STOCKS

News


వచ్చే ఏడాది ఆర్థిక వృద్ధి జోరు- సీఐఐ

Monday 31st December 2018
news_main1546231551.png-23324

న్యూఢిల్లీ: పలు అంతర్జాతీయ ప్రతికూల సంఘటనలు జరిగినప్పటికీ, ఈ ఏడాది వేగవంతమైన వృద్ధి సాధించిన ఆర్థిక వ్యవస్థగా గుర్తింపుపొందిన భారత్‌ 2019లో సైతం ఇదే జోరును ప్రదర్శించగలదని పరిశ్రమల సమాఖ్య సీఐఐ అంచనావేసింది. సర్వీసుల రంగం పటిష్టమైన పనితీరుతో పాటు లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వినియోగ డిమాండ్‌ మెరుగుదల కారణంగా 2019లో జీడీపీ వృద్ధి 7.5 శాతానికి చేరుతుందని సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ పేర్కొన్నారు. జీఎస్‌టీ అమలులో క్రమేపీ అడ్డంకులు తొలగడం, మౌలిక సదుపాయాల కల్పనలో పెట్టుబడులు పెరగడం, రుణ సమీకరణ ప్రత్యేకించి సర్వీసుల రంగంలో 24 శాతానికి పెంచుకోవడం వంటి అంశాలు బలమైన ఆర్థికాభివృద్ధికి బాట వేస్తున్నాయని ఆయన వివరించారు. 2018లో పలు ప్రధాన దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మొదలుకావడం, చమురు ధరలు పెరగడం, అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ కఠినతర ద్రవ్య విధానం వంటి ప్రతికూలాంశాల నడుమ భారత్‌ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధిచెందిందని సీఐఐ గుర్తుచేసింది.
2019లో జీడీపీ వృద్ధి వేగవంతంకావడానికి ఏడు కీలక విధాన చర్యల్ని సీఐఐ సూచించింది. ఇంధనం, రియల్‌ ఎస్టేట్‌, విద్యుత్‌, ఆల్కహాల్‌ విభాగాలను జీఎస్‌టీ పరిథిలోకి తేవడం, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రుణ లభ్యతను పెంచడం, పీసీఏ పరిధిలో వున్న బ్యాంకులపై నియంత్రణలను సరళీకరించడంతో పాటు మ్యూచువల్‌ఫండ్స్‌తో సహా ఆర్థిక సంస్థలకు అత్యవసర నిధుల్ని అందుబాటులో వుంచాలని సీఐఐ కోరింది. ల్యాండ్‌ రికార్డుల్ని డిజిటలైజ్‌ చేయడం, రాష్ట్రాల్లో ఆన్‌లైన్‌ సింగిల్‌ విండో వ్యవస్థల్ని ఏర్పాటుచేయడం వంటి జరగాలని సీఐఐ ఆకాంక్షించింది.



You may be interested

తక్షణ నిరోధం 36,480

Monday 31st December 2018

నాటకీయంగా గతవారం ద్వితీయార్థంలో అమెరికాతో పాటు జపాన్‌, యూరప్‌ తదితర ధనిక మార్కెట్లు కుదుటపడిన నేపథ్యంలో తీవ్ర పతనం నుంచి భారత్‌ సూచీలు సైతం కోలుకున్నాయి. అయితే అమెరికా మార్కెట్ల రికవరీ తక్కువ ట్రేడింగ్‌ పరిమాణంతో జరుగుతున్నది. ఇది ప్రపంచవ్యాప్తంగా బుల్స్‌ను ఆందోళనపర్చే అంశం. అయితే సాధారణంగా జనవరి తొలివారంలో దాదాపు ప్రపంచ సూచీలన్నీ స్థిరంగా ట్రేడవుతూవుంటాయి. జనవరి రెండోవారంలో ఒడుదుడుకులు మొదవుతుంటాయి. ఈ సందర్భంగా విదేశీ ఇన్వెస్టర్లు భారత్‌

అన్ని కాలాల్లోనూ పనితీరులో భేష్‌!

Monday 31st December 2018

అన్ని కాలాల్లోనూ పనితీరులో భేష్‌! రిలయన్స్‌ లార్జ్‌క్యాప్‌ ఫండ్‌ దీర్ఘకాలం కోసం ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేయాలనుకునే వారు తప్పక పరిశీలించాల్సిన పథకాల్లో రిలయన్స్‌ లార్జ్‌క్యాప్‌ ఫండ్‌ కూడా ఒకటి. గతంలో రిలయన్స్‌ టాప్‌ 200 పేరుతో ఈ పథకం నడిచింది. సెబీ నూతన నిబంధనల మేరకు పేరు మారింది. ఇది లార్జ్‌క్యాప్‌ ఆధారిత పథకం. దీర్ఘకాలంలో ఇప్పటి వరకు చూసుకుంటే మంచి పనితీరును ప్రదర్శించింది. గతంలో డైవర్సిఫైడ్‌ విధానంలో ఇన్వెస్ట్‌ చేసే ఈ

Most from this category