STOCKS

News


రూ12,000 కోట్లను పంప్‌ చేయనున్న ఆర్‌బీఐ

Wednesday 14th November 2018
news_main1542174403.png-21986

ముంబై: ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయడం ద్వారా వ్యవస్థలోకి రూ.12,000 కోట్లను అందుబాటులోకి తీసుకురావాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. ‘‘లిక్విడీటీ పరిస్థితులను అంచనా వేసిన అనంతరం నవంబర్‌ 15న రూ.12,000 కోట్ల మేర ప్రభుత్వ సెక్యూరిటీలను ఓపెన్‌ మార్కెట్‌ ఆపరేషన్స్‌ కింద కొనుగోలు చేయాలని నిర్ణయించాం’’ అని ఆర్‌బీఐ ప్రకటన జారీ చేసింది. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం అనంతరం మార్కెట్లో ఏర్పడిన ద్రవ్య లభ్యత ఇబ్బందులను తాజా ఆర్‌బీఐ నిర్ణయం తేలిక పరచగలదని అంచనా. ఆసక్తి కలిగిన వారు ఆర్‌బీఐ కోర్‌ బ్యాంకింగ్‌ సొల్యూషన్‌ (ఈ-కుబర్‌) వ్యవస్థ ద్వారా తమ ఆఫర్లను సమర్పించొచ్చని కేంద్ర బ్యాంకు తన ప్రకటనలో సూచించింది. 



You may be interested

ఎన్‌సీసీ లాభం రూ.125 కోట్లు

Wednesday 14th November 2018

హైదరాబాద్‌: సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో ఎన్‌సీసీ నికర లాభం రూ.125.65 కోట్లకు చేరింది. గత ఆర్ధిక సంవత్సరం ఇదే సమయానికి లాభం రూ.20.30 కోట్లుగా ఉంది. 2017 క్యూ2లో రూ.1,342 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఇప్పుడు 134 శాతం వృద్ధితో రూ.3,137 కోట్లకు చేరింది. ఎబిటా రూ.365 కోట్లకు చేరింది.  

మా వాటాలో 50 శాతం అమ్మేస్తాం

Wednesday 14th November 2018

న్యూఢిల్లీ: జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ (జీల్‌) ప్రమోటర్లు కంపెనీలో తమకున్న వాటాలో 50 శాతం వరకు వ్యూహాత్మక భాగస్వామికి విక్రయించే ఆలోచనతో ఉన్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని కంపెనీ స్టాక్‌ ఎక్సేంజ్‌లకు తెలిపింది. దీపావళి వారంతంలో కంపెనీ ప్రమోటర్లు సుభాష్‌చంద్ర, అతని కుటుంబం, సలహాదారులతో ముంబైలో సమావేశమై అంతర్జాతీయంగా మీడియా స్వరూపాలు మారిపోతున్న క్రమంలో తమ వ్యాపార వ్యూహాలను సమీక్షించినట్టు పేర్కొంది. కంపెనీలో ఎస్సెల్‌ హోల్డింగ్స్‌కు ఉన్న వాటాల్లో

Most from this category