బ్యాంక్ ఉద్యోగుల సమ్మె సైరన్!!
By Sakshi

బ్యాంక్ ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. బ్యాంక్ ఆఫ్ బరోడా, దేనా బ్యాంక్, విజయ బ్యాంక్ విలీనాన్ని నిరసిస్తూ డిసెంబర్ 26న దేశవ్యాప్తంగా సమ్మె చేపడతామని బ్యాంకు యూనియన్లు తాజాగా హెచ్చరించాయి. కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్‌లోనే ఈ మూడు ప్రభుత్వ బ్యాంకులను విలీనం చేయాలని నిర్ణయించుకుంది. అలాగే ఆయా బ్యాంకులు బోర్డులు కూడా విలీనానికి అంగీకారం తెలిపాయి.
యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ఈ సమ్మెకు నేతృత్వం వహించనుంది. కేంద్ర ప్రభుత్వం, సంబంధిత బ్యాంకులు (బ్యాంక్ ఆఫ్ బరోడా, దేనా బ్యాంక్, విజయ బ్యాంక్) విలీన నిర్ణయానికి ప్రాధాన్యమిస్తూ ముందుకు కదలడంతో సమ్మెకు పిలుపునిచ్చామని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటచలం తెలిపారు. యూఎప్‌బీయూలోని అన్ని యూనియన్లు సమ్మెలో పాల్గొంటాయని నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ వైస్ ప్రెసిడెంట్ అశ్వని రాణా పేర్కొన్నారు.
కాగా పైన పేర్కొన్న మూడు ప్రభుత్వ బ్యాంకుల విలీనమైతే దేశంలోనే మూడో అతిపెద్ద బ్యాంక్ ఆవిర్భవిస్తుంది. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఇండియా (ఎస్బీఐ), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వరుసగా ఒకటి, రెండో స్థానాల్లో ఉన్నాయి.
You may be interested
స్వల్పకాలానికి 3 ట్రేడింగ్ ఐడియాలు..!
Saturday 1st December 2018ముంబై: టెక్నికల్‌గా నిఫ్టీ 11,100 పాయింట్లకు సమీపాన ఉందని, వచ్చే రెండు రోజుల్లో ఈ దశలో కన్సాలిడేషన్‌కు అవకాశం ఉందని స్వతంత్ర మార్కెట్ అనలిస్ట్ కునాల్ బోత్ర అన్నారు. ముడిచమురు ధరలు భారీగా తగ్గిన నేపథ్యంలో సూచీలకు నూతన ఉత్సాహం వచ్చిందని ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. యస్ బ్యాంక్ బోటమ్‌ను ఏర్పాటుచేస్తున్నట్లు ఉందని విశ్లేషించిన ఆయన డీఎల్ఎఫ్. రెప్కో హోమ్స్‌లో ఆకర్షణీయ కదలికలు నమోదు కాగా..
మార్కెట్ ప్రస్తుత ఆశావాదం మోసపూరితం..!
Saturday 1st December 2018సామ్కో సెక్యూరిటీస్ వ్యవస్థాపకులు, సీఈఓ జమీత్ మోడీ వ్యాఖ్య ముంబై: కొనసాగుతున్న ఎన్నికల అంశాలను పక్కన పెట్టి దేశీ స్టాక్ సూచీలు గడిచిన వారం రోజుల్లో క్రమంగా పెరుగుతూ వచ్చాయి. అమెరికా వడ్డీ రేట్లు చారిత్రక ప్రమాణాల కంటే ఇప్పటికీ తక్కువగానే ఉన్నాయని ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో సూచీలు వరుసగా 5 రోజులపాటు లాభాలను నమోదుచేశాయి. వడ్డీ రేట్లకు సంబంధించి ఈయన కీలక వ్యాఖ్యలు చేసిన