News


ప్రపంచ వృద్ధి అంచనాలకు కోత

Thursday 7th March 2019
news_main1551936569.png-24463

  • 3.3 శాతానికి తగ్గించిన ఓఈసీడీ
  • వాణిజ్య యుద్ధం, బ్రెగ్జిట్‌ అనిశ్చితుల వల్లే

పారిస్‌: వాణిజ్య ఉద్రిక్తతలు, రాజకీయ అనిశ్చిత పరిస్థితులు, బ్రెగ్జిట్‌ తదితర అంశాలు ప్రపంచ వృద్ధిపై ప్రభావం చూపిస్తున్నాయని ఆర్థిక సహకార - అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) పేర్కొంది. ఈ నేపథ్యంలో 2019 సంవత్సరానికి ప్రపంచ జీడీపీ వృద్ధి అంచనాలను గత నవంబర్‌లో పేర్కొన్న 3.5 శాతం నుంచి 3.3 శాతానికి తగ్గించింది. అంతకుముందు అంచనాలు 3.7 శాతంతో పోలిస్తే మరింత తగ్గించినట్టయింది. ‘‘విధానపరమైన అధిక అనిశ్చితి, కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, వ్యాపార, వినియోగ విశ్వాసం మరింత క్షీణించడం అనేవి వృద్ధి తగ్గుదలకు దారితీస్తాయి’’ అని ఓఈసీడీ తన మధ్యంతర ఆర్థిక నివేదికలో వివరించింది. జీ20లోని అధిక దేశాల వృద్ధి అంచనాలను కూడా సవరించింది. 19 దేశాల యూరో జోన్‌ వృద్ధి అంచనాలు ఏకంగా 1.8 శాతం నుంచి ఒక శాతానికి తగ్గిపోయాయి. జర్మనీ వృద్ధి అంచనాలు 1.4 శాతం నుంచి 0.7 శాతానికి తగ్గగా, ఇటలీ 0.9 శాతం నుంచి మైనస్‌ 0.2 శాతానికి తగ్గించింది. అంతర్జాతీయ వాణిజ్య మందగమనంతో ఈ రెండు దేశాలకు ఎక్కువ అవినాభావ సంబంధం కలిగి ఉండడమే వీటి వృద్ధి అంచనాల్లో భారీ కోతకు కారణమని ఓఈసీడీ వివరించింది. 
బ్రిటన్‌ అంచనాలూ తగ్గింపు
అలాగే, బ్రెగ్జిట్‌ సహా యూరోప్‌లో విధానపరమైన అనిశ్చితి ఎక్కువగా ఉందని తెలిపింది. అసంబద్ధంగా యూరోప్‌ నుంచి బ్రిటన్‌ వైదొగలితే యూరోపియన్‌ ఆర్థిక వ్యవస్థల వ్యయాలు పెరిగిపోతాయని పేర్కొంది. బ్రిటన్‌ వృద్ధి అంచనాలను 1.4 శాతం నుంచి 0.8 శాతానికి సవరించింది. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం అనంతరం 2009 తర్వాత ఇటలీ వృద్ధి అంచనాలు ఒక శాతం లోపునకు రావడం ఇదే ప్రథమం. అయితే, బ్రెగ్జిట్‌ (బ్రిటన్‌ బయటకు వెళ్లిపోవడం) ప్రక్రియ సాఫీగా సాగిపోవడం ఆధారంగానే ఈ మాత్రం వృద్ధి అంచనాలను వేసినట్టు ఓఈసీడీ తెలిపింది. అమెరికా, చైనా గతేడాది విధించుకున్న వాణిజ్య నియంత్రణలు... వృద్ధి, పెట్టుబడులు, జీవన ప్రమాణాలను పడదోస్తాయని వ్యాఖ్యానించింది. 



You may be interested

‘డొనేట్‌కార్ట్‌’కు రూ.2.55 కోట్ల సీడ్‌ ఫండ్‌

Thursday 7th March 2019

- లెట్స్‌ వెంచర్‌, ఏంజెల్‌ ఇన్వెస్టర్ల పెట్టుబడి రాయదుర్గం: ఆన్‌లైన్‌ డొనేషన్‌ ప్లాట్‌ఫామ్‌గా టీ-హబ్‌లో ఊపిరి పోసుకున్న ‘డొనేట్‌కార్ట్‌’కు రూ.2.55 కోట్ల సీడ్‌ ఫండింగ్‌ లభించింది. లెట్స్‌ వెంచర్, ఇతర ఏంజెల్‌ ఇన్వెస్టర్ల ద్వారా ఈ సీడ్‌ ఫండింగ్‌ లభించినట్లు డొనేట్‌కార్ట్‌ వ్యవస్థాపకులు అనిల్‌ కుమార్‌రెడ్డి, సందీప్‌ శర్మ చెప్పారు. ఈ నిధులతో టెక్నాలజీని, టీమ్‌ను మరింత మెరుగుపర్చుకుంటామని వారు చెప్పారు. వీరిద్దరూ ఎన్‌ఐటి నాగ్‌పూర్‌లో చదువుకుని, 2016లో ఈ సంస్థను ఏర్పాటు

మార్కెట్లోకి ‘వ్యాగన్‌ఆర్‌ ఎస్‌-సీఎన్‌జీ’

Thursday 7th March 2019

- ప్రారంభ ధర రూ.4.84 లక్షలు న్యూఢిల్లీ: ఆటోమొబైల్‌ దిగ్గజం మారుతి సుజుకీ.. వ్యాగన్‌ఆర్‌ సీఎన్‌జీ వెర్షన్‌ కార్లను బుధవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ‘వ్యాగన్‌ఆర్‌ ఎస్‌-సీఎన్‌జీ’ పేరిట అందుబాటులోకి వచ్చిన ఈకార్లలో ఎల్‌ఎక్స్‌ఐ వేరియంట్‌ ధర రూ.4.84 లక్షలు కాగా, ఎల్‌ఎక్స్‌ఐ(ఓ) వేరియంట్‌ ధర రూ.4.89 లక్షలు. ఈ కార్లు ప్రతి కేజీ సీఎన్‌జీకి 33.54 కిలోమీటర్ల మైలేజ్‌ని ఇస్తాయని సంస్థ ఎండీ, సీఈఓ కెనిచి అయుకవా తెలిపారు. సీఎన్‌జీ ఇన్‌ఫ్రా

Most from this category