STOCKS

News


సిబ్బందికి పంచకుంటే పన్ను కట్టాల్సిందే..

Friday 23rd November 2018
news_main1542948086.png-22326

న్యూఢిల్లీ: హోటళ్లు, రెస్టారెంట్లలో కస్టమర్ల నుంచి వసూలు చేసే సర్వీస్‌ చార్జీని వర్కర్లు, సిబ్బందికి గానీ పంచని పక్షంలో ఆ మొత్తాన్ని సంస్థ ఆదాయంగానే పరిగణించడం జరుగుతుందని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) పేర్కొంది. సదరు ఆదాయంపై పన్ను కట్టాల్సిందేనని స్పష్టం చేసింది. హోటళ్లు, రెస్టారెంట్ల ఖాతాలు తనిఖీ చేయాలని.. సర్వీస్ చార్జీల వసూళ్లలో ఎక్కువ, తక్కువలు చేసి చూపుతున్నాయేమో పరిశీలించాలని క్షేత్ర స్థాయి సిబ్బందిని ఆదేశించింది. మార్గదర్శకాలకు విరుద్ధంగా కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు .. సర్వీస్‌ చార్జీని తప్పనిసరిగా వసూలు చేస్తుండటంపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో సీబీడీటీ తాజా ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సర్వీస్ చార్జి ఇవ్వడం, ఇవ్వకపోవడమనేది కస్టమర్ ఇష్టాన్ని బట్టే ఉండాలని, ఇది పూర్తిగా ఐచ్ఛికమని కేంద్రం గతేడాది ఏప్రిల్‌లో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మార్గదర్శకాల ప్రకారం హోటళ్లు, రెస్టారెంట్లు కూడా బిల్లులో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొనాలి. కానీ పలు హోటళ్లు, రెస్టారెంట్లు తామే సర్వీస్ చార్జీలను నిర్ణయించి వసూలు చేస్తున్నాయి. 



You may be interested

డిస్కవర్‌ 100 సీసీ ఘోర తప్పిదం..

Friday 23rd November 2018

ముంబై: మోటార్‌సైకిల్ శ్రేణి డిస్కవర్‌లో 100 సీసీ వేరియంట్‌ను ప్రవేశపెట్టడం తన కెరియర్‌లో ఘోర తప్పిదమని బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్‌ వ్యాఖ్యానించారు. దీనితో తమ సంస్థ దేశీ ద్విచక్రవాహనాల మార్కెట్లో నంబర్- 2 స్థానానికి పరిమితమైపోయిందని చెప్పారాయన. ఒకవేళ 100 సీసీని ప్రవేశపెట్టకుండా ఉంటే పరిస్థితులు వేరుగా ఉండేవన్నారు. ‘‘డిస్కవర్‌లో 125సీసీ వేరియంట్‌ను ప్రవేశపెట్టినప్పుడు ఇటు మైలేజీతో పాటు అటు అధిక సామర్ధ్యంతో పనిచేసే బైక్‌గా ప్రత్యేకత

బీఓబీ ఉద్యోగులకు షేర్లు !

Friday 23rd November 2018

న్యూఢిల్లీ: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తన ఉద్యోగులకు ఎంప్లాయీ షేర్‌ పర్చేజ్‌ స్కీమ్ (ఈఎస్‌పీఎస్‌) కింద తాజా షేర్లను జారీ చేయనుంది. ఈ విషయంపై చర్చించి, ఆమోదం తెలపడానికి తమ డైరెక్టర్లు ఈ నెల 29న సమావేశం కానున్నారని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తెలిపింది. అనుభవం గల ఉద్యోగులను అట్టిపెట్టుకోవడానికి గాను ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు తమ ఉద్యోగులకు షేర్లను జారీ చేయడానికి గత ఏడాది మార్చిలోనే కేంద్ర ప్రభుత్వం

Most from this category