STOCKS

News


ఓల్టాస్‌ లాభం రూ.107 కోట్లు

Wednesday 7th November 2018
Markets_main1541577394.png-21771

- 12 శాతం వృద్ధి
- రూమ్‌ ఏసీల్లో 2 శాతం పెరిగిన మార్కెట్‌ వాటా

న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌నకు చెందిన ఓల్టాస్‌ కంపెనీ నికర లాభం కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 12 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.95 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.107 కోట్లకు పెరిగిందని ఓల్టాస్‌ తెలియజేసింది. కార్యకలాపాల ద్వారా సమకూరిన ఆదాయం రూ.1,032 కోట్ల నుంచి 37 శాతం వృద్ధితో రూ.1,415 కోట్లకు పెరిగిందని పేర్కొంది. గత క్యూ2లో రూ.87 కోట్లుగా ఉన్న ఎబిటా ఈ క్యూ2లో 25 శాతం వృద్ధితో రూ.109 కోట్లకు పెరిగింది. నిర్వహణ మార్జిన్‌ 8.4 శాతం నుంచి 7.6 శాతానికి తగ్గిందని కంపెనీ తెలిపింది.
కొనసాగుతున్న అగ్రస్థానం
రూమ్‌ ఏసీల మార్కెట్లో తమ అగ్రస్థానం కొనసాగుతోందని ఓల్టాస్‌ తెలిపింది. గత క్యూ2లో 23.2 శాతంగా ఉన్న తమ మార్కెట్‌ వాటా ఈ క్యూ2లో 25.6 శాతానికి పెరిగిందని పేర్కొంది. ఏసీ ఉత్పత్తులను పునర్వ్యస్థీకరించామని, విద్యుత్తు ఆదా చేసే ఇన్వర్టర్‌ సెగ్మెంట్లో అందించిన ఏసీ మోడళ్లకు మంచి స్పందన లభిస్తోందని వివరించింది. ఎలక్ట్రో-మెకానికల్‌ ప్రాజెక్ట్‌ల విభాగం ఆదాయం రూ.557 కోట్ల నుంచి రూ.901 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఇంజినీరింగ్‌ ఉత్పత్తులు, సేవల విభాగం ఆదాయం రూ.67 కోట్ల నుంచి రూ.73 కోట్లకు చేరింది.You may be interested

రూ.25 కోట్ల రికవరీకి ఎన్‌సీఎల్‌టీకి ఇండస్‌ఇండ్‌

Wednesday 7th November 2018

ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభంలో తాజా పరిమాణం న్యూఢిల్లీ: సంక్షోభంలో కూరుకుపోయిన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ నుంచి రావాల్సిన రూ.25 కోట్ల వడ్డీ రికవరీకి ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ ఎన్‌సీఎల్‌ఏటీ (నేషనల్‌ కంపెనీ లా అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌)ని ఆశ్రయించింది. ఈ అంశంపై ప్రభుత్వానికి జస్టిస్‌ ఎస్‌జే ముఖోపాధ్యాయ నేతృత్వంలోని ఇరువురు సభ్యుల ఎన్‌సీఎల్‌ఏటీ బెంచ్‌ నోటీసులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి ప్రధాన కేసు విచారణ జరిగే నవంబర్‌ 13వ తేదీకే ఇండస్‌ఇండ్‌ తాజా పిటిషన్‌పై విచారణనూ

ఆదిత్యా బిర్లా క్యాపిటల్‌ లాభం 13శాతం డౌన్‌

Wednesday 7th November 2018

-రూ.3,590 కోట్లకు పెరిగిన మొత్తం ఆదాయం న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా క్యాపిటల్‌ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో రూ.195 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.225 కోట్ల నికర లాభం వచ్చిందని, 13 శాతం క్షీణత నమోదైందని ఆదిత్య బిర్లా క్యాపిటల్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.2,699 కోట్ల నుంచి రూ.3,590 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఆదిత్య బిర్లా గ్రూప్‌ ఆర్థిక సేవల

Most from this category