STOCKS

News


బ్యాంకులకు మాల్యా కొత్త ఆఫర్‌

Wednesday 5th December 2018
news_main1543992937.png-22659

ప్రత్యక్షంగా బ్యాంకులకు పరోక్ష్యంగా దేశ ప్రజానీకానికి కుచ్చు టోపి పెట్టి విదేశానికి పరారైన విజయ్‌ మాల్యా పంథం మార్చుకున్నట్లున్నారు. ఈయన శ్రీమంతుడు సినిమాలోని ‘తిరిగిచ్చేయాలి లేకపోతే లావైపోతారు’ అనే డైలాగ్‌ విన్నారో ఏమో కానీ.. బ్యాంకుల దగ్గర తీసుకున్న రూ.5,500 కోట్లను (ఆసలు మాత్రమే వడ్డీ కాదు) తిరిగి చెల్లిచేస్తానంటూ ట్వీట్‌ చేశారు. తీసుకున్న రుణాలను చెల్లించకుండా దేశం విడిచి పారిపోయిన మాల్యా గత రెండేళ్లుగా యూకేలో నివసిస్తున్న విషయం తెలిసిందే.  
‘అధిక ఏటీఎఫ్‌ ధరల వల్ల ఎయిర్‌లైన్స్‌ వ్యాపారంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ నడిపే సమయంలో క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 140 డాలర్ల వద్ద ఉంది. నష్టాలు కొండలా పేరుకుపోయాయి. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలన్నీ వీటిని పూడ్చడానికే అయిపోయాయి. నేను బ్యాంకుల నుంచి తీసుకున్న అసలు మొత్తాన్ని పూర్తిగా చెల్లించేస్తా. దయచేసి తీసుకోండి’ అని ట్వీట్‌ చేశారు. ‘మూడు దశాబ్దాల నుంచి దేశీ అతిపెద్ద అల్కాహాలిక్‌ బేవరేజ్‌ గ్రూప్‌ను నడుపుతూ రాష్ట్రాల ఖజానాకు వేల కోట్ల రూపాయలను సమకూర్చాం. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ వల్ల కూడా ప్రభుత్వాలకు ఆదాయం లభించింది. ఎయిర్‌లైన్స్‌ వ్యాపారాన్ని కోల్పోవడం బాధాకరం. అయినా కూడా నేను బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను చెల్లిస్తా. నష్టం ఉండదు. తీసుకోండి’ అని మరొక ట్వీట్‌ చేశారు.  

కాగా రాజకీయంగా చాలా సున్నితమైన అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ హెలిక్యాప్టర్ల కొనుగోలు కుంభకోణంలో మధ్యవర్తిగా ఆరోపణలు ఎదుర్కొంటోన్న క్రిస్ట్రియన్‌ జేమ్స్‌ మైకెల్‌ను యూఏఈ.. భారత్‌కు అప్పగించిన కొన్ని గంటల తర్వాత విజయ్‌ మాల్యా పై విధంగా ట్వీట్‌ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. 
 You may be interested

టాటామోటర్స్‌కు రేటింగ్‌ షాక్‌..!

Wednesday 5th December 2018

3.50శాతం నష్టపోయిన షేరు అటోమెబైల్‌ దిగ్గజం టాటా మోటర్స్‌ షేర్లకు బుధవారం రేటింగ్‌ షాక్‌ తగిలింది. తన అనుబంధ బ్రిటన్‌ సంస్థ  జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌(జేఎల్‌ఆర్‌) రేటింగ్స్‌ను.... రేటింగ్‌ సంస్థ ఎస్‌అండ్‌పీ డౌన్‌గ్రేడ్‌ చేయడంతో టాటా మోటర్స్‌ కంపెనీ షేర్లు 3.50శాతం నష్టపోయాయి. ఆదాయాలు ఆశించిన స్థాయిలో నమోదుకాకపోవడంతో ఎస్‌అండ్‌పీ సంస్థ... కంపెనీ ‘‘రుణ రేటింగ్‌’’ను బిబి స్థాయి నుంచి బిబి నెగిటివ్‌ స్థాయికి కుదించినట్లు టాటామోటర్స్‌ తెలిపింది. అలాగే జేఎల్‌ఆర్‌

కళ తప్పిన మెటల్‌ షేర్లు

Wednesday 5th December 2018

అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగా దేశీయ మార్కెట్లో బుధవారం మెటల్‌ షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఇటీవల అమెరికా-చైనా దేశాల కుదిరిన వాణిజ్య యుద్ధ సం‍ధి ప్రశ్నార్థకంగా మారడంతో లండన్‌ స్టాక్‌ ఎక్చ్సేంజ్‌లో మెటల్‌ ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. అలాగే ప్రపంచ అతిపెద్ద మెటల్‌ వినియోగదారుగా పేరోందిన చైనా మెటల్‌ డిమాండ్‌ పై ఆందోళనలు రేకెత్తాయి. ఈ ప్రతికూలాంశాలు దేశీయ మెటల్‌ స్టాక్స్‌ ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో

Most from this category