కేంద్రానికి ఆర్బీఐ రూ.50,000 కోట్ల డివిడెండ్
By Sakshi

ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 2018 జూన్‌తో ముగిసిన తన ఆర్థిక సంవత్సరంలో (2017-18) కేంద్రానికి రూ.50,000 కోట్ల డివిడెండ్‌ను చెల్లించనుంది. ఈ మొత్తం బడ్జెట్ అంచనాలకు అనుగుణంగానే ఉండడం గమనార్హం. అలాగే కేంద్ర ద్రవ్యలోటు కట్టడికి (ప్రభుత్వానికి వచ్చే ఆదాయం - చేసే వ్యయానికి మధ్య నికర వ్యత్యాసం) కూడా ఈ మొత్తం దోహదపడుతుందని సంబంధిత వర్గాలు విశ్లేషిస్తున్నాయి. జూలై-జూన్ కాలాన్ని తన ఆర్థిక సంవత్సరంగా ఆర్బీఐ పరిగణనలోకి తీసుకుంటుంది. గత ఆర్థిక సంవత్సరం కేంద్రానికి ఇచ్చిన డివిడెండ్‌తో పోలిస్తే (రూ.30,659 కోట్లు) ప్రస్తుత చెల్లిస్తున్నది దాదాపు 63 శాతం అధికం. అయితే 2016-17లో ఈ మొత్తం రూ.65,876 కోట్లు. ‘‘2018 జూన్‌తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి కేంద్రానికి రూ.50,000 కోట్ల డివిడెండ్ చెల్లించాలని బుధవారం సమావేశమైన ఆర్బీఐ డైరెక్టర్ల సెంట్రల్ బోర్డ్ సమావేశం నిర్ణయించింది’’ అని ఒక ప్రకటనలో ఆర్బీఐ తెలిపింది. మార్చి ప్రారంభంలో కేంద్రానికి ఆర్బీఐ మధ్యంతర డివిడెండ్‌గా రూ.10,000 కోట్లు చెల్లించింది. ఆర్బీఐ, జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి డివిడెండ్ లేదా మిగులుగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.54,817.25 కోట్లు సమకూర్చుకోవాలని కేంద్ర బడ్జెట్ నిర్దేశించింది. గత ఆర్థిక సంవత్సరం ఈ పద్దు కింద కేంద్రం రూ.51,623.24 కోట్లు సమీకరించింది.
You may be interested
వాల్‌మార్ట్-ఫ్లిప్‌కార్ట్ డీల్‌కు సీసీఐ ఆమోదం
Thursday 9th August 2018న్యూఢిల్లీ: దేశీ ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ను అమెరికన్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ కొనుగోలు చేసే ప్రతిపాదనకు కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు మైక్రోబ్లాగింగ్ సైటు ట్విటర్లో ట్వీట్ చేసింది. ఈ డీల్ విలువ దాదాపు 16 బిలియన్ డాలర్లు. ఫ్లిప్‌కార్ట్‌లో సుమారు 77 శాతం వాటాలను కొనుగోలు చేయనున్నట్లు వాల్‌మార్ట్ ఈ ఏడాది మేలో ప్రకటించింది. చిన్న వ్యాపారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నప్పటికీ
ఇండియన్ బ్యాంక్ లాభం 44% డౌన్
Thursday 9th August 2018చెన్నై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్ లాభం 44 శాతం క్షీణించి రూ.209 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో సంస్థ లాభం 372 కోట్లు. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో బ్యాంకు ఆదాయం రూ. 4,788 కోట్ల నుంచి 5,132 కోట్లకు పెరిగింది. మరోవైపు, స్థూల మొండిబాకీలు (ఎన్పీఏ) 7.21 శాతం నుంచి స్వల్పంగా 7.20 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు