STOCKS

News


రూ. 518 లక్షల కోట్లకు వ్యక్తిగత సంపద

Friday 7th December 2018
news_main1544161381.png-22720

హైదరాబాద్‌: వచ్చే అయిదేళ్ల వ్యవధిలో దేశీయంగా వ్యక్తుల దగ్గరుండే మొత్తం సంపద ఏటా 17 శాతం చొప్పున వృద్ధి చెందనుంది. 2023 ఆర్థిక సంవత్సరం నాటికి ఇది రూ.518 లక్షల కోట్లకు చేరనుంది. డైరెక్ట్ ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్‌ ఈ సంపద వృద్ధికి తోడ్పడనున్నాయి. వచ్చే అయిదేళ్లలో ఈ రెండూ 24.41 శాతం, 21.04 శాతం మేర వృద్ధి చెందనున్నట్లు కార్వీ ప్రైవేట్ వెల్త్ సంస్థ 'ఇండియా వెల్త్ రిపోర్ట్ 2018' పేరిట రూపొందించిన నివేదికలో వెల్లడించింది. రాబోయే అయిదు నుంచి ఏడేళ్ల కాలంలో మెరుగైన పెట్టుబడి సాధనంగా ఈక్విటీలు నిలుస్తాయని, ఇన్వెస్టర్ల సంపద దాదాపు మూడు రెట్లు పెరిగేందుకు అవకాశముందని కార్వీ ప్రైవేట్ వెల్త్ సీఈవో అభిజిత్ భవే తెలిపారు. నివేదిక ప్రకారం 2018 ఆర్థిక సంవత్సరంలో వ్యక్తిగత సంపద 14 శాతం పెరిగి రూ. 392 లక్షల కోట్లకు చేరింది. ఫిక్సిఽడ్ డిపాజిట్లతో పోలిస్తే నేరుగా షేర్లలో చేసే పెట్టుబడులకు ప్రాధాన్యం పెరిగింది. మెరుగైన వృద్ధి కనబరిచిన సాధనాల్లో మ్యూచువల్ ఫండ్స్‌, ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనాలు ఉన్నాయి. ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనాల ప్రాధాన్యతను తెలివైన ఇన్వెస్టర్లు గుర్తించారని.. వీటిలో పెట్టుబడులతో సమకూరిన సంపద 33.46 శాతం పెరిగిందని నివేదిక పేర్కొంది. మరోవైపు, ఇటీవల రూపాయి మారకం విలువ క్షీణతతో అంతర్జాతీయ పెట్టుబడులపై ఆసక్తి పెరిగినట్లు వివరించింది. వీటిలో ఇన్వెస్ట్‌మెంట్స్‌ 25.83 శాతం పెరిగాయి. ఇక స్థిరాస్తుల్లో రియల్ ఎస్టేట్ మెరుగైన పనితీరు కనపర్చింది. క్రిత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 10.35 శాతం మేర వృద్ధి చెందింది. 



You may be interested

ముత్తూట్‌ ఫైనాన్స్‌ నికర లాభం రూ.483 కోట్లు

Friday 7th December 2018

న్యూఢిల్లీ: ముత్తూట్‌ ఫైనాన్స్‌ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.484 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.446 కోట్ల నికర లాభం సాధించామని, 9 శాతం వృద్ధి సాధించామని ముత్తూట్‌ ఫైనాన్స్‌ కంపెనీ తెలిపింది. గత క్యూ2లో రూ.1,662 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.1,650 కోట్లకు తగ్గిందని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ముత్తూట్‌

ఆర్‌హెచ్‌సీ దివాలా పిటీషన్‌కు ఎన్‌సీఎల్‌టీ నో..

Friday 7th December 2018

న్యూఢిల్లీ: నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ) ఆర్‌హెచ్‌సీ హోల్డింగ్‌పై దివాలా చట్టం కింద చర్యలు తీసుకోవాలంటూ హెచ్‌డీఎఫ్‌సీ దాఖలు చేసిన పిటీషన్‌ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) తోసిపుచ్చింది. ఎన్‌బీఎఫ్‌సీలు దివాలా చట్ట (ఐబీసీ) పరిధిలోకి రావని పేర్కొంది. ఒకప్పటి ఫార్మా దిగ్గజం ర్యాన్‌బాక్సీ ప్రమోటర్లు మల్వీందర్‌ మోహన్‌ సింగ్‌, శివీందర్ సింగ్‌ ప్రమోట్ చేసిన సంస్థ ఆర్‌హెచ్‌సీ హోల్డింగ్స్‌. 2016 ఏప్రిల్‌లో ఇది హెచ్‌డీఎఫ్‌సీ నుంచి

Most from this category