STOCKS

News


ఆటోమొబైల్స్‌ కంపెనీలపై పాజిటివ్‌ వ్యూ

Saturday 11th August 2018
news_main1533983459.png-19182

భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో కీలక పాత్ర పోషించే రంగాల్లో ఆటోమొబైల్‌ కూడా ఒకటి. ఇది జీడీపీలో దాదాపు 4 శాతం వాటాను ఆక్రమించి ఉంది. వాహన రంగంలో వృద్ధి జోరందుకుంటోంది. వినియోగం ఊపందుకోవడం ఇందుకు కారణం. టూవీలర్లు, ఫోర్‌వీలర్లు, ట్రాక్టర్ల విక్రయాలు వినియోగ డిమాండ్‌ను ప్రతిబింబిస్తున్నాయి. ఎస్‌ఎంసీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ అండ్‌ అడ్వైజర్స్‌ చైర్మన్‌, ఎండీ డీకే అగర్వాల్‌ ఒక ఆంగ్ల చానల్‌ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. ఆటోమోటివ్‌ కంపొనెంట్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రకారం.. వాహన విడిభాగాల విభాగంలో 2017-18లో 18.3 శాతం వృద్ధి నమోదయ్యిందని తెలిపారు. వాహన డిమాండ్‌ ఇందుకు కారణమని పేర్కొన్నారు. 
ఆటోమొబైల్‌ రంగానికి ఇన్వెస్ట్‌మెంట్లు ఎక్కువగా అవసరమౌతాయని, రీసెర్చ్‌, డెవలప్‌మెంట్‌ వాటి కోసం తిరిగి పెట్టుబడులు పెడుతూ ఉండాలని అగర్వాల్‌ తెలిపారు. వాహన కంపెనీలు వచ్చే రెండేళ్ల కాలంలో రూ.58,000 కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి 2020-21 ఆర్థిక సంవత్సరం వరకు మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) రూ.15,000 కోట్లు పెట్టుబడులు పెట్టనుందని తెలిపారు. మారుతీ సుజుకీ రూ.5,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనుంది, గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ మొత్తం దాదాపు 50 శాతం ఎక్కువని పేర్కొన్నారు. 
అంతర్జాతీయంగా చూస్తే ఆటోమొబైల్‌ రంగాన్ని పరిశీలిస్తే కస్టమర్ల ఆలోచన ధోరణి మారుతోందన్నారు. కస్టమర్లు అన్ని విషయాలు తెలుసుకుంటున్నారని, ఆటోమొబైల్‌ కంపెనీలు టెక్నాలజీ పరంగా అప్‌డేటెడ్‌గా ఉండాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. కంపెనీలు ప్రస్తుత వృద్ధిని కొనసాగించడానికి, పెట్టుబడుల సమతుల్యత, భవిష్యత్‌ అవసరాలకు అనువుగా ఉండే గ్లోబల్‌ ప్రొడక్టుల ఆవిష్కరణ కోసం తగిన మార్గాన్ని ఎంచుకుంటున్నాయని తెలిపారు. కొత్త ప్రొడక్టుల ఆవిష్కరణకు, సామర్థ్యం పెంపునకు, పెరుగుతున్న డిమాండ్‌ను అందిపుచ్చుకోవడానికి వాహన కంపెనీలు ఇన్వెస్ట్‌మెంట్లకు పెంచుకుంటున్నాయని పేర్కొన్నారు. ఇవి మారుతున్న కస్టమర్‌ ప్రాధాన్యాలకు అనువుగా ఎప్పటికప్పుడు కొత్త ప్రొడక్టులను తీసుకురావడానికి సిద్ధమౌతున్నాయని తెలిపారు. 
ఇండియా వాహన ఎగుమతి దేశంగా అవతరిస్తోందని అగర్వాల్‌ పేర్కొన్నారు. సమీప భవిష్యత్‌లో ఎగుమతుల్లో బలమైన పెరుగుదల ఉంటుందనే అంచనాలున్నాయని తెలిపారు. రానున్న కాలంలో ఆటోమొబైల్‌ రంగంలో మంచి వృద్ధి నమోదవుతుందని పేర్కొన్నారు. వాహన పరిశ్రమలో ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌, షేరింగ్‌ మొబిలిటీ, భారత్‌ స్టేజ్‌-6 నిబంధనలు, భద్రతా ప్రమాణాలు రూపంలో కీలకమైన మార్పులు చోటుచేసుకోబోతున్నాయని తెలిపారు. మారుతీ సుజుకీ, అశోక్‌ లేలాండ్‌ వంటి కంపెనీలు బలమైన డిమాండ్‌ నేపథ్యంలో అధిక ధరలను కస్టమర్లకు బదిలీ చేయడం ద్వారా ప్రయోజనం పొందనున్నాయని పేర్కొన్నారు. పండుగ సీజన్‌, సులభ రుణ లభ్యత, వాహన లభ్యత, కొనుగోలు శక్తి వంటి అంశాలు వాహన రంగ వృద్ధికి దోహదపడతాయని తెలిపారు. మారుతీ సుజుకీ, అశోక్‌ లేలాండ్‌, ఎంఅండ్‌ఎం, బజాజ్‌ ఆటో, హీరో మోటొకార్ప్‌, సుప్రజిత్‌ యాన్సిలరీ, మిందా కార్పొరేషన్‌ వంటి కంపెనీలు రానున్న రోజుల్లో మంచి వృద్ధిని నమోదు చేస్తాయని అంచనా వేశారు. 



