STOCKS

News


కొత్త టెక్నాలజీలతో బోలెడన్ని అవకాశాలు

Saturday 22nd December 2018
news_main1545450201.png-23149

సాక్షి, హైదరాబాద్‌: మున్ముందు అన్ని రంగాల్లోనూ ఏఐ, ఐఓటీ వంటి డీప్‌ టెక్నాలజీస్‌ పాత్ర కీలకం కానుందని.. దీనికి ఆందోళన చెందకుండా అవకాశంగా మలచుకోవాలని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ – కోల్‌కత బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ చైర్మన్‌ శ్రీకృష్ణ కులకర్ణి సూచించారు. ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగం మొదలు ఐటీ వరకూ అన్నిటా ఏఐ, ఐఓటీల ప్రమేయంతో కార్యకలాపాలు నిర్వహించే పరిస్థితి వస్తుందని, దీనికి సంస్థల యాజమాన్యాలు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ టెక్నాలజీ – హైదరాబాద్, సెరెబ్రా స్కిల్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ‘డిస్రప్టివ్‌ టెక్నాలజీస్‌–నిర్వహణ’ సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ మాట్లాడుతూ డీప్‌ టెక్నాలజీస్‌ నిర్వహణకు సంబంధించి ఇప్పటికే పలు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఫార్మా, హెల్త్‌కేర్‌ రంగంలోనూ ఏఐ, ఐఓటీలు ప్రమేయం పెరుగుతోందని, వీటిని సమర్థంగా నిర్వహించేందుకు నిపుణులైన మానవ వనరుల అవసరం లక్షల సంఖ్యలో ఏర్పడుతుందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యుటికల్స్‌ సంస్థ ప్రెసిడెంట్‌ డాక్టర్‌. కర్ట్‌ స్టొయెక్‌ పేర్కొన్నారు. అమెజాన్‌ ఇండియా సీఎఫ్‌ఓ రాఘరావు మాట్లాడుతూ ఈ–కామర్స్, బ్యాంకింగ్‌ రంగాలు సరికొత్త టెక్నాలజీలతో మరింత ప్రభావానికి గురనున్నాయని తెలిపారు. ఇలాంటి సదస్సును నిర్వహించడం వల్ల ఉద్యోగార్థులు, యాజమాన్యాలు రెండు వర్గాలకు సరైన పరిష్కార మార్గాలపై అవగాహన ఏర్పడుతుందని సెరెబ్రా స్కిల్స్‌ అకాడమీ వ్యవస్థాపకులు దేవాశిశ్‌ మహాపాత్రో అన్నారు. ఆయా రంగాలకు సంబంధించి పలు దశలుగా నిర్వహించిన ఈ సదస్సులో పలువురు ఇండస్ట్రీ నిపుణులు పాల్గొన్నారు.  You may be interested

ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ఐదేళ్ల ఖాతాలను తనిఖీ చేస్తాం

Saturday 22nd December 2018

ముంబై: ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపు, దాని సబ్సిడరీ కంపెనీలకు సంబంధించి గత ఐదేళ్ల ఖాతా పుస్తకాలను కంపెనీల చట్టంలోని సెక్షన్‌ 130 కింద తిరిగి తనిఖీ చేసేందుకు అనుమతించాలని కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించింది. ఓ కంపెనీ ఖాతా పుస్తకాలను తిరిగి తెరిచేందుకు అనుమతి కోరడం 2013 నాటి కంపెనీల చట్టం కింద ఇదే మొదటి సారి. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపు  రూ.90,000 కోట్లకు పైగా రుణాలు తీసుకుని వాటిని

ఉపకరణాలన్నిటా... ‘ఎంఐ’ ముద్ర!

Saturday 22nd December 2018

న్యూఢిల్లీ: చేతిలో ఎంఐ ఫోన్‌... హాల్లో ఎంఐ ఫ్రిజ్‌... కిచెన్‌లో ఎంఐ వాటర్‌ ప్యూరిఫయర్‌... బాల్కనీలో ఎంఐ వాషింగ్‌ మెషిన్‌... బెడ్‌ రూమ్‌లో ఎంఐ ఏసీ... భవిష్యత్తులో ఇదే చూడబోతున్నాం!. చౌక ధరలకే అత్యాధునిక ఫీచర్లతో కూడిన ఎంఐ బ్రాండ్‌ స్మార్ట్‌ ఫోన్లతో భారతీయులకు చేరువైన చైనా కంపెనీ ‘షావోమీ’... భారత మార్కెట్లో మరింతగా పాతుకుపోయే ప్రణాళికలను రచిస్తోంది. స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ నుంచి పూర్తి స్థాయి కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌

Most from this category