STOCKS

News


ట్రాయ్‌ పరిధిలోకి వాట్సాప్‌, గూగుల్‌ డూయో!?  

Tuesday 13th November 2018
news_main1542085255.png-21929

న్యూఢిల్లీ: టెలికం సంస్థల మాదిరే మెస్సేజ్‌లు, కాల్స్‌కు అవకాశం కల్పిస్తున్న వాట్సాప్‌, స్కైప్‌, ఫేస్‌బుక్‌, గూగుల్‌ డుయో తదితర ఓవర్‌ ద టాప్‌ (ఓటీటీ) సేవలను నియంత్రణ పరిధిలోకి తీసుకురావాలన్న అంశంపై ట్రాయ్‌ సంప్రతింపుల పత్రాన్ని విడుదల చేసింది. ఇందుకు సంబంధించి ప్రస్తుత నియంత్రణ విధానంలో తేవాల్సిన మార్పులపై విశ్లేషణకు, చర్చకు అవకాశం కల్పించడం కోసం ఈ పత్రాన్ని తీసుకొచ్చింది. ఇంటర్నెట్‌ ఆధారంగా కాల్స్‌, మెస్సేజింగ్‌ సేవల అప్లికేషన్లను ఓటీటీగా పేర్కొంటారు. స్కైప్‌, వాట్సాప్‌, వైబర్‌, హైక్‌, ట్విట్టర్‌ తదితర అప్లికేషన్లన్నీ ఓటీటీ సేవలకు సంబంధించినవే. టెలికం కంపెనీలు అందించే సేవలకు సమానంగానే ఈ ఓటీటీ సేవలను కూడా పరిగణించి... నియంత్రణ, లైసెన్సింగ్‌ నిబంధనల విషయంలో ఒకే విధంగా వ్యవహరించాలా? అన్న దానిపై పరిశ్రమ అభిప్రాయాలను ట్రాయ్‌ కోరింది. టెలికం కంపెనీలు భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టి సేవలు అందిస్తుంటే, ఓటీటీ సేవల కంపెనీలు పెద్దగా పెట్టుబడులు అవసరం లేకుండానే టెలికం నెట్‌వర్క్‌లపై ఈ సేవల్ని అందించే అవకాశం ఉండడం గమనార్హం. దీంతో ఓటీటీకి, టెలికం కంపెనీలకు నియంత్రణ లేదా లైసెన్సింగ్‌ నిబంధనల పరంగా ఉన్న అసమతుల్యత వల్ల... అది టెలికం నెట్‌వర్క్‌ల విస్తరణ, టెక్నాలజీ ఉన్నతీకరణ కోసం కంపెనీలు చేసే పెట్టుబడులపై ప్రభావం చూపిస్తుందా? అలాగే, టెలికం నెట్‌వర్క్‌లపై ఓటీటీ సేవల సంస్థలు పెట్టుబడులు పెట్టే అవకాశం కల్పించడం ఎలా అన్న అంశాలు కూడా ఈ చర్చా పత్రంలో ఉన్నాయి. ఇందులో పేర్కొన్న అంశాలపై డిసెంబర్‌ 10 వరకు పరిశ్రమ తన అభిప్రాయాలను తెలియజేయాలని ట్రాయ్‌ కోరింది. ట్రాయ్‌ తాజా ప్రతిపాదనలు స్కైప్‌, వాట్సాప్‌, వైబర్‌, హైక్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ తదితర సంస్థలపై ‍ప్రభావం చూపిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, ఇవి వీడియో అగ్రిగేషన్‌ సైట్లకు వర్తించదు. 



You may be interested

యూకో బ్యాంక్‌కు మొండి సెగ

Tuesday 13th November 2018

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ యూకో బ్యాంక్‌ నష్టాలు ఈ క్యూ2లో మరింతగా పెరిగాయి. గత క్యూ2లో రూ.623 కోట్ల నికర నష్టాలు రాగా, ఈ క్యూ2లో రూ.1,136 కోట్ల నికర నష్టాలు వచ్చాయని యూకో బ్యాంక్‌ తెలిపింది. మొండి బకాయిలు భారీగా పెరగడం వల్ల ఈ స్థాయిలో నష్టాలు పెరిగాయని తెలియజేసింది. మొత్తం ఆదాయం రూ.3,758 కోట్ల నుంచి రూ.3,749 కోట్లకు తగ్గింది.  తగ్గిన రుణ నాణ్యత  బ్యాంక్‌ రుణ నాణ్యత మరింతగా

లిక్విడిటీ ఫండ్స్‌కు లాకిన్‌?

Tuesday 13th November 2018

న్యూఢిల్లీ: ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం అనంతరం మార్కెట్లో లిక్విడిటీ (నిధుల లభ్యత) సమస్య నెలకొనడంతో లిక్విడిటీ ఫండ్స్‌ విషయంలో కఠిన నిబంధనలను తీసుకురావాలని సెబీ యోచిస్తోంది. లిక్విడ్‌ ఫండ్స్‌లో పెట్టుబడులను ఇన్వెస్ట్‌ చేసిన తర్వాత ఎప్పుడైనా తీసుకునే వెసులుబాటు ప్రస్తుతం ఉంది. అయితే, స్వల్ప కాలం పాటు లాకిన్‌ తీసుకురావాలన్నది సెబీ ప్రతిపాదనగా తెలిసింది. 30 రోజులు అంతకంటే ఎక్కువ కాల వ్యవధి కలిగిన బాండ్ల విలువను మార్క్‌ టు మార్కెట్‌

Most from this category