STOCKS

News


ఎన్‌బీఎఫ్‌సీలకు కొత్తగా ఎల్‌సీఆర్‌

Saturday 25th May 2019
news_main1558766542.png-25926

  • డిపాజిట్లు స్వీకరించే అన్ని సంస్థలకూ వర్తింపు
  • రూ.5,000 కోట్ల ఆస్తులున్న అన్ని ఎన్‌బీఎఫ్‌సీలకూ
  • ముసాయిదా మార్గదర్శకాలు విడుదల చేసిన ఆర్‌బీఐ
  • 2020 ఏప్రిల్‌ నుంచి అమల్లోకి

న్యూఢిల్లీ: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు (ఎన్‌బీఎఫ్‌సీ) సంబంధించి లిక్విడిటీ కవరేజీ రేషియో (ఎల్‌సీఆర్‌)ను ఆర్‌బీఐ తీసుకురానుంది. డిపాజిట్లు తీసుకునే అన్ని ఎన్‌బీఎఫ్‌సీలతోపాటు, రూ.5,000 కోట్ల ఆస్తులున్న ప్రతీ ఎన్‌బీఎఫ్‌సీ కూడా ఈ విధానం పరిధిలోకి రానుంది. ఈ మేరకు ఆర్‌బీఐ నూతన మార్గదర్శకాలను రూపొందించింది. ఇందుకు సంబంధించి ముసాయిదా మార్గదర్శకాలను శుక్రవారం విడుదల చేసింది. ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో లిక్విడిటీ సమస్యలకు ముగింపు పలకడం, ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ తరహా సంక్షోభాల నివారణ కోసం ఆర్‌బీఐ ఈ చర్యలను చేపట్టింది. ఎల్‌సీఆర్‌ విధానానికి ఎన్‌బీఎఫ్‌సీ రంగం సాఫీగా మారేందుకు వీలుగా... 2020 ఏప్రిల్‌ నుంచి 2014 ఏ‍ప్రిల్‌ వరకు నాలుగేళ్ల కాలంలో అంచలంచెలుగా అమలు చేయాలన్నది ఆర్‌బీఐ ప్రణాళిక. ‘‘ఎన్‌బీఎఫ్‌సీలు తప్పనిసరిగా తగినంత అధిక నాణ్యత కలిగిన లిక్విడ్‌ ఆస్తులను (హెచ్‌క్యూఎల్‌ఏ) కలిగి ఉండాలి. తీవ్రమైన నిధుల లభ్యత సమస్య ఏర్పడినప్పుడు ఈ ఆస్తులను 30 రోజుల అవసరాలకు సరిపడా నగదుగా మార్చుకోవచ్చు’’ అని ఆర్‌బీఐ ముసాయిదా మార్గదర్శకాల్లో తెలియజేసింది.
60 శాతం ఎల్‌సీఆర్‌
‘‘2020 ఏప్రిల్‌ 1 నుంచి ఎల్‌సీఆర్‌ నిబంధనలకు ఎన్‌బీఎఫ్‌సీలు కట్టుబడి ఉండాలి. కనీసం 60 శాతంగా ఎల్‌సీఆర్‌ ఉండాలి. క్రమంగా 2024 ఏప్రిల్‌ నాటికి ఈ కవరేజీని 100 శాతానికి చేరాల్సి ఉంటుంది’’అని ఆర్‌బీఐ పేర్కొంది. ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో ఇటీవలి పరిణామాల విశ్లేషణ తర్వాతే ఈ మార్గదర్శకాలను తీసుకొచ్చినట్టు తెలిపింది. ఇక అప్లికేషన్‌ ఆఫ్‌ జనరిక్‌ అస్సెట్‌ లయబిలిటీ మేనేజ్‌మెంట్‌ (ఏఎల్‌ఎమ్‌) తదితర ఇతర మార్గదర్శకాలు కూడా ఈ ముసాయిదాలో ఉన్నాయి. ఎన్‌బీఎఫ్‌సీ ఉన్నత స్థాయి యాజమాన్యంతో కూడిన అస్సెట్‌ లయబిలిటీ మేనేజ్‌మెంట్‌ కమిటీ (ఏఎల్‌సీవో)ని కూడా ఆర్‌బీఐ ప్రతిపాదించింది. లిక్విడిటీ రిస్క్‌ నిర్వహణ కోసం దీన్ని సూచించింది. ఎన్‌బీఎఫ్‌సీ రుణ కార్యకలాపాలపై ఇబ్బందులు ఎదురైతే ఎదుర్కొనేందుకు అత్యవసర నిధి ప్రణాళికను కూడా రూపొందించుకోవాలని పేర్కొంది. 



You may be interested

చిన్నస్టాకుల సూచీల్లో గోల్డెన్‌ క్రాస్‌

Saturday 25th May 2019

నిఫ్టీ స్మాల్‌, మిడ్‌క్యాప్‌ స్టాకుల చార్టుల్లో గోల్డెన్‌ క్రాస్‌ పాటర్న్‌ కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. గోల్డెన్‌క్రాస్‌ ఏర్పడడం ట్రెండ్‌ బుల్లిష్‌సైడ్‌కు మారిందనేందుకు సంకేతంగా భావిస్తారు. ఈ క్రాసింగ్‌ ఏర్పడడం మిడ్‌క్యాప్స్‌లో 14 నెలల కరెక‌్షన్‌ దశకు ముగింపుగా ఐసీఐసీఐ డైరెక్ట్‌ అంచనా వేస్తోంది. ఈ పాటర్న్‌ ఏర్పాటు మార్కెట్‌లో పాజిటివ్‌నెస్‌పై నమ్మకాన్ని కలిగిస్తున్నాయని తెలిపింది. ఇకపై మిడ్‌, స్మాల్‌క్యాప్స్‌లో కొత్త బుల్లిస్‌ ట్రెండ్‌ ఆరంభమవుతుందని, కొత్త అప్‌సైడ్స్‌ ఉంటాయని, ప్రధాన

వారాంతపు నష్టాల్లో ముడిచమురు ధర!

Saturday 25th May 2019

అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు శుక్రవారం ఒక శాతం మేర లాభపడినా, వారం మొత్తానికి చూస్తే నష్టాల్లోనే ముగుస్తున్నాయి. ఈ ఏడాది క్రూడాయిల్‌ ధరలకు ఇదే అతిపెద్ద నష్టాల ముగింపు. ఇన్వెంటరీలు పెరగడం, అంతర్జాతీయ మందగమన భయాలు.. క్రూడ్‌ ధరలపై ప్రభావం చూపాయి. శుక్రవారం బ్రెంట్‌ ధర 1.4 శాతం లాభంతో 68.69 డాలర్ల వద్ద ముగిసింది. వారం మొత్తానికి చూస్తే బ్రెంట్‌ ధర 4.5 శాతం నష్టపోగా, డబ్ల్యుటీఐ

Most from this category