STOCKS

News


భారత టారిఫ్‌లను ఆమోదించేది లేదు

Wednesday 10th July 2019
news_main1562740104.png-26941

  • మరోసారి విరుచుకుపడ్డ ట్రంప్‌

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరోసారి భారత్‌ విధిస్తున్న టారిఫ్‌లపై మండిపడ్డారు. భారత్‌ ఎంతో కాలంగా అమెరికన్‌ ఉత్పత్తులపై టారిఫ్‌లను మోపుతోందని, వీటిని ఇంకెంత కాలం ఆమోదించలేది లేదంటూ మంగళవారం ట్వీట్‌ చేశారు. గత నెల 28న జీ-20 దేశాల సమావేశం సందర్భంగా ట్రంప్‌, మన దేశ ‍ప్రధానితో సమావేశం అవడం, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య వివాదాస్పద అంశాలపై సత్వర చర్చకు అంగీకారానికి వచ్చిన విషయం తెలిసిందే. ఇది జరిగిన కొన్ని రోజులకే ట్రంప్‌ భారత్‌ పట్ల తన కఠిన వైఖరిని మరోసారి తన మాటల ద్వారా ప్రదర్శించుకున్నారు. అమెరికా వాణిజ్య మంత్రి విల్‌బర్‌రాస్‌, ఇంధన మంత్రి రిక్‌పెర్రీ ఈ వారం చివర్లో వాషింగ్టన్‌లో భారత్‌కు సంబంధించి జరిగే ఓ సదస్సును ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సందర్భంలో ట్రంప్‌ వ్యూహాత్మకంగా భారత్‌ టారిఫ్‌లపై మరోసారి మాట్లాడడం గమనార్హం. గత నెలలో అమెరికాకు చెందిన బాదం, యాపిల్‌ సహా 28 ఉత్పత్తులపై భారత్‌ టారిఫ్‌లు పెంచుతూ నిర్ణయాన్ని అమలు చేసింది. గతేడాది మన దేశ అల్యూమినియం, స్టీల్‌ దిగుమతులపై అమెరికా విధించిన దిగుమతి సుంకాలకు ప్రతీకారంగానే ఈ నిర్ణయాన్ని ఆలస్యంగా అమలు చేసింది. ఇది తమకు ఆమోదం కాదని, భారత్‌ అమెరికాకు వ్యతిరేకంగా ఎక్కువ టారిఫ్‌లను అమలు చేస్తోందని, ఈ విషయమై ప్రధాని మోదీతో మాట్లాడాలనుకుంటున్నట్టు జీ20 దేశాల సమావేశానికి ముందు ట్రంప్‌ ట్వీట్‌ చేయడం తెలిసిందే. హార్లే డేవిడ్సన్‌ బైకులపై భారత్‌ భారీ టారిఫ్‌లు విధిస్తోందని అంతకుముందు పలు సందర్భాల్లోనూ ట్రంప్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు.



You may be interested

టీసీఎస్‌ లాభం రూ.8,131 కోట్లు

Wednesday 10th July 2019

11 శాతం వృద్ధి  ఆదాయం కూడా 11 శాతం అప్‌ ఒక్కో షేర్‌కు రూ. 5 డివిడెండ్‌ ఈ క్యూ1లో 12,356 నికర ఉద్యోగాలు  గత ఐదేళ్లలో ఇదే అత్యధికం  ముంబై: ఐటీ దిగ్గజం టీసీఎస్‌ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. నికర లాభం అంచనాలను మించగా, ఆదాయం, మార్జిన్ల విషయంలో అంచనాలు మిస్‌ అయ్యాయి.  జూన్‌ 30తో ముగిసిన మూడు నెలల కాలానికి నికర లాభం 11 శాతం

4రోజూ కొనసాగుతున్న పసిడి పతనం

Wednesday 10th July 2019

ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల కోత విధింపు సందేహాలతో పసిడి పతనం కొనసాగుతుంది. వరుసగా 4రోజూ నష్టాల బాట పట్టింది. ఆసియా మార్కెట్లో ఔన్స్‌ పసిడి ధర 5డాలర్లు క్షీణించి 1,395.15 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. గతవారంలో శుక్రవారం అమెరికా జూన్‌ మాసపు ఉద్యోగ గణాంకాలు అంచనాలకు మించి నమోదయ్యాయి. దీంతో ఈ జూలై 30-31 తేదిల్లో జరగనున్న ఫెడ్‌ రిజర్వ్‌ సమావేశంలో కీలక వడ్డీరేట్లు తగ్గింపు మార్కెట్‌ వర్గాల్లో

Most from this category