STOCKS

News


నాలుగు రంగాలకు ఎక్కువ ప్రయోజనం: సెంట్రమ్‌

Sunday 3rd February 2019
news_main1549216170.png-23989

కేంద్ర ప్రభుత్వ మధ్యంతర బడ్జెట్‌ ముఖ్యంగా నాలుగు రంగాలకు ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తుందని సెంట్రమ్‌ గ్రూపు ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ జస్పాల్‌ బింద్రా పేర్కొన్నారు. కానీ, రానున్న 8-10 ఏళ్ల కాలంలో ఆర్థిక వృద్ధి గణనీయంగా పెరిగేందుకు బాట వేసినట్టుగా బడ్జెట్‌ ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ సంస్కరణలు గ్రామీణ, మధ్య తరగతి ప్రజానీకానికి ప్రయోజనం కలిగిస్తాయన్నారు. ప్రభుత్వం ద్రవ్యలోటు, సంక్షేమ కార్యక్రమాలను చక్కగా సమతుల్యం చేసిందన్నారు. బడ్జెట్‌తో ఎక్కువగా లబ్ధి పొందే పథకాల గురించి తెలియజేశారు. 

 

వినియోగం
ఆటో, ఎఫ్‌ఎంసీజీ, బిల్డింగ్‌ మెటీరియల్స్‌, ఇన్సూరెన్స్‌ రంగాల్లో డిమాండ్‌ గణనీయంగా పెరుగుతుంది. వినియోగం పెరిగితే ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుంది. దీంతో సమీప భవిష్యత్తులో రేట్ల తగ్గింపును ఆర్‌బీఐ చేపట్టకపోవచ్చు.

ఎస్‌ఎంఈ, ఎంఎస్‌ఎంఈ
ఎస్‌ఎంఈ, ఎంఎస్‌ఎంఈ రంగానికి కూడా ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. రూ.కోటి వరకు రుణాలపై 2 శాతం వడ్డీ రాయితీ, ఎంఎస్‌ఎంఈల ద్వారా ప్రభుత్వ కొనుగోళ్లు 25 శాతానికి పెంపు ఈ రంగంలో విస్తరణ, ఉద్యోగాల కల్పనకు పెద్ద ప్రేరణనిస్తుంది.

రియల్‌ఎస్టేట్‌
కొంత కాలంగా సమస్యలను ఎదుర్కొంటున్న రియల్‌ఎ‍స్టేట్‌ రంగానికీ సానుకూలమే. 2020 వరకు నమోదు చేసుకునే అందుబాటు ధరల గృహాల ప్రాజెక్టులకు పన్ను మినహాయింపు అన్నది ఎంతో ప్రేరణనిచ్చేది. ఏడాది పాటు మినహాయింపు కొత్త ప్రాజెక్టులకు మేలు చేస్తుంది. రెండు ఇళ్లకు మూలధన లాభాల పన్ను మినహాయింపు కల్పించడం వల్ల ప్రాపర్టీలపై పెట్టుబడులకు ప్రోత్సాహాన్నిస్తుంది.

పీఎస్‌యూ బ్యాంకులు
ఆర్‌బీఐ కచ్చితమైన దిద్దుబాటు కార్యాచరణ నుంచి మూడు ప్రభుత్వరంగ బ్యాంకులను తొలగించడం, రూ.2.6 లక్షల కోట్ల మేర ప్రభుత్వరంగ బ్యాంకులకు నిధుల సాయం ఎన్‌పీఏల సమస్యలతో ఉన్న బ్యాంకులకు వృద్ధి దిశగా సానుకూలం. ప్రభుత్వరంగ బ్యాంకులు తమ రుణాల జారీని పునరుద్ధరించుకుంటాయి. 



You may be interested

బడ్జెట్‌పై ఫండ్‌ మేనేజర్ల మనోగతం

Sunday 3rd February 2019

రైతులకు నగదు ప్రయోజనాన్ని అందించే కిసాన్‌ సమ్మాన్‌ పథకం, అసంఘటిత రంగంలోని కార్మికులకు ప్రతీ నెలా రూ.3,000 పెన్షన్‌, రూ.5 లక్షల వరకు పన్ను వర్తించే ఆదాయం కలిగిన వారికి మినహాయింపు వంటి ఎన్నో ప్రయోజనాలను మధ్యంతర బడ్జెట్‌ తీసుకొచ్చింది. ఇవన్నీ మార్కెట్‌కు సానుకూలమేనని మ్యూచువల్‌ ఫండ్స్‌ మేనేజర్ల అభిప్రాయం. బడ్జెట్‌పై వివిధ మ్యూచువల్‌ ఫండ్స్‌, వాటి మేనేజర్ల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.   ద్రవ్య క్రమశిక్షణతో కూడిన వృద్ధి అనుకూల బడ్జెట్‌.

రూ.5 లక్షలకు పన్ను లేదు... కానీ రిటర్నులు వేయాలి

Sunday 3rd February 2019

రూ.5 లక్షల ఆదాయం ఉన్న వారికి పన్ను చెల్లించే అవసరం లేకుండా కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో మినహాయింపులను పెంచి వేతన జీవులను సంతోషానికి గురి చేసింది. అయితే, రూ.5 లక్షల వరకు ఆదాయం ఉన్న వారు పన్ను చెల్లించక్కర్లేదు కానీ, ఐటీ రిటర్నులు మాత్రం తప్పకుండా ఫైల్‌ చేయాల్సిందే. 60 సంవత్సరాల్లోపు వారికి రూ.2.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఆదాయంగా పరిగణించే నిబంధనలో మార్పు లేదు. రూ.2.5

Most from this category