STOCKS

News


నేటి నుంచి దావోస్ సదస్సు

Monday 21st January 2019
news_main1548051688.png-23697

  • డబ్ల్యూఈఎఫ్‌కు వస్తున్న దిగ్గజాలు
  • భారత్ నుంచి 100 మంది పైగా సీఈవోల బృందం
  • ట్రంప్‌, పుతిన్‌, మాక్రాన్‌, థెరిసా మే సదస్సుకు దూరం

దావోస్‌: స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) సదస్సు సోమవారం (నేడు) నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 25 దాకా జరిగే ఈ సదస్సులో ప్రపంచ ఎకానమీ ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి చర్చించేందుకు, పరిష్కార మార్గాలపై కసరత్తు చేసేందుకు వివిధ దేశాల అధినేతలు, విధాన కర‍్తలు, పారిశ్రామిక దిగ్గజాలు పాల్గోనున్నారు. వీరిలో జర్మనీ చాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌, స్విట్జర్లాండ్ అధ్యక్షుడు యూలి మారర్‌, జపాన్ అధ్యక్షుడు షింజో అబె, ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు తదితర 30 దేశాలకు చెందిన అధినేతలు ఉండనున్నారు. ప్రపంచ బ్యాంక్‌, అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ వాణిజ్య సంస్థ మొదలైన అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, ఆర్థికవేత్తలు, మీడియా సంస్థల అధిపతులు, సెలబ్రిటీస్ మొదలైన వారు 3,000 మంది పైగా ఇందులో పాల్గోనున్నారు. భారత్‌ నుంచి సుమారు 100 మందిపైగా బృందం దీనికి హాజరవుతోంది. కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌,  ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్‌, పంజాబ్ మంత్రి మన్‌ప్రీత్ బాదల్‌తో పాటు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, సంజీవ్ బజాజ్‌, అజీం ప్రేమ్‌జీ తదితర 100 మంది పైగా పారిశ్రామిక దిగ్గజాలు కూడా దావోస్ సదస్సులో పాల్గోనున్నారు.  'గ్లోబలైజేషన్ 4.0: నాలుగో పారిశ్రామిక విప్లవం నేపథ్యంలో ప్రపంచాన్ని తీర్చిదిద్దుకోవడం' అనే థీమ్‌తో ఈసారి సదస్సు జరగనుంది.

ట్రంప్‌, పుతిన్ గైర్హాజరు..
తమ తమ దేశాల్లో రాజకీయ, ఆర్థిక సమస్యల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, బ్రిటన్ ప్రధాని తెరిసా మే, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మాక్రాన్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తదితరులు మాత్రం ఈసారి హాజరు కావడం లేదు. ప్రపంచ దేశాలకు పొంచి ఉన్న రిస్కులకు తక్షణం పరిష్కారమార్గం కనుగొనాల్సిన అవసరాన్ని ఇది సూచిస్తోందని పరిశీలకులు చెప్పారు. మరోవైపు, భారత్‌ నుంచి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ, చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులు కూడా డబ్ల్యూఈఎఫ్‌లో పాల్గొనడం లేదు.

చర్చనీయాంశాలు..
గ్లోబలైజేషన్ ప్రయోజనాలు, ప్రపంచ శాంతి కోసం తీసుకోతగిన చర్యలు, అభివృద్ధి ఫలాలు అందరికీ అందేలా తీసుకోవాల్సిన చర్యలు మొదలైన అంశాల గురించి ఈ సదస్సులో చర్చించనున్నారు. వాతావరణంలో మార్పులు, అంతర్జాతీయ గవర్నెన్స్‌ అంశాలు కీలక చర్చనీయాంశాలుగా ఉండనున్నాయి. భౌగోళిక, రాజకీయ, ఆర్థిక రిస్కులు పెరిగిపోతున్నాయని, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటుండటం వల్ల వీటిని సమిష్టిగా ఎదుర్కొనే అవకాశాలు సన్నగిల్లుతున్నాయని డబ్ల్యూఈఎఫ్ ఇప్పటికే ఒక నివేదికలో హెచ్చరించింది. డేటా మోసాలు, భారీ స్థాయిలో సైబర్ దాడులతో పాటు సమాజంలో అసమానతలు పెరిగిపోతుండటం వంటి సవాళ్లను కూడా ఇందులో ప్రస్తావించింది. దాదాపు 1,000 మంది పైగా నిపుణులు, విధానకర్తలు ఈ సర్వేలో పాల్గొన్నారు. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల కారణంగా రాబోయే రోజుల్లో ప్రపంచ ఎకానమీ పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని ప్రతి పది మందిలో తొమ్మిది మంది ఆందోళన వ్యక్తం చేశారు.

ఇతరత్రా విశేషాలు..
అయిదు రోజులపాటు జరిగే సదస్సులో భాగంగా 350 పైచిలుకు అధికారిక చర్చాగోష్టులు ఉంటాయి. 1,700 మంది పైచిలుకు వ్యాపార దిగ్గజాలు వీటిలో పాల్గొంటున్నారు. ఆడిడాస్‌, రియో టింటో, ఐకియా, టోటల్‌, ఆలీబాబా, పెప్సీకో, కోకాకోలా, నెస్లే వంటి ఎంఎన్‌సీ దిగ్గజాల సీఈవోలు వీరిలో ఉన్నారు. అధికారిక సమావేశాలతో పాటు సీఐఐ తదితర భారతీయ పరిశ్రమల సమాఖ్యలు విడిగా సమావేశాలు నిర్వహించనున్నాయి.You may be interested

ఎండోమెంట్‌ ప్లాన్‌ల్లో 11 శాతం రాబడి వస్తుందా ?

Monday 21st January 2019

ప్ర: నా వయస్సు 35 సంవత్సరాలు. గత రెండున్నరేళ్ల నుంచి నేను సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో ఈక్విటీ మ్యూచువల్‌ఫండ్స్‌ల్లో  ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కనీసం 5-10 సంవత్సరాలు కొనసాగిద్దామనుకుంటున్నాను. నాకు ఇటీవలే ఇంక్రిమెంట్‌ వచ్చి జీతం పెరిగింది. దీంతో నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ కూడా పెంచుదామనుకుంటున్నాను. ఏ కేటగిరీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయమంటారు ? -దీప్తి, హైదరాబాద్‌ జ: ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు గత రెండున్నరేళ్ల కాలం చాలా కీలకమైనది. మార్కెట్‌ 

నికో.. తప్పుకో!!

Monday 21st January 2019

- భాగస్వామ్య సంస్థకు రిలయన్స్ నోటీసులు - చెల్లింపుల్లో డిఫాల్ట్ అవఽడమే కారణం న్యూఢిల్లీ: కేజీ-డీ6 గ్యాస్ బ్లాక్‌ క్షేత్ర అభివృద్ధి వ్యయాల చెల్లింపుల్లో విఫలమైన నేపథ్యంలో వెంచర్ నుంచి తప్పుకోవాల్సిందిగా కెనడాకు చెందిన భాగస్వామ్య సంస్థ నికో రిసోర్సెస్‌కు రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్‌) నోటీసులిచ్చింది. ఆర్‌-క్లస్టర్‌, శాటిలైట్ క్లస్టర్ వంటి వాటి అభివృద్ధికి తన వంతుగా 5-6 బిలియన్ డాలర్లను సమకూర్చలేకపోవడం, రుణదాతలకు చెల్లింపుల్లో డిఫాల్ట్ కావడం, కేజీ-డీ6 వెంచర్‌లో తన

Most from this category