News


సాక్షి బిజినెస్‌ క్విజ్‌ - 20 "ఇంటర్నేషనల్ టైగర్ డే"

Sunday 29th July 2018
news_main1532871845.png-18757

1. పులి శరీర భాగాల అక్రమ వ్యాపారం విలువ అంతర్జాతీయ స్థాయిలో సాలీనా సుమారు 6 బిలియన్ల అమెరికన్ డాలర్లు. పులిని వేటాడడం నిషేధం. అంతర్జాతీయ నల్ల మార్కెట్లో ఒక పెద్ద పులి చర్మం రూ. ఎంత ధర పలుకుతుంది?
ఎ) 10 లక్షలు
బి) 5 లక్షలు
సి) 20-25 లక్షలు
డి) 2 లక్షలు
 
2. వన్యప్రాణుల చట్టం 1972 క్రింద అంతరించిపోతున్న జాతులను తమతో ఉంచుకోవడం నేరం. అంతర్జాతీయ చీకటి మార్కెట్లో ఒక పులి పిల్ల ధర రూ. ఎంత?
ఎ) 2 లక్షలు - 3 లక్షలు
బి) 5 లక్షల - 8 లక్షలు
సి 10 లక్షలు - 15 లక్షలు
డి) 15 లక్షల - 20 లక్షలు
 
3. పులి యొక్క దాదాపు ప్రతి అవయవం చైనీస్ ఔషధం లో, సారా, సూపు తయారీకి  ఉపయోగిస్తారు. ఒక జత పులి కళ్ళు 15  వేలు, ఒక పంజా విలువ 70000 వేలు. ఒక పులి పురుషాంగం రూ ఎంత పలుకుతుంది?
ఎ) 75 వేలు నుంచి 1 లక్షలు
బి) 2 లక్షల నుంచి 3 లక్షలు
సి) 25 వేలు
డి) 50 వేలు 
 
4. 2012-17లో కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ టైగర్ కొరకు ఎంత రూ. ఖర్చు పెట్టింది?
ఎ) 10000 కోట్లు
బి) 2500 కోట్లు
సి) 1000 కోట్లు
డి) 500 కోట్లు
 
5. 2014 పులుల జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 2228 పులులున్నాయి. ప్రభుత్వం సగటున సంవత్సరానికి ఒక పులికి రూ. ఎంత బడ్జెట్ కేటాయిస్తోంది? 
ఎ) 20 లక్షలు
బి) 9 లక్షలు
సి) 2 లక్షలు
డి) 80 వేలు
 
6. 1973 లో పులుల పరిరక్షణ కోసం ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభించినది. 1973 నుంచి  2014 వరకు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపు ఏర్పాటు ఏమిటి?
ఎ) పునరావృతం కాని చర్యలకు 50% మద్దతు మరియు స్థిర వ్యయానికి 100% మద్దతు  
బి) పునరావృతం కాని కార్యకలాపాలకు 50% మద్దతు మరియు పునరావృత వ్యయం కోసం 50% మద్దతు
సి) పునరావృత కార్యకలాపాలకు 50% మద్దతు మరియు అస్థిర వ్యయానికి 100% మద్దతు
డి) పునరావృత కార్యకలాపాలకు 60% మద్దతు మరియు ఆస్థిర వ్యయం కోసం 40% మద్దతు
 
7. 11వ పంచవర్ష ప్రణాళిక (2007-12) కొరకు 'ప్రాజెక్ట్ టైగర్'  పథకానికి ప్రభుత్వం ఎంత కేటాయింపు చేసింది
ఎ)  600 కోట్లు
బి) 1000 కోట్లు
సి) 1200 కోట్లు
డి) 1500 కోట్లు
 
8. 2016 -17 ఆర్థిక సం. లో  ప్రభుత్వం ఏ సెస్ పెంచడం ద్వారా ప్రాజెక్ట్ టైగర్కు అధిక నిధులు సమకూర్చింది?
ఎ) వాణిజ్య వాహనాలపై వాయు కాలుష్య సెస్
బి) డీజిల్పై కార్బన్ ఫుట్ప్రింట్  సెస్
సి)  ముడి చమురుపై కార్బన్ ఫుట్ప్రింట్  సెస్
డి) బొగ్గు మీద క్లీన్ ఎనర్జీ సెస్
 
9. ఆరు టైగర్ రిజర్వు పార్కులున్న మధ్యప్రదేశ్ రాష్ట్రం, 2015-16 మరియు 2014-15 లో రూ. ఎంత నిధులను పొందింది?
ఎ) 12.50 కోట్లు, 15 కోట్లు 
బి  41.35 కోట్లు, 27.92 కోట్లు
సి) 21.85 కోట్లు, 37.25 కోట్లు
డి) 27.92 కోట్లు, 41.35 కోట్లు
 
