STOCKS

News


క్యూ3లో క్యాడ్‌ 2.5 శాతం

Saturday 30th March 2019
Markets_main1553934024.png-24874

ముంబై: దేశ కరెంట్‌ అకౌంట్‌ లోటు (సీఏడీ- క్యాడ్‌) అక్టోబర్‌-డిసెంబర్‌ కాలంలో (ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికం) ఇదే కాలం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)తో పోల్చిచూస్తే, 2.5 శాతంగా నమోదయ్యింది.   విలువలో క్యాడ్‌ పరిమాణం 16.9 బిలియన్‌ డాలర్లు. 2017- 2018 ఇదే త్రైమాసికంలో ఈ విలువ 13.7 బిలియన్‌ డాలర్లు. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్‌ మధ్య ఈ విలువ 19.1 బిలియన్‌ డాలర్లు (జీడీపీలో 2.9 శాతం). రిజర్వ్‌ బ్యాం‍క్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) శుక్రవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. కాగా 2018 ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ వరకూ మొత్తం కాలాన్ని తీసుకుంటే, క్యాడ్‌  జీడీపీలో 2.6 శాతంగా నమోదయ్యింది. 2017 ఇదే కాలంలో ఈ రేటు 1.8 శాతం. ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో దేశంలోకి వచ్చీ-పోయే విదేశీ మారకద్రవ్యం (ఎఫ్‌ఐఐ, ఎఫ్‌డీఐ, ఈసీబీలు మినహా) మధ్య నికర వ్యత్యాసమే కరెంట్‌ అకౌంట్‌ లోటు.



You may be interested

కేంద్రానికి ఆదాయాల ‘మందగమనం’

Saturday 30th March 2019

కేంద్రానికి ఆదాయాల ‘మందగమనం’ - లక్ష్యం 6.34 లక్షల కోట్లు - ఫిబ్రవరి ముగింపుకే  రూ.8.51 లక్షల కోట్లు - ఆర్థిక సంవత్సరంలో మరో నెల - లక్ష్యాన్ని దాటనివ్వమంటున్న కేం‍ద్రం న్యూఢిల్లీ:  ప్రభుత్వ ఆదాయాలు - వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం- ద్రవ్యలోటు లెక్కలు ఆందోళన సృష్టిస్తున్నాయి. ఆదాయాలు తగ్గడం, వ్యయాలు పెరగడం దీనికి కారణం. శుక్రవారం విడుదలయిన కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ గణాంకాలను పరిశీలిస్తే... - ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018 ఏప్రిల్ -

3 లక్షల డీ రిజిస్టర్డ్‌ సంస్థలపై దర్యాప్తు

Saturday 30th March 2019

ఐటీ శాఖను కోరిన సీబీడీటీ పన్ను ఎగవేత, మనీలాండరింగ్‌ నిగ్గు తేల్చాలని ఆదేశం న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ రద్దు చేసిన మూడు లక్షల సంస్థలపై విచారణ జరపాలని ఆదాయపన్ను శాఖ అధికారులకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) ఆదేశాలు జారీ చేసింది. ఈ సంస్థలు పన్ను ఎగవేతతోపాటు పెద్ద నోట్ల రద్దు సమయంలో మనీలాండరింగ్‌ కార్యకలాపాలకు వేదికగా ఉపయోగపడ్డాయా అన్నది తేల్చాలని కోరింది. దీన్నో ప్రత్యేక కార్యక్రమం కింద చేపట్టాలని

Most from this category