STOCKS

News


రూపీ గమనం ఈ కంపెనీలకు కీలకం

Tuesday 11th December 2018
news_main1544467144.png-22809

దేశీ కరెన్సీ విలువ డాలర్‌తో గత నెల రోజులుగా కాస్త స్థిరంగా చలిస్తోంది. అంతకుముందు డాలర్‌తో చారిత్రక కనిష్ట స్థాయి 74.39ని నమోదు చేసింది. ఆ స్థాయి నుంచి 5 శాతం రికవరీ కావడం కాస్త ఉపశమనం ఇచ్చింది. రూపాయి విలువ గడిచిన ఏడాదిలో పది శాతం వరకు నష్టపోయింది. రూపాయి విలువ క్షీణించడం మన ఆర్థిక రంగానికి లాభం కంటే నష్టమే ఎక్కువ కలిగిస్తుంది. ఎందుకంటే మన దేశం నుంచి ఎగుమతుల కంటే దిగుమతుల విలువే ఎక్కువగా ఉంది. అంతేకాదు, రూపాయి పడిపోవడం కొన్ని కంపెనీలకు కూడా నష్టాలను తీసుకొచ్చి పెడుతుంది. ముఖ్యంగా విదేశీ మారకంలో రుణాలు తీసుకున్న కంపెనీల పరిస్థితి దారుణంగా మారుతుంది. కనుక ఇన్వెస్టర్లు తాము పెట్టుబడి పెట్టే ముందు ఆయా కంపెనీలకు ఉన్న విదేశీ రుణ భారాన్ని కూడా చూడడం ఎంతో అవసరం. 

 

వీటికి శిరోభారం

జెయిన్‌ ఇరిగేషన్‌కు ఉన్న మొత్తం రుణాల్లో 75 శాతం విదేశీ కరెన్సీ రూపంలోనిదే. యూపీఎల్‌ కంపెనీ మొత్తం రుణాల్లో విదేశీ మారకంలో తీసుకున్న మొత్తం 37 శాతం కాగా, ఇండిగో 22 శాతం, జెట్‌ ఎయిర్‌వేస్‌ 47 శాతం, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 19 శాతం, భారత్‌ ఫోర్జ్‌ 84 శాతం, అదానీ పోర్ట్స్‌ 61 శాతం, హిందాల్కో 57 శాతం, జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ 29 శాతం, టాటా స్టీల్‌ 69 శాతం, జిందాల్‌ స్టెయిన్‌లెస్‌ 15 శాతం, హెచ్‌పీసీఎల్‌ 52 శాతం, ఐవోసీ 51 శాతం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 37 శాతం చొప్పున తమ మొత్తం రుణాల్లో విదేశీ మారక రుణాలు కలిగి ఉన్నాయి. అలాగే, అరబిందో ఫార్మా కంపెనీ మొత్తం రుణాల్లో విదేశీ కరెన్సీ రూపంలో తీసుకున్నవి 83 శాతం కాగా, క్యాడిలా హెల్త్‌కేర్‌ 31 శాతం, గ్లెన్‌మార్క్‌ ఫార్మా 30 శాతం, సన్‌ఫార్మా 22 శాతం, టోరెంట్‌ ఫార్మా 11 శాతం, అదానీ పవర్‌ 12 శాతం, ఎన్‌టీపీసీ 29 శాతం, పవర్‌ గ్రిడ్‌ 25 శాతం, టాటాపవర్‌ 33 శాతం, సీఈఎస్‌సీ 15 శాతం, భారతీ ఎయిర్‌టెల్‌ 47 శాతం, స్టెరిలైట్‌ ఇండస్ట్రీస్‌ 18 శాతం చొప్పున తమ మొత్తం రుణాల్లో విదేశీ రుణాలను కలిగి ఉన్నాయి. 

 

రూపాయి కదలికలు

చమురు ధరల క్షీణతకు బ్రేక్‌ వేసి, ధరలకు ఆజ్యం పోసేందుకు గాను చమురు ఉత్పత్తి దేశాల సమాఖ్య ‘ఒపెక్‌’ ఉత్పత్తిలో 15 శాతం కోత పెట్టాలని నిర్ణయించింది. ఇరాన్‌పై అమెరికా ఆంక్షలతో చమురు ధరలకు రెక్కలు రావడం, ఆ తర్వాత అతిపెద్ద వినియోగదేశాలైన చైనా, భారత్‌, జపాన్‌లకు అమెరికా మినహాయింపులు ఇవ్వడంతో పెరిగిన ధరలు కాస్తా దిగివచ్చాయి. ఇప్పుడు ఓపెక్‌ తీసుకున్న నిర్ణయంతో చమురు ధరలు మరోసారి పెరగొచ్చంటున్నారు. ధరలు భారీగా పెరిగితే అది మన దేశ కరెంటు, వాణిజ్య లోటుపై ప్రభావం చూపిస్తుంది. వీటికితోడు వృద్ధి రేటు, విదేశీ పెట్టుబడులు రూపాయి విలువపై ప్రభావం చూపిస్తాయి. 



You may be interested

సలహాల వెనుక వారి ప్రయోజనం ఏ మేరకు?

Tuesday 11th December 2018

మార్కెట్లలో పెట్టుబడులు, జీవిత బీమాలకు సంబంధించి సలహాలు, సూచనల ఆధారంగా నిర్ణయాలు తీసుకునే వారు మన చుట్టూ ఎంతో మంది ఉన్నారు. స్నేహితులు, బంధువులు, సహచర ఉద్యోగుల సూచనలను కూడా పాటిస్తుంటారు. అలాగే, వివిధ పెట్టుబడి సాధనాలకు సంబంధించి ఉచితంగా, డబ్బులు తీసుకుని సలహాలు, సిఫారసులు ఇచ్చే వారూ ఉన్నారు. వారి సలహాల వెనుక ప్రయోజనం ఎవరికి, ఏ మేరకో తెలుసా...?   మ్యూచువల్‌ ఫండ్‌ డిస్ట్రిబ్యూటర్లు మ్యూచువల్‌ ఫండ్‌ డిస్ట్రిబ్యూటర్లు యాధృచ్చికమైన సలహాలను

ఎంకే గ్లోబల్‌ టాప్‌ పిక్స్‌ ఇవే..

Monday 10th December 2018

ఎంకే గ్లోబల్‌ తాజాగా వచ్చే 12-18 నెలల కాలంలో 13-85 శాతం రాబడిని అందించే పలు స్టాక్స్‌ను సిఫార్సు చేసింది. అవేంటో చూద్దాం..  స్టాక్‌: అశోక్‌ లేలాండ్‌ రేటింగ్‌: కొనొచ్చు టార్గెట్‌ ప్రైస్‌ రూ.186 రిటర్న్‌ అంచనా: 28 శాతం స్టాక్‌: అరబిందో ఫార్మా రేటింగ్‌: కొనొచ్చు టార్గెట్‌ ప్రైస్‌: రూ.690 రిటర్న్‌ అంచనా: 13 శాతం స్టాక్‌: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రేటింగ్‌: కొనొచ్చు టార్గెట్‌ ప్రైస్‌: రూ.2,306 రిటర్న్‌ అంచనా: 13 శాతం స్టాక్‌: ఐసీఐసీఐ బ్యాంక్‌ రేటింగ్‌: కొనొచ్చు టార్గెట్‌ ప్రైస్‌: రూ.392 రిటర్న్‌ అంచనా: 38 శాతం స్టాక్‌: ఇన్‌సెక్టిసైడ్స్‌

Most from this category