STOCKS

News


మాల్యా దివాలా కేసు ఇక బ్రిటన్‌ హైకోర్టులో

Wednesday 19th December 2018
news_main1545194198.png-23067

లండన్‌: మాజీ లిక్కర్‌ వ్యాపారి, బ్యాంకులకు భారీగా బకాయి పడిన విజయ్‌ మాల్యా బ్రిటన్‌ హైకోర్టులో వచ్చే ఏడాది దివాలా పిటిషన్‌పై విచారణను ఎదుర్కోనున్నారు. మాల్యా సుమారు రూ.9,000 కోట్లకు పైగా భారత బ్యాంకులకు బకాయి పడిన విషయం తెలిసిందే. ఎస్‌బీఐ ఆధ్వర్యంలోని 13 బ్యాంకుల కమిటీ ఇప్పటికే మాల్యాకు సంబంధించి ఆస్తుల జప్తు కేసును నెగ్గింది. బ్రిటన్‌కు చెందిన టీఎల్‌టీ ఎల్‌ఎల్‌పీ సంస్థ ఈ కేసు వ్యవహారాలు చూసింది. 62 సంవత్సరాల మాల్యాకు వ్యతిరేకంగా దివాలా పిటిషన్‌ను లండన్‌ హైకోర్టుకు బదిలీ చేసినట్టు టీఎల్‌టీ ఎల్‌ఎల్‌పీ తాజాగా వెల్లడించింది. 2019 సంవత్సరం మొదటి భాగంలో ఇది విచారణకు వస్తుందని తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 11నే ఈ పిటిషన్‌ను దాఖలు చేసినట్టు టీఎల్‌టీ పార్ట్‌నర్‌ పాల్‌ గెయిర్‌ తెలిపారు. మాల్యాకు సంబంధించి ఈ ఆదేశాలను నార్తాంప్టన్‌ కోర్టు జారీ చేయగా, దాన్ని విచారణ కోసం లండన్‌ హైకోర్టుకు బదిలీ చేశారు. భారత్‌లోని ఓ కోర్టు జారీ చేసిన ఆదేశాల ప్రకారం మాల్యాకు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆస్తుల్ని జప్తు చేయడానికి అనుకూలంగా ఈ ఏడాది మే నెలలో యూకే హైకోర్టు ఆదేశాలిచ్చిన విషయం గమనార్హం. 



You may be interested

వడ్డీ రేటు పెంచి మరో తప్పు చేయొద్దు

Wednesday 19th December 2018

వాషింగ్టన్‌: వడ్డీ రేట్ల పెంపుపై ఫెడరల్ రిజర్వ్‌ను (ఫెడ్‌) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ హెచ్చరించారు. రేట్లను పెంచడం ద్వారా 'మరో తప్పు' చేయవద్దని స్పష్టంచేశారు. "వాల్‌స్ట్రీట్ జర్నల్ రాసిన ఎడిటోరియల్ చూసైనా వడ్డీ రేట్ల పెంపు విషయంలో ఫెడ్ పునరాలోచన చేయాలి. మరో తప్పిదం చేయకూడదు. ఇప్పటికే లిక్విడిటీ తగ్గిపోయిన మార్కెట్‌ను మరింతగా కుంగదీయొద్దు. అర్థంపర్థం లేని గణాంకాలను పట్టుకుని కూర్చోకుండా.. మార్కెట్ పరిస్థితులను అర్థం చేసుకోండి.

‘వోగో’లో వోలా రూ.720 కోట్ల పెట్టుబడి

Wednesday 19th December 2018

న్యూఢిల్లీ: క్యాబ్‌ సేవల సంస్థ ఓలా, స్కూటర్ల షేరింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ‘వోగో’లో 100 మిలియన్‌ డాలర్లను (రూ.720 కోట్లు) ఇన్వెస్ట్‌ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ పెట్టుబడులను నేరుగా అందించకుండా, లక్ష స్కూటర్లను వోగోకు అందించనుంది. దీనివల్ల వోగో తన కార్యకలాపాల విస్తరణకు పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం రాకుండా స్కూటర్ల సరఫరాను పెంచుకోనుంది. వోగో స్కూటర్ల సేవలు ఓలా ప్లాట్‌ఫామ్‌పై ఉన్న 15 కోట్ల మంది కస్టమర్లకు త్వరలో అందుబాటులోకి

Most from this category