STOCKS

News


ఆందోళనకర స్థాయిలో పతనం కాలేదు

Saturday 25th August 2018
news_main1535172544.png-19630

న్యూఢిల్లీ: డాలర్‌ మారకంలో రూపాయి విలువ ఆందోళనకరమైన స్థాయిలో పడిపోలేదని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం కరెంట్‌ అకౌంట్‌ లోటు (సీఏడీ- క్యాడ్‌)పై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు. ఎఫ్‌డీఐ, ఎఫ్‌ఐఐ, ఈసీబీలు మినహా దేశంలోకి ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో వచ్చీ-పోయే విదేశీ మారక ద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసమే క్యాడ్‌. ఈ పరిమాణం పెరిగిన దేశాల కరెన్సీలపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది.  జూలైలో భారత్‌ వాణిజ్యలోటు (ఎగుమతులు-దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం) ఐదేళ్ల గరిష్ట స్థాయి 18 బిలియన్‌ డాలర్లకు చేరడం, దీనితో క్యాడ్‌పై నెలకొన్న భయాల నేపథ్యంలో  రాజన్‌ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు చూస్తే...

♦ ప్రభుత్వ ఆదాయలు-వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం- ద్రవ్యలోటు కట్టడిలోనే ఉంది. అయితే సమస్య క్యాడ్‌తోనే చమురు అధిక ధరల ప్రతికూలత క్యాడ్‌పై పడుతోంది. దీనికి దేశం అధిక డాలర్ల బిల్లును వెచ్చించాల్సి వస్తోంది. 
♦ ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణాల వంటి కీలక స్థూల ఆర్థిక అంశాలపై ప్రతిదేశం సారించాల్సిన సమయం ఇది. 
♦ ఇక ఎన్నికల సమయం అయినందును భారత్‌, బ్రెజిల్‌ వంటి దేశాలు ప్రభుత్వ వ్యయాలు గాడితప్పకుండా చర్యలు తీసుకోవాలి. 
♦ భారత్‌ వృద్ధి గణాంకాలను వివాదాస్పదం చేయాల్సిన అవసరం లేదు. భారత్‌ వృద్ధి 7.5 శాతం స్థాయిలో ఉంటుందన్నది నా అభిప్రాయం. 
♦ ఇక బ్యాంకింగ్‌ మొండి బకాయిల సమస్య తీవ్రమైనది. ఈ సమస్య పరిష్కార దిశలో బ్యాంకింగ్‌ పాలనా యంత్రాంగాల మెరుగుదల కీలకం. 
♦ అధిక చమురు ధరలు, రూపాయి విలువ క్షీణత కారణంగా భారత కరెంటు ఖాతా లోటు (క్యాడ్‌) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2.5 శాతానికి విస్తరిస్తుందని అంచనా. 2017-18లో ఇది 1.5 శాతం. 
♦ రూపాయి ఇప్పటికీ అధిక విలువలో ఉందని, డాలర్‌తో పోలిస్తే 70- 71 స్థాయి వద్ద రూపాయికి తగిన విలువని విశ్లేషణలు ఉన్నాయి. 

రూపాయి... 20 పైసలు రికవరీ...
కాగా డాలర్‌ మారకంలో రూపాయి విలువ శుక్రవారం 20 పైసలు బలపడింది. 69.91 వద్ద ముగిసింది. డాలర్‌ ఇండెక్స్‌లో తీవ్ర ఒడిదుడుకులు భారత్‌ కరెన్సీపై ప్రధానంగా ప్రభావం చూపుతున్నాయి. డాలర్‌ కొంత బలహీనపడవచ్చని అంచనాలతో ఎగుమతిదారులు, కార్పొరేట్లు డాలర్లను విక్రయించడం శుక్రవారం రూపాయి బలోపేతానికి ప్రధాన కారణం.  రూపాయి గత శుక్రవారం (17వ తేదీ)  చరిత్రాత్మక కనిష్టం 70.15 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. నాడు ఒక దశలో 70.40 స్థాయినీ చూసింది. అటు తర్వాత జరిగిన రెండు ట్రేడింగ్‌ సెషన్‌లలో 34పైసలు బలపడినా, ఆ స్థాయిలో నిలబడలేకపోయి, గురువారం 30 పైసలు పతనమై చివరకు 70.11 వద్ద ముగిసింది. 

తీవ్ర ఒడిదుడుకులతో కష్టమే: ఎస్‌బీఐ
ఇదిలావుండగా రూపాయి విలువలో తీవ్ర ఒడిదుకులు మంచిది కాదని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) గ్రూప్‌ ఎకనమిక్‌ అడ్వైజర్‌ సౌమ్య కాంతి ఘోష్‌ పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన ఒక ఐసీసీ సెమినార్‌లో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడుతూ, కేవలం ఐదు నెలల కాలంలో రూపాయి 64 నుంచి 70 స్థాయికి పతనమైన విషయాన్ని ప్రస్తావించారు. రూపాయి విలువ స్థిరత్వ అవసరాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తంగా స్థూల దేశీయోత్పత్తి 7.5 శాతంగా అంచనా అని వెల్లడించిన ఆయన మొదటి త్రైమాసికంలో ఇది 7.7 శాతంగా ఉంటుందన్నారు. ఆర్థిక వ్యవస్థపై పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ ప్రభావాలు పోయాయని విశ్లేషించారు. You may be interested

ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లాభం రూ.568 కోట్లు

Saturday 25th August 2018

న్యూఢిల్లీ: ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.568 కోట్ల నికర లాభం(స్డాండోలోన్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.480 కోట్ల నికర లాభం ఆర్జించామని, 18 శాతం వృద్ధి నమోదైందని ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ తెలిపింది. గత క్యూ1లో రూ.3,648 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో రూ.4,051 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో

ఆర్‌కామ్‌కు స్వల్ప ఊరట

Saturday 25th August 2018

న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో ఉన్న అనిల్‌ అంబానీ గ్రూపు కంపెనీ రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌(ఆర్‌కామ్‌)కు డాలర్‌ బాండ్‌ హోల్డర్ల నుంచి ఊరట లభించింది. గతేడాది 300 మిలియన్‌ డాలర్ల విలువైన బాండ్ల చెల్లింపుల్లో ఆర్‌కామ్‌ విఫలమైంది. డాలర్‌ బాండ్‌ హోల్డర్లలో 83 శాతం ఆర్‌కామ్‌ తాజా ప్రణాళికకు ఆమోదం తెలిపినట్టు కంపెనీ స్టాక్‌ ఎక్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. ఈ ప్రణాళికలో భాగంగా 118 మిలియన్‌ డాలర్ల మేర నగదును చెల్లించడంతోపాటు, 55

Most from this category