STOCKS

News


17 నెలల కనిష్టానికి ద్రవ్యోల్బణం

Thursday 13th December 2018
news_main1544677765.png-22885

న్యూఢిల్లీ: రిటైల్‌ ద్రవ్యోల్బణం మరింత కిందకు దిగొచ్చింది. కూరగాయలు, గుడ్లు, పప్పు ధాన్యాల ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. దీంతో నవంబర్‌ నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 2.33 శాతానికి పడిపోయింది. ఇది 17 నెలల్లోనే అత్యంత తక్కువ ద్రవ్యోల్బణం. వినియోగ ధరల ఆధారితంగా రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని లెక్కించే విషయం తెలిసిందే. ఇది అక్టోబర్‌ నెలలో 3.31 శాతంగా ఉందన్న గత అంచనాలను, తాజాగా 3.38 శాతానికి ప్రభుత్వం సవరించింది. 2017 నవంబర్‌ నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 4.88 శాతంగా ఉండడం గమనార్హం. ఆర్‌బీఐ విధానపరమైన నిర్ణయాల్లో రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని కూడా పరిగణనలోకి తీసుకునే విషయం తెలిసిందే. 2017 జూన్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 1.46 శాతంగా నమోదవగా, మరోసారి తక్కవ స్థాయికి దిగొచ్చింది. ఆహార ద్రవ్యోల్బణం నవంబర్లో 2.61 శాతం ప్రతికూలంగా ఉంది. కూరగాయల ధరలు అక్టోబర్‌లో మైనస్‌ 8.06 శాతం (డిఫ్లేషన్‌)గా ఉంటే, నవంబర్‌లో ఇంకాస్త తగ్గిపోయి మైనస్‌ 15.59 శాతానికి చేరాయి. పప్పు ధాన్యాల డిఫ్లేషన్‌ రేటు అక్టోబర్‌లో మైనస్‌ 10.28 శాతం నుంచి నవంబర్‌లో మైనస్‌ 9.22 శాతానికి రికవరీ అయ్యాయి. గుడ్ల డిఫ్లేషన్‌ మైనస్‌ 3.92గా ఉంది. ఇంధన ధరల పరుగుదల 7.39 శాతంగా ఉంది. మాంసం, చేపల ధరలు మాత్రం అంతకుముందు నెలలో ఉన్న 3.02 శాతం నుంచి నవంబర్‌లో 4.99 శాతానికి పెరిగాయి.  



You may be interested

మొండి బకాయిలు వసూలు కావు... జాగ్రత్త

Thursday 13th December 2018

న్యూఢిల్లీ: ఉర్జిత్‌పటేల్‌ ఆకస్మిక రాజీనామా... ఆర్‌బీఐ విధానాల ప్రాధాన్యతల విషయంలో ఉన్న రిస్క్‌ను తెలియజేస్తోందని రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ పేర్కొంది. కేంద్ర బ్యాంకులో ప్రభుత్వ జోక్యం పెరగడాన్ని ఇది తెలియజేస్తోందని, మొండి బకాయిల పరిష్కారానికి ఆర్‌బీఐ చేస్తున్న ప్రయత్నాలకు దీనివల్ల విఘాతం కలుగుతుందని అభిప్రాయపడింది. పటేల్‌ రాజీనామా కారణంగా ఏర్పడే సమస్యలన్నవి కొత్తగా వచ్చిన శక్తికాంత దాస్‌ సారథ్యంలో తీసుకునే నిర్ణయాల ఆధారంగా తేటతెల్లం అవుతాయని పేర్కొంది. ‘‘వృద్ధిని వేగవంతం

బైజూస్‌లో భారీగా పెట్టుబడులు

Thursday 13th December 2018

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ స్టార్టప్‌ బైజూస్‌... మరో విడత భారీగా పెట్టుబడులను సమీకరించింది. బైజూస్‌లో దక్షిణాఫ్రికా మీడియా దిగ్గజం, నాస్పర్స్‌ భారీగా పెట్టుబడులు పెట్టినట్లు తెలియవచ్చింది. నాస్పర్స్‌ సంస్థ రూ.2,879 కోట్లు (40 కోట్ల డాలర్లు) పెట్టుబడులు పెట్టిందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. దీన్లో 30 కోట్ల డాలర్ల పెట్టుబడులు బైజూస్‌కు ఇప్పటికే అందాయని, మిగిలిన 10 కోట్ల డాలర్లు కూడా త్వరలోనే అందుతాయని ఆ

Most from this category