News


ఇక రోజుకు రూ.20వేలే!!

Tuesday 2nd October 2018
news_main1538451245.png-20776

ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం- స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) రోజువారీ ఏటీఎం విత్‌డ్రాయెల్‌ పరిమితిని సగానికి సగం తగ్గించేస్తోంది. ప్రస్తుతం ఈ పరిమితి రూ.40,000 ఉండగా... దీనిని ఈ నెలాఖరు నుంచి రూ.20,000కు తగ్గిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలియజేసింది. మోసపూరిత లావాదేవీలు పెరిగిపోతుండడంతో, కస్టమర్ల ప్రయోజనాల పరిరక్షణ లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంక్‌ సోమవారం ప్రకటించింది. తాజా నిర్ణయం వల్ల ఏటీఎంల ద్వారా ఒకేరోజు పెద్ద మొత్తంలో నిధుల విత్‌డ్రా చేయడానికి అవకాశం ఉండదు. దీనివల్ల మోసగాళ్లు సైతం రోజుకు రూ.20వేల కన్నా ఎక్కువ విత్‌డ్రా చేయలేరు కనక ఒకవేళ ఎవరైనా మోసపోయినా మరీ ఎక్కువ మొత్తాన్ని పోగొట్టుకోకుండా ఉంటారన్నది తమ ఉద్దేశమని బ్యాంకు తెలియజేసింది. ఏదైనా మోసపూరిత విత్‌డ్రాయెల్‌ జరిగితే వెంటనే కార్డ్‌ బ్లాక్‌ చేయించుకోవడం, సంబంధిత బ్రాంచీని సంప్రతించడం చేయాలని, దాంతో నష్టాన్ని పరిమితం చేసుకోవచ్చని కూడా సూచించింది. ఈ నిర్ణయం  అక్టోబర్‌ 31 నుంచీ అమల్లోకి వస్తుంది. ‘‘క్లాసిక్‌-డెబిట్‌ కార్డ్‌పై విత్‌డ్రాయెల్‌ పరిమితిని రూ.20,000కు తగ్గిస్తున్నాం. ఇతర కార్డులకు సంబంధించి రోజూవారీ విత్‌డ్రాయెల్‌ పరిమితిలో ఎలాంటి మార్పూ లేదు. క్లాసిక్‌-డెబిట్‌ కార్డ్‌ చిప్‌ ఆధారితం కాదు. కాబట్టి సెక్యూరిటీ పరమైన ఆందోళనలు ఉన్నాయి. పలు ఫిర్యాదులూ అందాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని సీనియర్‌ బ్యాంక్‌ మేనేజర్‌ ఒకరు తెలిపారు. దేశ వ్యాప్తంగా ఎస్‌బీఐకి దాదాపు 42 కోట్ల మంది కస్టమర్లున్నారు. 2018 మార్చి నాటికి బ్యాంక్‌ 39.50 కోట్ల డెబిట్‌ ‍కార్డులను జారీ చేసింది. వీటిలో దాదాపు 26 కోట్ల కార్డుల వినియోగం పూర్తి క్రియాశీలంగా ఉంది. డెబిట్‌ కార్డుల జారీకి సంబంధించి ఎస్‌బీఐ మార్కెట్‌ వాటా దాదాపు 32.3 శాతం.
 You may be interested

రద్దు చేస్తే... హక్కులు వదులుకున్నట్టు కాదు

Tuesday 2nd October 2018

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులు వసూలు కాని మొండి బకాయిలను (ఎన్‌పీఏలు) మాఫీ చేస్తుండడాన్ని (రైటాఫ్‌) కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ సమర్థించుకున్నారు. ఇలా చేయడం ఎన్‌పీఏలపై హక్కులు వదులుకోవడానికి దారితీయదన్నారు. బ్యాంకులు తమ బ్యాలన్స్‌ షీట్లను ప్రక్షాళించుకోవడానికి, పన్ను ప్రయోజనం పొందడానికి వీలు పడుతుందని చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) రూ.36,551 కోట్ల ఎన్‌పీఏలను వసూలు చేసినట్టు చెప్పారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో

ఫోర్బ్స్‌ జాబితాలో 12 ఉత్తమ భారత కంపెనీలు

Tuesday 2nd October 2018

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 250 ఉత్తమ కంపెనీల జాబితాను ఫోర్బ్స్ రూపొందించగా.. 12 భారత కంపెనీలు ఇందులో స్థానం సంపాదించుకున్నాయి. 2018 ఏడాదికి రూపొందించిన ఈ జాబితాలో ఐటీ సేవల సం‍స్థ ఇన్ఫోసిస్ 31 వ స్థానంలో నిలిచింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (35), టాటా మోటార్స్ (70), టాటా స్టీల్ (131), ఎల్‌ అండ్‌ టీ (135), గ్రాసిమ్ ఇండస్ట్రీస్ (154), జనరల్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా

Most from this category