STOCKS

News


యూపీఐ లావాదేవీల్లో 30% వృద్ధి

Tuesday 2nd October 2018
news_main1538450825.png-20769

న్యూఢిల్లీ: యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) ద్వారా జరిగే నగదు లావాదేవీలు సెప్టెంబరులో 30 శాతం వృద్ధి రేటును నమోదుచేశాయి. నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పోరేష‌న్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) వెల్లడించిన సమాచారం ప్రకారం గత నెలలో 40.58 కోట్ల లావాదేవీలు నమోదుకాగా, ఈకాలంలో జరిగిన మొత్తం నగదు బదిలీ రూ.59,835 కోట్లుగా నిలిచాయి. అంతకుముందు నెలలో (ఆగస్టు) యూపీఐ లావాదేవీలు 31.20 కోట్లు కాగా, రూ.54,212.26 కోట్ల నగదు బదిలీ జరిగింది. డిజిటల్ లావాదేవీల సులభతరానికి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న భీమ్(భార‌త్ ఇంట‌ర్‌ఫేస్ ఫ‌ర్ మ‌నీ) యూపీఐ ఆగస్టులో 1,65,00,000 లావాదేవీలను నమోదుచేయగా.. గతనెలలో 1,63,30,000 లావాదేవీలను నమోదుచేసింది. ఆగస్టులో రూ.6,872.57 కోట్ల నగదు బదిలీ జరగగా.. సెప్టెంబరులో రూ.7,064.86 కోట్లు బదిలీ జరిగింది. ఇదే సమయంలో తాము 33 శాతం వృద్ధిరేటును నమోదు చేసినట్లు పేటీఎం వెల్లడించింది. సెప్టెంబరులో యూపీఐ ప్లాట్‌ఫామ్‌పై 13.7 కోట్ల లావాదేవీలు జరిగినట్లు పేటీఎం సినియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ దీపక్ అబ్బొట్ చెప్పారు. ఫోన్‌పే, గూగుల్‌ తేజ్‌ గణాంకాలు అధికారికంగా ఇంకా వెల్లడికావాల్సి ఉంది.



You may be interested

హెడ్‌డీఎఫ్‌సీ రిటైల్‌ రుణ రేటు పెంపు!

Tuesday 2nd October 2018

ముంబై: దేశ అతిపెద్ద మార్టిగేజ్‌ ఫైనాన్షియర్‌ హెచ్‌డీఎఫ్‌సీ తన రిటైల్‌ రుణ రేటును (ఆర్‌పీఎల్‌ఆర్‌) 10 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) పెంచింది. దీనితో రుణాలకు సంబంధించి వివిధ శ్లాబ్స్‌పై కొత్త రేట్లు 8.80 - 9.05 శ్రేణిలో ఉన్నాయి. ఈ నెల 5వ తేదీన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కీలక పాలసీ నిర్ణయం నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ తాజా నిర్ణయం తీసుకుంది.  అమల్లోకి పీఎన్‌బీ

జీఎంఆర్‌ చేతికి నాగ్‌పూర్‌ ఎయిర్‌పోర్ట్‌ ప్రాజెక్ట్‌!

Tuesday 2nd October 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: జీఎంఆర్‌ గ్రూప్‌ కంపెనీ జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ ఎయిర్‌పోర్ట్‌ అభివృద్ధి ప్రాజెక్టుకు అత్యధిక మొత్తాన్ని కోట్‌ చేసిన బిడ్డర్‌గా నిలిచింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో నాగ్‌పూర్‌లోని డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు అభివృద్ధి, కార్యకలాపాలు, నిర్వహణను అత్యధిక మొత్తం కోట్‌ చేసిన కంపెనీ చేపడుతుంది. 30 ఏళ్ల నిర్వహణతో పాటు ప్రాజెక్టులో భాగంగా కొత్తగా టెర్మినల్‌ను నిర్మించాల్సి ఉంటుంది. జీవీకే సైతం నాగ్‌పూర్‌

Most from this category