STOCKS

News


ఆరునెలల్లో రూపీ@80

Thursday 18th October 2018
Markets_main1539859494.png-21274

ఇండియానివేష్‌ సెక్యూరిటీస్‌
వచ్చే ఆరు నెలల కాలంలో రూపాయి 79- 80 స్థాయిలకు చేరే ఛాన్సులున్నాయని ఇండియానివేష్‌ సెక్యూరిటీస్‌ ప్రతినిధి ధర్మేశ్‌ కాంత్‌ అభిప్రాయపడ్డారు. అయితే రూపీ ఈ స్థాయికి చేరినా ఆరునెలల అనంతరం క్రమంగా కన్సాలిడేట్‌ చెంది చివరకు 72- 74 రేంజ్‌లో సెటిల్‌ కావచ్చని అంచనా వేశారు.

  • దేశీయ మార్కెట్లలో ఎఫ్‌ఎంసీజీ, ప్రైవేట్‌ బ్యాంక్స్‌, ఫార్మా రంగాలపై పాజిటివ్‌గా ఉన్నట్లు చెప్పారు. ఇటీవల కాలంలో ఎఫ్‌ఐఐలు ఇండియా నుంచి నిరంతరాయంగా నిధులు ఉపసంహరించుకుంటున్నాయన్నారు.
  • రూపీ క్షీణత, రేట్ల పెరుగుదల, క్రూడ్‌ ధర పెరగడంతో ఎఫ్‌ఐఐలు వర్దమాన మార్కెట్ల నుంచి వైదొలుగుతున్నాయన్నారు. దీనికితోడు దేశీయ స్థూల ఆర్థికాంశాలపై అనిశ్చితి సైతం విదేశీ మదుపరులను వెనక్కు మరలేలా చేస్తోందన్నారు.
  • విత్తలోటు విస్తరించడం, ఉత్పాదకాల ధరల్లో పెరుగుదల, త్వరలో సాధారణ ఎన్నికలు సమీపిస్తుండడంతో బడా ఇన్వెస్టరలు​ ఇండియా మార్కెట్‌కు దూరంగా ఉంటున్నారన్నారు.
  • ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో బంగారం లాంటి బులియన్‌ అసెట్స్‌ మంచి రాబడులు ఇస్తాయని ఆయన అంచనా వేశారు. బంగారం తర్వాత ఎఫ్‌డీలను నమ్ముకోవచ్చన్నారు.
  • ఈక్విటీల్లో పెట్టుబడులుపెట్టేవాళ్లు వైవిధ్యభరిత పోర్టుఫోలియో నిర్మించుకోవాలని సూచించారు.
  • రాబోయే రోజుల్లో భారత్‌ ఎలక్ట్రానిక్స్‌, కెన్‌ఫిన్‌ హోమ్స్‌, ఆర్‌బీఎల్‌, సెయిల్‌పై బుల్లిష్‌గా ఉన్నట్లు చెప్పారు. 



You may be interested

ఆనంద్‌ రాఠీ దసరా సిఫార్సులు

Thursday 18th October 2018

సంవత్సరం కాలపరిమితిలో మంచి రాబడులు ఇచ్చే ఐదు స్టాకులను ఆనంద్‌రాఠీ సెక్యూరిటీస్‌ రికమండ్‌ చేస్తోంది. 1. ఏసియన్‌ పెయింట్స్‌: టార్గెట్‌ రూ. 1471. ఇతర పెయింట్‌ కంపెనీలతో పోలిస్తే పెద్ద నెట్‌వర్క్‌ ఉంది. దేశీయ పెయింట్‌ పరిశ్రమ రాబోయే రోజుల్లో 12 శాతం వరకు వృద్ధి నమోదు చేస్తుందని అంచనా. పెయింట్స్‌ రంగంలో డిమాండ్‌ కూడా ఊపందుకుంటోంది. 2. ఆదిత్య బిర్లా ఫాషన్‌ అండ్‌ రిటైల్‌: టార్గెట్‌ రూ. 237. కంపెనీ పోర్టుఫోలియోలో

హువావే ‘మేట్‌ 20’ సిరీస్‌లో 4 స్మార్ట్‌ఫోన్స్‌

Thursday 18th October 2018

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ‘హువావే’ తాజాగా ‘మేట్‌ 20’ సిరీస్‌లో నాలుగు ప్రీమియం స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లో ఆవిష్కరించింది. ‘హువావే మేట్‌ 20’, ‘హువావే మేట్‌ 20 ప్రో’, ‘హువావే మేట్‌ 20 ఎక్స్‌’, ‘హువావే మేట్‌ 20 ఆర్‌ఎస్‌ పోర్షే డిజైన్‌’ అనేవి వీటి పేర్లు. కంపెనీ వీటిల్లో తొలిసారిగా 7 ఎన్‌ఎం కిరిన్‌ 980 ప్రాసెసర్‌ను ఉపయోగించింది. అలాగే రెండో జనరేషన్‌ లైకా

Most from this category