News


అవాంఛిత కాల్స్‌పై టెల్కోలకు గడువు పొడిగింపు

Saturday 22nd December 2018
news_main1545451010.png-23159

న్యూఢిల్లీ: అవాంఛిత కాల్స్‌, మెసేజీలపై యూజర్లు ఫిర్యాదు చేసేందుకు ఉద్దేశించిన ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు టెల్కోలకు విధించిన గడువును ట్రాయ్ ఫిబ్రవరి ఆఖరు దాకా పొడిగించింది. అప్పటికీ ఏర్పాటు చేయకపోతే మార్చి నుంచి నెలకు గరిష్టంగా రూ. 50 లక్షల దాకా జరిమానా విధించే అవకాశం ఉంది. వ్యాపారపరమైన అవాంఛిత కాల్స్‌, మెసేజీల నియంత్రణ నిబంధనలను టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ జూలైలో నోటిఫై చేసింది. ఇందులో భాగంగా ఫిర్యాదుల కోసం యంత్రాంగాన్ని 150 రోజుల్లోగా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. దీన్నే ఫిబ్రవరి 28 దాకా పొడిగిస్తూ ట్రాయ్ తత్సంబంధిత నిబంధనలకు సవరణ చేసింది. 



You may be interested

సింగ్‌ సోదరుల నుంచి రూ.403 కోట్లు వసూలు చేయండి

Saturday 22nd December 2018

న్యూఢిల్లీ: శివిందర్‌ మోహన్‌ సింగ్‌, మల్విందర్‌ మోహన్‌ సింగ్‌ల నుంచి రూ.403 కోట్లు రికవరీ చేయాలని సెబీ శుక్రవారం ఆదేశించింది. వీళ్లిద్దరితో పాటు మరో ఏడు ఇతర సంస్థల నుంచి ఈ మొత్తంతో పాటు వడ్డీని కూడా మూడు నెలల్లో రికవరీ చేయాలని ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌, ఫోర్టిస్‌ హాస్పిటల్స్‌కు సెబీ ఆదేశాలు జారీ చేసింది. సింగ్‌ సోదరులతో పాటు ఆర్‌హెచ్‌సీ హోల్డింగ్స్‌, రెలిగేర్‌ ఫిన్‌వెస్ట్‌, శివి హోల్డింగ్స్‌, మలవ్‌ హోల్డింగ్స్‌,

2019-20లో జీడీపీ వృద్ధి 7.4 శాతం

Saturday 22nd December 2018

ముంబై: దేశ జీడీపీ వృద్ధి రేటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7.4 శాతం వరకు నమోదు కావచ్చని ఐసీఐసీఐ బ్యాంకు అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మాత్రం వృద్ధి రేటును 7.2 శాతానికి తగ్గించింది. వినియోగం సెప్టెంబర్‌ త్రైమాసికంలో తక్కువగా ఉండడమే ఇందుకు కారణం. వృద్ధి వేగంగా పుంజుకోకపోవచ్చని తాము భావిస్తున్నట్లు ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్స్‌ హెడ్‌ బి ప్రసన్న తెలిపారు. వృద్ధి రికవరీ వినియోగం ఆధారితంగా కాకుండా

Most from this category