STOCKS

News


ఏప్రిల్ నుంచి కొత్త జీఎస్‌టీ రిటర్న్‌ ఫారాలు

Wednesday 5th December 2018
news_main1543984758.png-22642

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి సరళంగా ఉండే కొత్త జీఎస్‌టీ ఫారాలను ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర రెవెన్యూ విభాగం కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే వెల్లడించారు. వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) వసూళ్లకు సంబంధించి నిర్దేశించుకున్న లక్ష్యాలను కచ్చితంగా సాధించగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పన్నులు ఎగవేస్తున్న సంస్థల వివరాలను రెవెన్యూ శాఖ సేకరిస్తోందని డైరెక్టరేట్ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా విలేకరులతో పాండే చెప్పారు. జీఎస్‌టీ కౌన్సిల్‌ ఈ నెలలో మరోసారి సమావేశం కానున్నట్లు తెలియజేశారు. 2018-19లో వార్షికంగా జీఎస్‌టీ వసూళ్లు రూ.13.48 లక్షల కోట్లుగా ఉండాలని కేంద్రం నిర్దేశించుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ - నవంబర్ మధ్య కాలంలో జీఎస్‌టీ వసూళ్లు రూ. 7.76 లక్షల కోట్లుగా ఉన్నాయి. నెలవారీగా రూ. 1 లక్ష కోట్ల వసూళ్లను లక్ష్యంగా పెట్టుకోగా, దీన్ని రూ.1.10 లక్షల కోట్లకు పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నామని పాండే తెలిపారు. నవంబర్‌లో జీఎస్‌టీ వసూళ్లు రూ. 97,637 కోట్లుగా ఉన్నాయని, లక్ష్యానికన్నా సుమారు రూ. 4,000 కోట్లు తగ్గిందని ఆయన చెప్పారు. 
ఐటీ చట్టంలో అస్పష్టత తొలగించడంపైనే టాస్క్‌ఫోర్స్‌ దృష్టి..
ఆదాయ పన్ను చట్టాన్ని సమగ్రంగా తీర్చిదిద్దేందుకు ఏర్పాటైన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ .. నాటకీయ మార్పులు, పన్ను రేట్ల సవరణలు మొదలైన అంశాలకు సంబంధించి సిఫార్సులు చేయబోదని కమిటీ కన్వీనర్‌ అఖిలేష్ రంజన్ తెలిపారు. ప్రధానంగా చట్టాల్లో అస్పష్టతను తొలగించడంపైనే దృష్టి పెడుతుందని వివరించారు. కాలక్రమంలో అనేక సవరణలు, వివరణలు జోడిస్తూ రావడంతో ఐటీ చట్టం అసమగ్రంగా మారిందన్నారు. ఈ నేపథ్యంలోనే.. సమగ్రమైన చట్టం ముసాయిదా రూపకల్పనపై త్వరలోనే టాస్క్‌ఫోర్స్‌ సమావేశం కానుందని రంజన్ తెలిపారు. 
 



You may be interested

ఎల్‌ఐసీ ఓపెన్‌ ఆఫర్‌లో ప్రభుత్వం పాల్గొనదు: ఐడీబీఐ బ్యాంక్‌

Wednesday 5th December 2018

న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్‌లో వాటా పెంచుకోవడానికి గాను ఎల్‌ఐసీ ప్రకటించిన ఓపెన్‌ ఆఫర్‌లో ప్రభుత్వం పాల్గొనడం లేదు.  ఐడీబీఐ బ్యాంక్‌ మంగళవారం ఈ విషయాన్ని తెలిపింది. ఐడీబీఐ బ్యాంక్‌లో బీమా దిగ్గజం ఎల్‌ఐసీ తన వాటాను 51 శాతానికి పెంచుకుంటున్న విషయం తెలిసిందే. దీంట్లో భాగంగా 26 శాతం వాటా కొనుగోలు కోసం ఎల్‌ఐసీ ఓపెన్‌ ఆఫర్‌ను ప్రకటించింది. షేరు ఒక్కింటికి రూ.61.73 చొప్పున మొత్తం రూ. 12,602 కోట్లకు

వంద నగరాల్లో ఫుడ్‌ పాండా

Wednesday 5th December 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఫుడ్‌ డెలివరీ స్టార్టప్‌ ఫుడ్‌ పాండా దేశంలోని వంద నగరాల్లో విస్తరించింది. కంపెనీ వ్యాపారంలో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల వాటా 40 శాతం వరకూ ఉంటుంది. ప్రస్తుతం ఫుడ్‌ పాండాలో 1.25 లక్షల మంది పార్టనర్లున్నారు. రోజుకు 60 వేల రెస్టార్లెంట్ల నుంచి 3 లక్షల ఆర్డర్లను డెలివరీ చేస్తోంది.  

Most from this category