STOCKS

News


ఇన్‌ఫ్లయిట్ కనెక్టివిటీపై త్వరలో మార్గదర్శకాలు: మనోజ్ సిన్హా

Thursday 6th December 2018
news_main1544075738.png-22691

న్యూఢిల్లీ: విమానప్రయాణంలో కూడా ఫోన్ కాల్స్, ఇంటర్నెట్ బ్రౌజింగ్‌ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించే ఇన్‌-ఫ్లయిట్ కనెక్టివిటీపై త్వరలో మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు కేంద్ర టెలికం శాఖ మంత్రి మనోజ్ సిన్హా చెప్పారు. న్యాయ శాఖ అనుమతులు లభించిన పక్షంలో జనవరిలోనే నిబంధనలను ప్రకటించే అవకాశం ఉందని సూచనప్రాయంగా తెలిపారు. "ప్రస్తుతం న్యాయ శాఖ అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాం. వారం, పది రోజుల్లో లభించే అవకాశాలు ఉన్నాయి. అనుమతులు వచ్చాకా.. ప్రక్రియ ప్రారంభించవచ్చు" అని సిన్హా విలేకరులకు వివరించారు. ప్రస్తుతం చాలా మటుకు సంపన్న దేశాల్లో అమల్లో ఉన్న ఇన్‌ఫ్లయిట్ కనెక్టివిటీని దేశీయంగా కూడా ప్రవేశపెట్టే ప్రతిపాదనకు ఈ ఏడాది మే 1న టెలికం కమిషన్ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. 



You may be interested

మారుతీ కార్ల ధరలకు రెక్కలు

Thursday 6th December 2018

న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ కంపెనీ అన్ని మోడళ్ల కార్ల ధరలను పెంచుతోంది. ఉత్పత్తి వ్యయాలు పెరగడం, విదేశీ మారక ద్రవ్య రేట్లు కూడా పెరుగుతున్న  కారణంగా ధరలను పెంచక  తప్పడం లేదని మారుతీ సుజుకీ తెలిపింది. వచ్చే నెల నుంచి ధరలను పెంచుతున్నామని పేర్కొన్న  ఈ కంపెనీ ఎంత మేరకు ధరలను పెంచేది వెల్లడించలేదు. కమోడిటీ దరలు పెరుగుతున్నాయని, విదేశీ మారక ద్రవ్య రేట్లు కూడా పెరుగుతున్నాయని, ఫలితంగా ఉత్పత్తి

సగానికి తగ్గనున్న ఎన్‌బీఎఫ్‌సీల వృద్ధి

Thursday 6th December 2018

ముంబై:  ద్రవ్య లభ్యత సమస్యల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో నాన్‌ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల (ఎన్‌బీఎఫ్‌సీ) అసెట్స్‌ వృద్ధి సగానికి తగ్గిపోనుంది. 10 శాతానికి పరిమితం కానుంది. రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ బుధవారం విడుదల చేసిన ఒక నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది. ఎన్‌బీఎఫ్‌సీల రిటైల్‌ రుణాల నాణ్యత కాస్త మెరుగ్గానే ఉన్నా.. నాన్‌-రిటైల్ రుణాల విభాగం ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు ఉన్నయని క్రిసిల్ పేర్కొంది. ఇన్‌ఫ్రా

Most from this category