STOCKS

News


భారత ఇంధన అవసరాలకు మరింత సహకారం

Saturday 1st December 2018
news_main1543644380.png-22551

న్యూఢిల్లీ: భారత్‌ తన ఇంధన అవసరాలను అధిగమించేందుకు అవసరమైతే మరింతగా పెట్రోలియం ఉత్పత్తులను సరఫరా చేస్తామని సౌదీ రాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌ స్నేహ హస్తం ప్రకటించారు. ఈ మేరకు సౌదీ మీడియా కథనాలను ప్రచురించింది. అర్జెంటీనియా రాజధాని బ్యూనోస్‌ ఎయిర్స్‌లో జి-20 సదస్సు సందర్భంగా సల్మాన్‌ నివాసంలో ఇరు దేశాధినేతలు భేటీ అయ్యారు. రాజకీయ, భద్రత, ఆర్థికం, పెట్టుబడులు, వ్యవసాయం, ఇంధన, సాంస్కృతిక, టెక్నాలజీ విభాగాల్లో ద్వైపాక్షిక సహకారంపై వీరు చర్చలు జరిపినట్టు సౌదీ ప్రెస్‌ ఏజెన్సీ తెలిపింది. పబ్లిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ ద్వారా మౌలిక రంగంలో పెట్టుబడుల అవకాశాలు, అలాగే సాగు ఉత్పత్తులను ఇతర దేశాలకు బదులు భారత్‌ నుంచి దిగుమతి చేసుకునే అంశాలపైనా వీరు చర్చించారు. భారత్‌కు మరిన్ని పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతికి, సౌదీ ఆరామ్‌కో ద్వారా రిఫైనరీల్లో పెట్టుబడులకూ సిద్ధమని సౌదీ రాజు ప్రకటించారు. భారత్‌కు అతిపెద్ద చమురు ఎగుమతి దేశాల్లో సౌదీ అరేబియా ఒకటి. 



You may be interested

సీపీఎస్‌యూ ఈటీఎఫ్‌కు రూ.27,300 కోట్ల బిడ్‌లు

Saturday 1st December 2018

న్యూఢిల్లీ: సీపీఎస్ఈ ఈటీఎఫ్‌ (ఎక్స్చేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌) ఫాలో ఆన్‌ ఆఫర్‌ ద్వారా కేంద్రం రూ.17,000 కోట్లకు పైగా సమీకరించనుంది. దేశీయంగా ఒక ఈటీఎఫ్‌ ద్వారా ఈ స్థాయిలో నిధులు సమీకరించడం ఇదే మొదటిసారి. ఈ నెల 27న ఆరంభమైన ఈ ఆఫర్‌ శుక్రవారం ముగిసింది. దీనికి మొత్తం 1.25 లక్షల దరఖాస్తుల ద్వారా రూ.27,300 కోట్ల విలువైన బిడ్‌లు వచ్చాయి. యాంకర్‌ ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా 5.5 రెట్లు

వృద్ధి వేగం తగ్గింది...

Saturday 1st December 2018

న్యూఢిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌) మందగించింది. 7.1 శాతంగా నమోదయ్యింది. గడచిన మూడు త్రైమాసికాల్లో ఇంత తక్కువ వృద్ధి రేటు ఇదే తొలిసారి. రెండవ త్రైమాసిక కాలంలో డాలర్‌ మారకంలో రూపాయి బలహీనత, క్రూడ్‌ ధరల తీవ్రత వంటి అంశాలు వృద్ధి స్పీడ్‌ను తగ్గిస్తాయని ఎస్‌బీఐ రిసెర్చ్‌ ఇక్రా వంటి పలు ఆర్థిక సంస్థలు

Most from this category