You may be interested

సాగర్‌ సిమెంట్ షేరును కొనొచ్చు: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌

Saturday 11th August 2018

ముంబై:- దేశంలోని సిమెంట్‌ కంపెనీ షేర్లకు మంచి రోజులొచ్చాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తెలిపింది. ఇటీవల కేంద్రం ప్రవేశ పెట్టిన అందరికీ గృహవసతి కల్పన కార్యక్రమంతో పాటు పలు నిర్మాణ కార్యక్రమాలతో రానున్న రోజుల్లో నిర్మాణ రంగం మరింత వేగంగా వృద్ధి చెందుతుందనే అంచనా వేస్తుంది. ఉత్పత్తి భారీగా పెరుగుతుండంతో డిమాండ్‌ ఊపందుకోవడం, కంపెనీల అధిక వ్యయాల తగ్గింపునకు తగిన విధంగా వ్యూహరచనలు సిమెంట్‌ కంపెనీలను లాభాల బాట పట్టిస్తున్నాయని తెలిపింది. మరోవైపు ఈ

లుపిన్‌లో అమ్మకాలు.. జేఎస్‌డబ్ల్యూలో కొనుగోళ్లు!!

Saturday 11th August 2018

ఇండెక్స్‌ షేర్లను హోల్డ్‌చేసే ఎక్స్చేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ ఫార్మా దిగ్గజ కంపెనీ లుపిన్‌ను వదిలించుకోనున్నాయి. రానున్న ఇండెక్స్‌ సర్దుబాటు సమీక్షలో లుపిన్‌ స్టాక్‌ను బెంచ్‌మార్క్‌ నిఫ్టీ నుంచి తొలగిస్తే అప్పుడు ఎక్స్చేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (ఈటీఎఫ్‌) రూ.210 కోట్ల విలువైన ఈ స్టాక్‌ను విక్రయించే అవకాశముంది. ఇన్‌స్టిట్యూషనల్‌ బ్రోకరేజ్‌ ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ ఈ విషయాలు వెల్లడించింది. నిఫ్టీ ఇండెక్స్‌లో లుపిన్‌ స్థానాన్ని జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ భర్తీ చేస్తుందనే అంచనాలున్నాయి. దీనివల్ల

Most from this category