10. టైగర్ రిజర్వులలో ఆవాసాముంటున్న మనుషులను వేరే చోటుకి తరలించి, నివాసం మార్చడానికి ఒక కుటుంబానికి ప్రభుత్వం ఎంత పరిహారం చెల్లించింది?
ఎ) 2 లక్షలు
బి) 5 లక్షలు
సి) 10 లక్షలు
డి) 20 లక్షలు
 
11. 2010 లో డబ్యూ. డబ్యూ. ఎఫ్,  వైల్డ్లైఫ్ కన్జర్వేషన్ సొసైటీ, మరియు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు కలసి 13 దేశాలలో గ్లోబల్ టైగర్ రికవరీ ప్రోగ్రాం కోసం రూపాయిల్లో ఎంత  నిధులు కేటాయించేరు?
ఎ) 2000 కోట్లు
బి) 5000 కోట్లు
సి) 7500 కోట్లు
డి) 8500 కోట్లు
 
12. ఒక టైగర్ రిజర్వ్  ప్రధాన ప్రాంతంలో పులిని వేటాడడానికి, చంపడానికి శిక్ష ఏమిటి?
ఎ) 3 సంవత్సరాల జైలు 7 సం కు  పొడిగించబడొచ్చు మరియు 50 వేల జరిమానా 2 లక్షలకు పెంచబడొచ్చు
బి) 7 సంవత్సరాల జైలు మరియు 25 లక్షల జరిమానా
సి) 10 సంవత్సరాల జైలు మరియు 5 లక్షల జరిమానా
డి) 7 సంవత్సరాల జైలు, 10 సం కు  పొడిగించబడొచ్చు మరియు 50 వేల జరిమానా 2 లక్షలకు పెంచబడొచ్చు
 
13. ఒక టైగర్ రిజర్వ్  ప్రధాన ప్రాంతంలో పులిని వేటాడడానికి, చంపిన నేరం పునరావృతమైనపుడు శిక్ష ఏమిటి?
ఎ) 10 సంవత్సరాల కారాగారం మరియు 5 లక్షల జరిమానా
బి) 5 సంవత్సరాల కారాగారం మరియు 50,000 ల జరిమానా 5 లక్షల వరకు విస్తరించవచ్చు
సి) 7 సంవత్సరాల కారాగారం  మరియు 50 లక్షల జరిమానా 50 లక్షలకు పెంచబడొచ్చు 
డి) 10 సంవత్సరాల కారాగారం మరియు 50 లక్షల జరిమానా
 
14. బ్రతికున్న ఒక పులి కోసం చట్టవిరుద్ధమైన అంతర్జాతీయ మార్కెట్లో వేటగాళ్లకు స్మగ్లర్ల మాఫియా రూ. ఎంత చేల్లిస్తుంది?
ఎ) 20 లక్షలు
బి) 32 లక్షలు
సి) 80 లక్షలు
డి) 2 కోట్లు
 
సమాధానాలు: 1సి, 2ఎ, 3ఎ, 4ఎ, 5బి, 6సి, 7ఎ, 8డి, 9డి, 10సి, 11ఎ, 12ఎ, 13సి, 14బి
 
సునీల్ ధవళ
సీఈఓ,ద థర్డ్ అంపైర్ మీడియా
ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్You may be interested

పనితీరులో ఫండ్స్‌ వెనకబడ్డాయేమి?

Monday 30th July 2018

గడిచిన 20 ఏళ్లుగా టాప్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ సూచీలతో పోలిస్తే స్థిరంగా మెరుగైన రాబడులను ఇచ్చాయి. సరైన నిర్వహణ ఉన్న ఈక్విటీ డైవర్సిఫైడ్‌ ఫండ్స్‌ వార్షికంగా కనీసం 3-4 శాతం అధికంగా నిఫ్టీ రాబడుల కంటే ఎక్కువ ఇచ్చినట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. కానీ, ఈ ఏడాది ఇప్పటి వరకు చూసుకుంటే డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్స్‌ పనితీరు నిఫ్టీతో పోలిస్తే దారుణంగా ఉంది. 25 ఫండ్స్‌లో 24 పథకాల పరిస్థితి

అప్పు తీసుకున్నా ఆదాయపన్ను ప్రయోజనాలు

Sunday 29th July 2018

రుణం తీసుకోవాలంటే తగిన కారణం ఉండాలంటారు. అలా చూసుకుంటే కొన్ని రకాల రుణాలకు ఆదాయపన్ను ప్రయోనాలు ఉన్నాయి. ఇంటి కోసం రుణం, విద్యా రుణం, పర్సనల్‌ లోన్‌ వీటన్నింటిపైనా పన్ను ప్రయోజనాలు అందుకోవచ్చు. అవేంటన్నది తెలిపే కథనం ఇది.   విద్యా రుణం విద్యా రుణాలు తీసుకునే వారు ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్‌ 80ఈ కింద పన్ను ప్రయోజనాలకు అర్హులు. వరుసగా ఎనిమిది సంవత్సరాలపాటు రుణంపై చెల్లించే వడ్డీ (ఎంత మొత్తమైనా)ని ఆదాయం నుంచి

Most from this category