STOCKS

News


భారత్‌ నెట్‌ను ఉపయోగించుకోండి

Thursday 22nd November 2018
news_main1542864398.png-22295

న్యూఢిల్లీ: మారుమూల ప్రాంతాల ప్రజలకు కూడా విద్య, వైద్యం వంటి సేవలు మరింత చేరువ చేసేందుకు భారత్ నెట్ ప్రాజెక్టు కింద కల్పిస్తున్న మౌలిక సదుపాయాలను రాష్ట్రాలు సద్వినియోగం చేసుకోవాలని టెలికం శాఖ కార్యదర్శి అరుణ సుందరరాజన్ సూచించారు. ఆర్థిక అవకాశాలను అందిపుచ్చుకునేందుకు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను లబ్ధిదారులకు చేరేలా చూసేందుకు భారీ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌ ఉపయోగపడగలదని పేర్కొన్నారు. దాదాపు 1 లక్ష గ్రామ పంచాయతీల్లో భారత్‌ నెట్ మౌలిక సదుపాయాన్ని కల్పించినప్పటికీ, దాన్ని వినియోగించుకునేందుకు రాష్ట్రాలు ముందుకు రావడం లేదని అరుణ చెప్పారు. దేశవ్యాప్తంగా కమ్యూనికేషన్స్ వ్యవస్థను పటిష్టపర్చేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టులను అమలు చేయడంలో పరిశ్రమ, ప్రభుత్వం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. భారత్‌ నెట్ ప్రాజెక్టు కింద వచ్చే ఏడాది మార్చి నాటికి 2.5 లక్షల గ్రామ పంచాయితీలను అనుసంధానం చేయాలని కేంద్రం నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇందుకు సంబంధించి 50 శాతం మేర పనులు పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే.. ఈ-గవర్నెన్స్‌, ఈ-హెల్త్‌, ఈ-ఎడ్యుకేషన్‌, ఈ-బ్యాంకింగ్‌ మొదలైన సేవలు దేశవ్యాప్తంగా ప్రజలందరికీ మరింత చేరువలోకి తేవడం సాధ్యపడగలదు. 



You may be interested

భారత్‌లో 15వేల ఉద్యోగాలు!!

Thursday 22nd November 2018

న్యూఢిల్లీ: స్వీడన్‌కి చెందిన ఫర్నిచర్ తయారీ దిగ్గజం ఐకియా... భారత్‌లో తమ కార్యకలాపాలను గణనీయంగా విస్తరించడంపై దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా భవిష్యత్‌లో భారత్‌లో తమ ఉద్యోగుల సంఖ్యను దాదాపు పది రెట్లు పెంచుకుని.. సుమారు 15,000 స్థాయికి చేర్చనున్నట్లు ఐకియా బుధవారం తెలిపింది. అదే సమయంలో కార్యకలాపాల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా అంతర్జాతీయంగా 7,500 ఉద్యోగాలను కుదించనున్నట్లు వెల్లడించింది. ‘‘భారత మార్కెట్లో 1.5 బిలియన్ యూరోల మేర పెట్టుబడులు పెడుతున్నాం.

బలహీనత దిశగా ప్రపంచ వృద్ధి!

Thursday 22nd November 2018

పారిస్‌: ప్రపంచ ఆర్థిక వృద్ధి ‘బలహీనత’ దిశగా పయనిస్తోందని పారిస్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) పేర్కొంది. వాణిజ్య ఉద్రిక్తతలు, అధిక వడ్డీరేట్ల వ్యవస్థ దిశగా పయనం వంటి అంశాలు ప్రపంచ ఆర్థిక వృద్ధిని మందగమనంలోకి లాగుతున్నాయని పేర్కొంది. అయితే తక్షణం భారీగా పతనమయ్యే అవకాశాలు మాత్రం కనిపించడం లేదని పేర్కొంటూనే... వచ్చే ఏడాది ప్రపంచ ఆర్థిక అవుట్‌లుక్‌కు తగ్గిం‍చింది. ఓఈసీడీ చీఫ్‌ ఎకనమిస్ట్‌ లారెన్స్‌

Most from this category