STOCKS

News


ఎన్నికల బాండ్లకు డిమాండ్‌ భళా!

Monday 1st April 2019
news_main1554141570.png-24910

ఎన్నికల సంవత్సరం కావడంతో ఎన్నికల బాండ్ల విక్రయాలు జోరుగా సాగాయి. క్రితం ఏడాదితో పోలిస్తే 2018లో ఎస్‌బీఐ 62 శాతం అధికంగా రూ.1,700 కోట్ల విలువైన ఎలక్టోరల్‌ బాండ్లను విక్రయించింది. 2018 మార్చి, ఏప్రిల్‌, మే, జూలై, అక్టోబర్‌, నవంబర్‌లో రూ.1,056.73 కోట్ల విలువైన బాండ్లను విక్రయించింది. అలాగే, ఈ ఏడాది జనవరి, మార్చి నెలల్లో విక్రయించిన వాటి విలువనూ కలిపి చూస్తే మొత్తం రూ.1,716 కోట్లు మేర ఎలక్టోరల్‌ బాండ్లు అమ్ముడుపోయాయి. సమాచార హక్కు చట్టం కింద వచ్చిన దరఖాస్తుకు ప్రతిగా ఎస్‌బీఐ ఈ వివరాలను వెల్లడించింది. 

 

ఈ నెల 11న తొలి దశ పోలింగ్‌ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. మొత్తం ఏడు దశల్లో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ​ జరగనుంది. మే 23న ఫలితాలు వెల్లడి అవుతాయి. ఎలక్టోరల్‌ బాండ్ల విక్రయాల బాధ్యతను కేంద్రం ఎస్‌బీఐకి అప్పగించింది. అధికంగా ముంబైలో రూ.495 కోట్ల మేర, కోల్‌కతాలో రూ.370 కోట్లు, హైదరాబాద్‌లో రూ.290 కోట్లకు పైగా, ఢిల్లీలో రూ.206 కోట్లు, భువనేశ్వర్‌లో రూ.194 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేశారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్‌ 29ఏ కింద రిజిస్టర్డ్‌ రాజకీయ పార్టీలు, అసెంబ్లీ లేదా సాధారణ ఎన్నికల్లో ఒక శాతం కంటే తక్కువ కాకుండా ఓట్లు సంపాదించుకున్నవి ఎలక్టోరల్‌ బాండ్లు తీసుకునేందుకు అర్హత ఉంటుంది. పౌరులు ఎవరైనా రాజకీయ పార్టీలకు విరాళం ఇవ్వదలిస్తే ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలోనే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ బాండ్ల కాల వ్యవధి 15 రోజులు. ఆ లోపు వాటిని పార్టీలు బ్యాంకు ఖాతాల నుంచి నగదుగా మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే, అసోసియేషన్‌ ఫర్‌ డెమెక్రటిక్‌ రిఫార్మ్స్‌ వీటి విక్రయాలపై కోర్టు స్టే కోరగా, సీపీఎం సుప్రీంకోర్టులో సవాలు చేసింది.You may be interested

ఫ్లాట్‌గా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 

Tuesday 2nd April 2019

 క్రితం రోజు భారీ ర్యాలీ జరిపిన భారత్‌ సూచీలు మధ్యాహ్న సెషన్‌ తర్వాత లాభాల స్వీకరణకు గురైన నేపథ్యంలో మంగళవారం  ఫ్లాట్‌గా ప్రారంమయ్యే సంకేతాలిస్తూ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ స్వల్పలాభంతో ట్రేడవుతోంది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.35  గంటలకు 1 పాయింట్ల లాభంతో 11,750 పాయింట్ల వద్ద కదులుతోంది. మంగళవారం ఇక్కడ నిఫ్టీ మార్చి ఫ్యూచర్‌ 11,749 పాయింట్ల వద్ద ముగిసింది.  క్రితం రోజు రాత్రి అమెరికా సూచీలు

ఐపీవో మార్కెట్‌లో మళ్లీ అలజడి?

Monday 1st April 2019

ఐపీవో మార్కెట్‌కు 2018-19 విరామ సంవత్సరంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఐపీవో ఇష్యూలు 14ని మించలేదు. అందులో హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ, ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌, రైట్స్‌ లిమిటెడ్‌ పేరున్న ఇష్యూలు. మిగిలినవన్నీ చిన్నవే. 2019-20 ఆర్థిక సంవత్సరంలోకి ప్రవేశించాం. ఆర్‌వీఎన్‌ఎల్‌ రూపంలో తొలి ఇష్యూ ఆరంభమైంది. మార్కెట్లపై బుల్స్‌ పట్టు, సానుకూల పరిస్థితుల నేపథ్యంలో ఐపీవో మార్కెట్‌లో కళకళలు మళ్లీ ఆరంభం కావచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. రిస్క్‌ తీసుకునే ఇన్వెస్టర్లే ప్రస్తుతం ఐపీవోలను

Most from this category