STOCKS

News


ఎస్‌బీఐ డిపాజిట్‌ రేట్లు కొంచెం పెరిగాయ్‌!

Thursday 29th November 2018
news_main1543470145.png-22472

ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం- స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) స్థిర డిపాజిట్‌ రేట్లు వివిధ మెచ్యూరిటీలపై 10 బేసిస్‌ పాయింట్ల (100 బేసిస్‌ పాయింట్లు ఒకశాతం) వరకూ పెరిగి 6.80 శాతానికి చేరాయి. కోటి రూపాయల లోపు వివిధ డిపాజిట్లపై 5 నుంచి 10 బేసిస్‌ పాయింట్ల వరకూ పెరిగిన ఈ రేట్లు తక్షణం అమల్లోకి వస్తాయని బ్యాంక్‌ తెలిపింది.  

పెంపు వివరాల్లోకి వెళితే...
♦ ఏడాది- రెండేళ్ల మధ్య డిపాజిట్‌ రేటు 6.70 శాతం నుంచి 6.80 శాతానికి పెరిగింది. సీనియర్‌ సిటిజన్స్‌ విషయంలో ఈ రేటు 7.20 శాతం నుంచి 7.30 శాతానికి పెరిగింది. 
♦ రెండు-మూడేళ్ల రేటు 6.75 శాతం నుంచి 6.80 శాతాని చేరింది. ఈ విభాగంలో సీనియర్‌ సిటిజన్లకు ఇచ్చే స్థిర డిపాజిట్‌ రేటు 7.25 శాతం నుంచి 7.30 శాతానికి పెరిగింది. 
♦ ఇతర మెచ్యూరిటీ డిపాజిట్లపై వచ్చే వడ్డీరేట్లలో  మార్పులేదు.  మూడేళ్లు - ఐదేళ్ల మధ్య డిపాజిట్‌ రేటు 6.80 శాతంగా ఉంది. 

ఇప్పటికే ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు
ప్రైవేటు రంగంలోని తొలి రెండు బ్యాంకులు- ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీలు ఈ నెల ప్రారంభంలోనే డిపాజిట్‌ రేట్లను పెంచాయి. దీనికి నేపథ్యమే ఎస్‌బీఐ డిపాజిట్‌రేటు పెంపు కావడం గమనార్హం. ఐసీఐసీఐ బ్యాంక్‌ డిపాజిట్‌ రేటు పావుశాతం వరకూ పెరిగితే, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ విషయంలో ఈ పెంపు 0.5 బేసిస్‌ పాయింట్లుగా ఉంది. 
 



You may be interested

3 నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగుల నిరవధిక సమ్మె

Thursday 29th November 2018

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులు డిసెంబర్ 3 నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నారు. కొత్త టెల్కో రిలయన్స్ జియోపై ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందన్న ఆరోపణలే ఇందుకు కారణం. టెలికం సేవల్లో జియోతో పోటీపడకుండా చేసేలా బీఎస్‌ఎన్ఎల్‌కు కేంద్రం 4జీ స్పెక్ట్రం కేటాయించలేదని ఉద్యోగ సంఘాలు ఆరోపించాయి. "ప్రస్తుతం మొత్తం టెలికం రంగం అంతా కూడా సంక్షోభంలో ఉంది. ఇదంతా కూడా ముకేశ్ అంబానీ సారథ్యంలోని

ఎంఎస్‌ఆర్‌ కాపర్‌ ‘డాక్టర్‌ టర్మరిక్‌’

Thursday 29th November 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: డాక్టర్‌ కాపర్‌ పేరుతో రాగి బాటిళ్ల తయారీలో ఉన్న ఎంఎస్‌ఆర్‌ కాపర్‌ త్వరలో హెల్త్‌కేర్‌ విభాగంలోకి ప్రవేశిస్తోంది. డాక్టర్‌ టర్మరిక్‌  పేరుతో తొలి ఉత్పాదనను డిసెంబరు చివరికల్లా విడుదల చేయనుంది. ఆర్గానిక్‌ పసుపు, సహజ రసాయనాలతో తయారు చేసిన ఈ పౌడర్‌ యాంటిబయాటిక్‌గా పనిచేస్తుంది. మౌత్‌వాష్‌గా వాడొచ్చు. అలాగే మంచినీటిలో కలుపుకుని తాగవచ్చు. వంటల్లోనూ వినియోగించొచ్చు. పేటెంటుకు దరఖాస్తు చేశామని ఎంఎస్‌ఆర్‌ కాపర్‌ ఎండీ కె.వి.రాజశేఖర్‌ రెడ్డి

Most from this category