వడ్డీరేట్ల తగ్గింపు తప్పదు!
By D Sayee Pramodh

క్రిస్ వుడ్ అంచనా యూఎస్ ఫెడ్ క్యాపిటల్ టు అసెట్ నిష్పత్తి కేవలం 1 శాతం ఉండగా, ఆర్బీఐ నిష్పత్తి 30 శాతముందని వివరించారు. గవర్నర్ రాజీనామా, కొత్త గవర్నర్ నియామకం నేపథ్యంలో ఈక్విటీలు, బాండ్ మార్కెట్ స్పందించినా రూపీ మాత్రం పెద్దగా మారలేదు. దీన్నిబట్టి మానిటరీ పాలసీ నిర్ణయాల కన్నా కేవలం క్రూడాయిల్ ధరలే రూపాయి కదలికలను ఎక్కువ ప్రభావితం చేయగలవని భావిస్తున్నట్లు క్రిస్ చెప్పారు.
ఆర్బీఐ గవర్నర్‌గా శక్తికాంత్‌దాస్ నియామకంతో ద్రవ్యపరపతి సమీక్షా సమావేశంలో సడలింపులు కనిపించవచ్చని సీఎల్ఎస్ఏ వ్యూహకర్త క్రిస్‌వుడ్ అభిప్రాయపడ్డారు. దీంతో ఇకపై వడ్డీరేట్ల తగ్గింపు దిశగా ఎంపీసీ నిర్ణయాలు ఉండొచ్చన్నారు. మరోపక్క కన్జూమర్ ప్రైస్ ద్రవ్యోల్బణం తగ్గడం కూడా రేట్ల తగ్గింపునకు అవకాశమిస్తుందని చెప్పారు. నవంబర్‌లో సీపీఐ ద్రవ్యోల్బణం 2.3 శాతానికి దిగివచ్చింది. తాజా గణాంకాలతో రేట్ల విషయంలో ఆర్బీఐ మరీ కఠినంగా ఉంటోందన్న అంచనాలున్నాయన్నారు. ద్రవ్యోల్బణం తగ్గినందున తాజాగా ఆర్బీఐ దృష్టి కాస్త సరళంగా మారవచ్చన్నారు. ద్రవ్యోల్బణ భయాలు పురోగమించకుండా ఉంటే విధానపరంగా కాస్త సడలింపు ఉండేందుకు ఎంపీసీ యత్నిస్తుందని ఆర్బీఐ తాజామాజీ గవర్నర్ ఉర్జిత్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
రెండు నెలల క్రితం వడ్డీరేట్ల తగ్గింపు మాటే లేదని ఉర్జిత్ చెప్పారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు రేట్‌కట్‌కు అనుకూలంగా మారాయి. అందుకే ఆర్బీఐ సైతం తన ద్రవ్యోల్బణ అంచనాలను తగ్గించింది. ఇవన్నీ త్వరలో వడ్డీరేట్ల తగ్గింపు ఛాన్సులను చూపుతున్నాయని క్రిస్ చెప్పారు. ఆర్బీఐ కొత్త సారధి నియామకాన్ని వృద్ధి అనుకూల చర్యగా చూడాలన్నారు. ఆర్బీఐ వద్ద ఉన్న మిగులు నిధులను పీఎస్‌యూ బ్యాంకులకు మరలించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని అంచనా వేశారు. ఇందువల్ల ఆర్బీఐకి ఎలాంటి ప్రమాదం ఉండదని, ఆర్బీఐ వద్ద మిగులు నిధులు చాలా ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.
You may be interested
క్రూడాయిల్ నేల చూపులు
Saturday 15th December 2018అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధర 60.28 డాలర్లకు దిగివచ్చింది. ఒపెక్, దాని మిత్ర దేశాలు ఉత్పత్తిలో కోత విధిస్తామని ప్రకటించినా క్రూడాయిల్ ధరలో జోరు రాలేదు. యూఎస్ షేల్‌గ్యాస్ ఉత్పత్తి పెరగడంతో ఒపెక్ కోత ప్రభావం ఉండదని, అందువల్ల వచ్చే ఏడాది డిమాండ్ పెద్దగా పెరగకపోవచ్చని ట్రేడర్లు భావించడంతో క్రూడాయిల్ ధర పెరగలేదు. పైగా గత వారంతో పోలిస్తే ఒక డాలర్ తగ్గింది. రోజూవారి ఉత్పత్తిలో 12 లక్షల
డాలర్ ర్యాలీ: వారం కనిష్టానికి పసిడి ధర
Saturday 15th December 2018డాలర్ ర్యాలీ మరోసారి పసిడిని ముంచింది. గతరాత్రి అమెరికా మార్కెట్లో ఔన్స్ పసిడి 5డాలర్లు నష్టపోయి 1,242.30డాలర్ల వద్ద ముగిసింది. ఈ ధర పసిడి వారం కనిష్టస్థాయి కావడం గమనార్హం. హాలిడే షాపింగ్ అమ్మకాలు పెరుగుదల, గ్యాసోలిన్ ధరల తగ్గుదలతో అమెరికా నవంబర్ రిటైల్ గణాంకాలు విశ్లేషకుల అంచనాలకు మించి 0.2శాతంగా నమోదయ్యాయి. యూరప్ దేశాల్లో నెలకొన్న రాజకీయ అస్థిరత, వడ్డీరేట్లపై ఈసీబీ సానుకూల వైఖరితో ఆరుకరెన్సీ విలువల్లో యూరో