STOCKS

News


ఆర్‌బీఐ నుంచి మరో రూ.40,000 కోట్లు

Wednesday 28th November 2018
news_main1543392186.png-22449

ముంబై: వ్యవస్థలో ద్రవ్య లభ్యత పెంపు చర్యల్లో భాగంగా ఆర్‌బీఐ వచ్చే నెలలో రూ.40,000 కోట్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఓపెన్‌ మార్కెట్‌ ఆపరేషన్స్‌ కింద ప్రభుత్వ సెక్యూరిటీలను డిసెంబర్‌ నెలలో కొనుగోలు చేయనున్నట్టు ఆర్‌బీఐ ప్రకటించింది. ఈ నెలలో రూ.40,000 కోట్ల లిక్విడిటీని అందుబాటులోకి తీసుకురానున్నామని ఆర్‌బీఐ ప్రకటించగా, ఇప్పటికే రూ.30,000 కోట్ల మేర ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోలు పూర్తి చేసింది. గురువారం మరో​ రూ.10,000 కోట్ల మేర అందుబాటులోకి తీసుకురానుంది. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం అనంతరం ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో లిక్విడిటీ సమస్య నెలకొన్న విషయం తెలిసిందే. దీన్ని తొలగించేందుకు ఆర్‌బీఐ ఈ చర్యలను చేపట్టింది. 



You may be interested

డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌లోకి కోల్‌ ఇండియా

Wednesday 28th November 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కోల్‌ ఇండియా డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ వ్యవస్థకు మారుతోంది. ఇందుకోసం టెక్నాలజీ కంపెనీ టెక్‌ మహీంద్రాతో రూ.270 కోట్ల విలువైన ఒప్పందం చేసుకుంది. తొలిదశలో ఇంటిగ్రేటెడ్‌ ఎంటర్‌ప్రైజ్‌ రిసోర్స్‌ ప్లానింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, తమ అనుబంధ సంస్థలన్నింటినీ ప్రధాన కేంద్ర టెక్నాలజీ సెంటర్‌తో అనుసంధానిస్తామని కోల్‌ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.

'రోబో 2.0'పై టెల్కోల అభ్యంతరం

Wednesday 28th November 2018

న్యూఢిల్లీ: అనేక అవరోధాలను అధిగమించి రిలీజ్‌కు సిద్ధమవుతున్న రోబో సీక్వెల్ 2.0 సినిమాకు ఈసారి టెల్కోల రూపంలో సమస్యలు వచ్చిపడ్డాయి. మొబైల్ ఫోన్లు, టవర్లు ఆరోగ్యానికి చేటు చేస్తాయన్న అర్థం వచ్చేలా ఈ సినిమా ట్రైలర్లు ఉన్నాయంటూ టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. సినిమా కంటెంట్ టెల్కోల ప్రతిష్టకు భంగం కలిగించేదిగా ఉందంటూ ఆరోపించింది.ఈ నేపథ్యంలో సినిమాకు ఇచ్చిన సర్టిఫికేషన్‌ను ఉపసంహరించాలంటూ సెన్సార్ బోర్డు (సీబీఎఫ్‌సీ)ని

Most from this category