STOCKS

News


డీడీపై కొనుగోలుదారు పేరు

Friday 13th July 2018
news_main1531502435.png-18291

న్యూఢిల్లీ: డిమాండ్‌ డ్రాఫ్ట్‌ (డీడీ)లపై కొనుగోలు చేస్తున్న వారి పేరు కూడా ఉండాలని అన్ని బ్యాంకులను ఆర్‌బీఐ ఆదేశించింది. సెప్టెంబర్‌ 15 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయి. దీంతో పే ఆర్డర్‌, బ్యాంకర్స్‌ చెక్‌, డీడీలపై కొనుగోలు చేసే వారి పేరు కూడా ఇకపై కనిపించనుంది. కేవైసీ నిబంధనల్లో ఆర్‌బీఐ ఈ మేరకు అవసరమైన మార్పులు కూడా చేసింది. డీడీలను మనీ లాండరింగ్‌కు దుర్వినియోగం చేసే అవకాశం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో డీడీలు, బ్యాంకర్స్‌ చెక్‌, పే ఆర్డర్‌పై కొనుగోలుదారు పేరును కూడా పేర్కొనాలని నిర్ణయించినట్టు ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఇక, ఆర్‌బీఐ నిబంధనల మేరకు డీడీ, ఎన్‌ఈఎఫ్‌టీ/ఐఎంపీఎస్‌ లేదా ఏదేనీ ఇతర మాథ్యమం ద్వారా చేసే చెల్లింపులు రూ.50,000 అంతకంటే ఎక్కువ ఉంటే... నగదు ద్వారా కాకుండా చెక్‌, బ్యాంకు కస్టమర్ల ఖాతాల నుంచి డెబిట్‌ ద్వారానే  అనుమతించాల్సి ఉంటుంది. 
 



You may be interested

ఐహెచ్‌హెచ్‌ చేతికే ఫోర్టిస్‌..

Friday 13th July 2018

న్యూఢిల్లీ: దేశీయంగా రెండో అతిపెద్ద హాస్పిటల్ చెయిన్ 'ఫోర్టిస్ హెల్త్‌కేర్' టేకోవర్ కోసం నెలల తరబడి వివిధ సంస్థల మధ్య కొనసాగిన యుద్ధం ఎట్టకేలకు ముగిసింది. మలేషియాకి చెందిన ఐహెచ్‌హెచ్‌ హెల్త్‌కేర్‌ ప్రతిపాదనను ఆమోదించినట్లు ఫోర్టిస్  బోర్డు వెల్లడించింది. టేకోవర్ ప్రతిపాదన ప్రకారం ప్రిఫరెన్షియల్ షేర్ల కొనుగోలు ద్వారా రూ. 4,000 కోట్లు సమకూర్చాల్సి ఉంటుంది. షేరు ఒక్కింటికి రూ. 170 చొప్పున ప్రిఫరెన్షియల్ అలాట్‌మెంట్ ద్వారా ఫోర్టిస్‌లో ఐహెచ్‌హెచ్‌కి

టాటా గ్రూపుపై హద్దుల్లేని నియంత్రణ కోసం ప్రయత్నం

Friday 13th July 2018

ముంబై: టాటా గ్రూపు చైర్మన్‌, బోర్డు డైరెక్టర్‌గా ఉన్న సమయంలో సైరస్‌ మిస్త్రీ ‘గ్రూపుపై హద్దుల్లేని నియంత్రణ’ పొందేందుకు ప్రయత్నం చేశారని ఎన్‌సీఎల్‌టీ పేర్కొంది. ​టాటాసన్స్‌, రతన్‌ టాటాలకు వ్యతిరేకంగా టాటా గ్రూపు మాజీ చైర్మన్‌ సైరస్‌ మిస్త్రీ చేసిన ఆరోపణల్లో ఎటువంటి యోగ్యత లేదని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ముంబై ప్రత్యేక బెంచ్‌ ఇటీవలే విస్పష్ట ఆదేశాలు జారీ చేసిన కేసులో మరిన్ని వివరాలు వెలుగు

Most from this category