తిని కాపాడాలి - కేంద్రానికి ఆర్‌బీఐ ఉద్యోగుల సంఘం హితవు ముంబై: ఆర్‌బీఐ స్వతంత్రతను కాపాడాలంటూ డిప్యూటీ గవర్నర్‌ విరాళ్‌ ఆచార్య తన గళాన్ని వినిపించిన రెండు రోజులకే.. ఆర్‌బీఐ ఉద్యోగుల సంఘం మద్దుతుగా ముందుకొచ్చింది. ఆర్‌బీఐ స్వతంత్రతను తక్కువ చేసి చూడడమే ఉపద్రవానికి కారణమని ఆల్‌ ఇండియా రిజర్వ్‌ బ్యాంకు అసోసియేషన్‌ పేర్కొంది. ఆర్‌బీఐ స్వయం ప్రతిపత్తిని తగ్గించే ప్రయత్నాలను కేంద్రం మానుకోవాలని ఓ లేఖలో కోరింది. ప్రభుత్వాలు

Most from this category