STOCKS

News


ఎన్‌హెచ్‌బీ నుంచి ఆర్‌బీఐ నిష్క్రమణ

Thursday 25th April 2019
news_main1556154202.png-25335

కేంద్రానికి 100 శాతం వాటాలు

ముంబై: నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌ (ఎన్‌హెచ్‌బీ)లో రిజర్వ్‌ బ్యాంక్‌ తనకున్న పూర్తి వాటాలను కేంద్ర ప్రభుత్వానికి విక్రయించింది. అటు నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (నాబార్డ్‌) కూడా వాటాలన్నింటినీ విక్రయించడంతో ఎన్‌హెచ్‌బీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేతికి చేరినట్లయింది. ఆర్‌బీఐ వాటాల విలువ రూ.1,450 కోట్లు కాగా, నాబార్డ్‌ వాటాల విలువ రూ. 20 కోట్లు. మార్చి 19న ఎన్‌హెచ్‌బీలో, ఫిబ్రవరి 26న నాబార్డ్‌లో వాటాలు విక్రయించినట్లు ఆర్‌బీఐ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.

దీంతో ఇకపై ఈ రెండు సంస్థల్లోనూ 100 శాతం వాటాలు ప్రభుత్వానికే ఉంటాయని వివరించింది. బ్యాంకింగ్‌ రంగాన్ని నియంత్రించే ఆర్‌బీఐ అదే రంగ సంస్థల్లో వాటాలు కూడా కలిగి ఉండటం సరికాదన్న నరసింహం రెండో కమిటీ సిఫార్సులకు అనుగుణంగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఈ నిర్ణయం తీసుకుంది. హౌసింగ్‌ రంగానికి ఊతమిచ్చే యోచనతో 1987–88లో బడ్జెట్‌ ప్రతిపాదనల ప్రకారం ఎన్‌హెచ్‌బీ ఏర్పాటైంది. కాగా, వ్యవస్థలోకి మరిన్ని నిధులను అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో నిర్వహించిన రెండో విడత డాలర్‌/రూపాయి స్వాప్‌ వేలానికి మంచి స్పందన వచ్చినట్లు ఆర్‌బీఐ తెలిపింది. 255 బిడ్స్‌ రాగా అయిదు మాత్రమే అంగీకరించినట్లు పేర్కొంది. 



You may be interested

రూ.1200కోట్లకు ‘ఆన్‌లైన్‌ మాట్రిమోనీ’

Thursday 25th April 2019

వీడియో మాట్రిమోనీని ఆరంభించిన ‘దిల్‌కే రిస్తే’   హైదరాబాద్, సాక్షి బిజినెస్‌: భారత్‌లో ఆన్‌లైన్‌ మాట్రిమోనీ మార్కెట్‌ వచ్చే ఏడాదికి రూ.1,200 కోట్లకు చేరుతుందని ‘దిల్‌కే రిస్తే’ వ్యవస్థాపకుడు సురేశ్‌ నాయర్‌ చెప్పారు. దేశంలో మొట్టమొదటి వీడియో మాట్రిమోనీ సైట్‌ ‘దిల్‌కేరిస్తే డాట్‌కామ్‌’ను ఆరంభించిన సందర్భంగా మాట్లాడుతూ‘‘ ప్రస్తుతం ఆన్‌లైన్‌ మాట్రిమోనీ మార్కెట్‌ విలువ రూ.1,000 కోట్లని, ఇందులో దాదాపు 80 శాతం వాటా టాప్‌ 3 సైట్లదేనని (భారత్‌ మాట్రిమోని,

హైదరాబాద్‌లో క్లెన్‌స్టా ప్లాంట్‌!

Thursday 25th April 2019

వాటర్‌లెస్‌ హెల్త్‌కేర్‌ ఉత్పత్తులకు ఆదరణ సంస్థ వ్యవస్థాపకుడు పునీత్‌ గుప్తా  హైదరాబాద్, సాక్షి బిజినెస్‌: వచ్చే ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్‌లో తమ ఉత్పత్తి ప్లాంటును ఏర్పాటు చేస్తామని పర్సనల్‌ హెల్త్‌కేర్‌ సంస్థ క్లెన్‌స్టా వ్యవస్థాపకుడు పునీత్‌ గుప్తా చెప్పారు. దాదాపు రూ.35 కోట్లతో ఈ ప్లాంట్‌ను నిర్మిస్తామని, దీని ఉత్పత్తి సామర్ధ్యం రోజుకు రెండు లక్షల బాటిళ్లని తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వంతో ప్రాథమిక చర్చలు పూర్తి చేశామన్నారు. కంపెనీ తాజాగా మార్కెట్లోకి వాటర్‌లెస్‌

Most from this category