News


ఆర్‌బీఐకి పటిష్టమైన స్వతంత్రత అవసరం: విరాళ్‌ ఆచార్య

Saturday 27th October 2018
news_main1540610493.png-21518

ముంబై: ఆర్‌బీఐకి మరింత పటిష్టమైన స్వతంత్రత అవసరాన్ని ఆ సంస్థ డిప్యూటీ గవర్నర్‌ విరాళ్‌ ఆచార్య గుర్తు చేశారు. ఆర్‌బీఐ స్వయం ప్రతిపత్తిని ప్రభుత్వాలు గుర్తించకపోతే... త్వరలోనే లేదా తర్వాత అయినా ఫైనాన్షియల్‌ మార్కెట్ల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని, ఆర్థిక మంటలకు దారితీస్తుందన్నారు. సెంట్రల్‌ బ్యాంకు స్వతంత్రతను తగ్గించే ప్రయత్నం చేస్తే అది ప్రభుత్వానికి సెల్ఫ్‌గోల్‌ (తాను తీసుకున్న గోతిలో తానే పడడం) అవుతుందన్నారు. ఏడీ ష్రాఫ్‌ స్మారక ఉపన్యాసంలో భాగంగా ఆచార్య ఈ వ్యాఖ్యలు చేశారు. తెలివైన రాజకీయ నేతలు సెంట్రల్‌ బ్యాంకుకు అవసరమైన స్వయంప్రతిపత్తిని ఇవ్వాలని, దాంతో స్థిరమైన స్థూల ఆర్థిక  పరిస్థితులు ఏర్పడతాయని అభిప్రాయపడ్డారు.  



You may be interested

ఫండ్స్‌ నుంచి బ్యాంకుల్లోకి రూ.2 లక్షల కోట్లు

Saturday 27th October 2018

ముంబై: ఐఎల్‌అండ్‌ఎఫ్‌ సంక్షోభం తర్వాత ఇన్వెస్టర్లు మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల నుంచి రూ.2 లక్షల కోట్ల మేర ఉపసంహరించుకోగా... ఇవి బ్యాంకుల్లోకి చేరాయి. ఈ నిధులు ఇతర బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు (ఎన్‌బీఎఫ్‌సీలు) మద్దతుగా నిలుస్తాయని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఆర్థిక వేత్తలు అంచనా వేశారు. ఈ విషయాన్ని ఒక నివేదికలో తెలియజేశారు. ‘‘ఇన్వెస్టర్లు లిక్విడ్‌ ఫండ్స్‌, ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ ఫండ్స్‌ నుంచి ఈ స్థాయిలో నిధులను వెనక్కి తీసుకున్నారు. ఈ

తగినంత నిధుల లభ్యత ఉంది

Saturday 27th October 2018

న్యూఢిల్లీ: కొన్ని రంగాలు నిధుల సమస్యను ఎదుర్కొంటున్నాయన్న ఆందోళనల నేపథ్యంలో... మార్కెట్లో ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) పరిస్థితిని సమీక్షించేందుకు ప్రభుత్వరంగ బ్యాంకుల అధిపతులతో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ శుక్రవారం సమావేశమయ్యారు. బ్యాంకింగేత ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు) ఎదుర్కొంటున్న లిక్విడిటీ కొరతను తీర్చేందుకు తమవద్ద తగినంత ద్రవ్య లభ్యత ఉందని బ్యాంకుల సారథులు మంత్రికి తెలియజేశారు. ఆర్థిక శాఖ పరిధిలోని పలు విభాగాల కార్యదర్శులు, ఎస్‌బీఐ, పీఎన్‌బీ, బీవోబీ, యూనియన్‌

Most from this category