STOCKS

News


మిగితా 8 బ్యాంకులపై త్వరలో ఎత్తివేత

Friday 1st February 2019
news_main1549026790.png-23952

న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగంలో పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్న నేపథ్యంలో సత్వర దిద్దుబాటు చర్యలు (పీసీఏ) ఎదుర్కొంటున్న మిగతా 8 బ్యాంకులు కూడా త్వరలో ఆంక్షల నుంచి బైటపడగలవని ఆర్థిక మంత్రి పియుష్ గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో మూడు బ్యాంకులు (బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌) ఇప్పటికే బైటపడ్డాయని ఆయన పేర్కొన్నారు. మొండిబాకీలు భారీగా పెరిగిపోయిన అలహాబాద్‌ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్‌, ఐడీబీఐ బ్యాంక్‌ మొదలైన వాటిపై పీసీఏ కింద ప్రస్తుతం ఆంక్షలు కొనసాగుతున్నాయి.



You may be interested

ద్రవ్యోల్బణంపై విజయం: గోయెల్‌

Friday 1st February 2019

ధరల పెరుగుదల వేగాన్ని ప్రభుత్వం విజయవంతంగా అడ్డుకున్నట్లు ఆర్థిక మంత్రి పియూష్‌ గోయెల్‌ తెలిపారు. అలాగే పేదలపై అసమంజస పన్ను భారం పడకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ధరల పెరుగుదల రేటును సగటున 4.6 శాతానికి తీసుకువచ్చామని తెలిపారు. 2009-2014 మధ్య సగటు ద్రవ్యోల్బణం రేటు 10.1 శాతమని పేర్కొన్నారు.  2018 డిసెంబర్‌లో ద్రవ్యల్బణం కేవలం 2.19 శాతమన్న గణాంకాలను కూడా ఆయన ఉటంకించారు. భారత రైతులు ప్రస్తుతం తమ ఆదాయాల్లో

లక్ష్యం.. 1 లక్ష డిజిటల్ గ్రామాలు

Friday 1st February 2019

- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై జాతీయ కేంద్రం ఏర్పాటు న్యూఢిల్లీ: కొంగొత్త టెక్నాలజీల ప్రయోజనాలను ప్రజలందరికీ చేరువ చేసే దిశగా వచ్చే అయిదేళ్లలో 1 లక్ష గ్రామాలను 'డిజిటల్ గ్రామాలు'గా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై జాతీయ స్థాయిలో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. 2030 నాటికి భారీ స్థాయిలో డిజిటల్ ఇన్‌ఫ్రా, డిజిటల్ ఎకానమీ ఏర్పాటుకు ఇటీవలి డిజిటైజేషన్ ప్రక్రియ తోడ్పడుతుందని, పెద్ద ఎత్తున

Most from this category