News


అక్టోబర్‌లో రిటైల్‌ ధరలు... కూల్‌!

Tuesday 13th November 2018
news_main1542085635.png-21935

న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 3.31 శాతంగా నమోదయ్యింది. అంటే 2017 అక్టోబర్‌తో పోల్చితే 2018 అక్టోబర్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 3.31 శాతం పెరిగిందన్నమాట. ఇంత తక్కువ స్థాయిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం నమోదుకావడం గడచిన ఏడాది కాలంలో ఇదే తొలిసారి. కొన్ని నిత్యావసరాలు, పండ్లు, ప్రొటీన్‌ రిచ్‌ ఉత్పత్తుల ధరలు తక్కువగా ఉండడం దీనికి కారణం. సోమవారం కేంద్ర గణాంకాల కార్యాలయం విడుదల చేసిన గణాంకాలను క్లుప్తంగా చూస్తే...
♦ 2018 సెప్టెంబర్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బనం 3.7 శాతం. 2017 అక్టోబర్‌లో ఈ రేటు 3.58 శాతంగా ఉంది. 
♦ తాజా సమీక్షా నెలలో ఫుడ్‌ బాస్కెట్‌ ధర పెరక్కపోగా -0.86 శాతం క్షీణించింది. సెప్టెంబర్‌లో 0.51 శాతం పెరుగుదల ఈ విభాగంలో నమోదయ్యింది. 
♦ కూరగాయల ధరలు సెప్టెంబర్‌లో 4.15 శాతం పెరిగితే, అక్టోబర్‌లో పెరక్కపోగా, - 8.06 శాతం తగ్గాయి. 
♦ ఫ్రూట్‌ బాస్కెట్‌ ధర సెప్టెంబర్‌లో 1.12 శాతం పెరిగితే, అక్టోబర్‌లో -0.35 శాతానికి తగ్గింది.
♦ గుడ్లు, పాలు సంబంధిత  ప్రొటీన్‌ రిచ్‌ ఉత్పత్తుల ధరలూ తగ్గాయి.
♦ ఇక ఫ్యూయల్‌, లైట్‌ విభాగానికి వస్తే, సెప్టెంబర్‌లో ఈ ద్రవ్యోల్బణం 8.47 శాతం ఉంటే, అక్టోబర్‌లో 8.55 శాతానికి పెరిగాయి. 



You may be interested

పారిశ్రామిక ఉత్పత్తి ఉసూరు!

Tuesday 13th November 2018

న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి సెప్టెంబర్‌లో అంతంతమాత్రంగానే నమోదయ్యింది. వృద్ధి రేటు కేవలం 4.5 శాతంగా తాజా గణాంకాలు వెల్లడించాయి. అంటే 2017 సెప్టెంబర్‌తో పోల్చితే 2018 సెప్టెంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి కేవలం 4.5 శాతం పెరిగిందన్నమాట. అంతక్రితం గడచిన నాలుగు నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో వృద్ధిరేటు నమోదుకావడం ఇదే తొలిసారి. మైనింగ్‌ రంగం, అలాగే భారీ యంత్ర పరికరాల ఉత్పత్తి, డిమాండ్‌కు ప్రతిబింబమైన క్యాపిటల్‌ గూడ్స్‌ రంగాల పేలవ

లీజుకు పాదూరు చమురు గిడ్డంగి

Tuesday 13th November 2018

న్యూఢిల్లీ: కర్ణాటకలోని పాదూరులో నిర్మించిన వ్యూహాత్మక భూగర్భ చమురు నిల్వ కేంద్రంలో కొంత భాగాన్ని అబు ధాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (ఏడీఎన్‌వోసీ) లీజుకు తీసుకుంది. ఇందుకు సంబంధించి ఆ కంపెనీ సోమవారం భారత ప్రభుత్వంతో ప్రాథమిక ఒప్పందం కుదుర్చుకున్నట్లు కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కి చెందిన ఏడీఎన్‌వోసీతో ఈ ఏడాది కుదుర్చుకున్న డీల్స్‌లో ఇది రెండోది. అత్యవసర పరిస్థితుల కోసం

Most from this category