STOCKS

News


క్రిప్టో కరెన్సీపై అధ్యయనానికి సెబీ అధికారులు

Friday 7th September 2018
news_main1536296203.png-20040

-విదేశాలకు స్టడీ టూర్స్‌ నిర్వహించిన సెబీ  న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీపై అధ్యయనం కోసం మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ కొందరు అధికారులను విదేశాలకు పంపింది. క్రిప్టో కరెన్సీకి సంబంధించి విదేశాల్లో ఉన్న విధానాలు, నిబంధనలు, ఇతర అంశాలను ఈ అధికారులు అధ్యయనం చేశారని తన వార్షిక నివేదికలో సెబీ తెలిపింది. కొంత మంది అధికారులను జపాన్‌, ఇంగ్లాండ్‌, స్విట్జర్లాండ్‌లకు పంపించామని పేర్కొంది.  ఈ స్టడీ టూర్లలో ఆయా దేశాల్లో క్రిప్టో కరెన్సీలకు సంబంధించిన విధి విధానాలను అధికారులు తెలుసుకున్నారని వివరించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ స్టడీ టూర్లతో పాటు పలు అంతర్జాతీయ సమావేశాలను నిర్వహించామని పేర్కొంది. భారత సెక్యూరిటీల మార్కెట్‌ను మరింత క్షుణ్నంగా అర్థం చేసుకోవడానికి ఆయా అంతర్జాతీయ సంస్థలకు ఈ సమావేశాలు ఉపయోగపడ్డాయని వివరించింది.
ఈ నెల 11న తుది విచారణ 
మరోవైపు వర్చువల్‌ కరెన్సీ విధి విధానాల అథ్యయనానికి ప్రభుత్వం ఇప్పటికే ఒక ఇంటర్‌-డిసిప్లినరీ కమిటీని ఏర్పాటు చేసింది. ఆర్థిక వ్యవహరాల కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్‌ ఈ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ కమిటీలో సెబీ చైర్మన్‌ అజయ్‌ త్యాగి, ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ బి.పి. కనుంగోలు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ తన నివేదికను సమర్పించాల్సి ఉంది. కాగా బిట్‌ కాయిన్‌ వంటి క్రిప్టోకరెన్సీల లావాదేవీలను అనుమతిస్తే, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ప్రోత్సాహం ఇచ్చినట్లు అవుతుందని ఈ ఏడాది జూలైలో సుప్రీం కోర్ట్‌కు ఆర్‌బీఐ నివేదించింది. అందుకే వర్చువల్‌ కరెన్సీలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశామని ఆర్‌బీఐ పేర్కొంది. క్రిప్టో కరెన్సీ ఇన్వెస్టర్లు ఈ నిషేధాన్ని సవాల్‌ చేశారు. అయితే ఈ నిషేధాన్ని తొలగించడానికి సుప్రీం కోర్ట్‌ అంగీకరించలేదు. దీనికి సంబంధించిన తుది విచారణ ఈ నెల 11న జరగనుంది. 

 


 You may be interested

​​​​​​​చైనాపై మరిన్ని సుంకాలకు అమెరికా కసరత్తు..

Friday 7th September 2018

వాషింగ్టన్‌: వాణిజ్య యుద్ధాలకు కాలుదువ్వుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తాజాగా చైనా నుంచి దిగుమతయ్యే మరిన్ని ఉత్పత్తులపై టారిఫ్‌లు విధించేందుకు సిద్ధమవుతోంది. ఈ అంశంపై ప్రజాభిప్రాయ సేకరణకు గురువారంతో గడువు ముగియడంతో నిర్ణయం తీసుకోవడం ఇక లాంఛనం మాత్రమే కాగలదని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో మరో 200 బిలియన్ డాలర్ల విలువ చేసే చైనా దిగుమతులపై 25 శాతం దాకా సుంకాలు విధించవచ్చని పేర్కొన్నాయి. ఇప్పటికే

జీతాలివ్వకుంటే సహాయ నిరాకరణే

Friday 7th September 2018

ముంబై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌కు తాజాగా మరో చిక్కొచ్చి పడింది. జీతభత్యాలు సత్వరం చెల్లించకపోతే ‘సహాయ నిరాకరణ' తప్పదని సంస్థ యాజమాన్యాన్ని పైలట్లు హెచ్చరించారు. "జీతాలను ఆపివేయడం.. అది కూడా ముందస్తుగా సమాచారం కూడా ఇవ్వకుండా చేయడమన్నది చాలా తీవ్రమైన విషయం. ఇందుకు సంబంధించిన పరిణామాలకు యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. మేం లేవనెత్తిన సమస్యలను పరిష్కరించి, సకాలంలో జీతాలు చెల్లించని

Most from this category