STOCKS

News


ఫైనాన్స్‌ సెక్రటరీగా సుభాష్‌ చంద్ర గార్గ్‌!

Saturday 9th March 2019
news_main1552116331.png-24508

  • ఐదుగురు సీనియర్లలో ఒకరిగా దక్కిన కీలక బాధ్యతలు

న్యూఢిల్లీ: ఆర్థిక శాఖ కార్యదర్శిగా సుభాష్‌ చంద్ర గార్గ్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం గార్గ్‌ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నియామకాల మంత్రిత్వశాఖ శుక్రవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదలచేస్తూ, ఫైనాన్స్‌ కార్యదర్శిగా గార్గ్‌ పేరును ప్రధాని నేతృత్వంలో సమావేశమైన నియామక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ ఆమోదించినట్లు తెలిపింది.
1983 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి...
58 సంవత్సరాల గార్గ్‌... 1983 బ్యాచ్‌ రాజస్తాన్‌ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి. ఆర్థిక రంగంలో అపార అనుభవం ‍కలిగిన ఆయన, 2017 జూన్‌ నుంచీ ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. సాధారణంగా ఆర్థికశాఖలో బాధ్యతలు నిర్వహించే ఐదుగురు కార్యదర్శుల్లో అత్యంత సీనియర్‌గా ఉన్నవారే ఫైనాన్స్‌ కార్యదర్శిగా నియమితులవుతారు. ప్రస్తుతం ఈ ఐదుగురిలో గార్గ్‌తో పాటు అజయ్‌ భూషణ్‌ పాండే (రెవెన్యూ కార్యదర్శి), రాజీవ్‌ కుమార్‌ (ఆర్థిక సేవల శాఖ కార్యదర్శి), అతన్‌ చక్రవర్తి (పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ కార్యదర్శి), గిరీష్‌ చంద్ర ముర్ము (వ్యయ వ్యవహారాల కార్యదర్శి) ఉన్నారు. పాండే, కుమార్‌ 1984 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారులు (మహారాష్ట్ర, జార్ఖండ్‌ల నుంచి). ఇక చక్రవర్తి, ముర్ము 1985 బ్యాచ్‌ గుజరాత్‌ కేడర్‌ ఐఏఎస్‌ అధికారులు. ఫైనాన్స్‌ సెక్రటరీగా అజయ్‌ నారాయణ్‌ ఝా ఫిబ్రవరి 28న బాధ్యతల విరమణతో, ఆయన బాధ్యతలను గార్గ్‌ తీసుకోనున్నారు.You may be interested

ఆన్‌లైన్‌లో పూజ.. ఇంటికి ప్రసాదం!

Saturday 9th March 2019

మై మందిర్‌లో 300 ఆలయాల నమోదు 50 లక్షల మంది యూజర్లు; తెలుగు రాష్ట్రాల వాటా 30 శాతం ఆధ్యాత్మిక సమాచారం, ఫొటోలు, వీడియో కంటెంట్‌ ‘స్టార్టప్‌ డైరీ’తో ఫౌండర్‌ రాహుల్‌ గుప్తా హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మనం గుడికి వెళితే అర్చన చేయిస్తాం. పేరు, గోత్రం పూజారికి చెబితే.. వేద మంత్రాలు చదువుతూ మన పేరిట అర్చన చేసేస్తాడు! ఈ సందర్భాన్ని కొద్దిగా మార్చేసింది మై మందిర్‌ స్టార్టప్‌. గుడికి స్వయంగా వెళ్లి అర్చన చేయించే

రిలయన్స్‌ ట్రెండ్స్‌ భారీ విస్తరణ!

Saturday 9th March 2019

వచ్చే ఐదేళ్లలో స్టోర్ల సంఖ్య 2,500కు  ఈ కామర్స్‌లోనూ పెద్ద ఎత్తున విస్తరణ  రిలయన్స్‌ రిటైల్‌ ప్రణాళికలు ముంబై: ‘రిలయన్స్‌ ట్రెండ్స్‌’ భారీ విస్తరణకు రిలయన్స్‌ రిటైల్‌ సిద్ధమైంది. ప్రస్తుతం 557గా ఉన్న ఔట్‌లెట్లను వచ్చే ఐదేళ్లలో 2,500కు పెంచాలని, ఈ కామర్స్‌తోనూ అనుసంధానించాలని కంపెనీ భావిస్తున్నట్లు తెలిసింది. కొత్త ఈ కామర్స్‌ విధానం అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ సంస్థలకు ప్రతికూలంగా ఉండడంతో... ఈ కామర్స్‌ విభాగంలో ఫ్యాషన్‌ పరంగా విస్తరించేందుకు ఇది అనుకూల సమయమని

Most from this category