STOCKS

News


ఈసీబీలకు హెడ్జింగ్‌ నిబంధల సడలింపు

Tuesday 27th November 2018
news_main1543298260.png-22406

ముంబై: విదేశీ వాణిజ్య రుణాల (ఈసీబీ) హెడ్జింగ్‌ నిబంధనలను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) సడలించింది. ఇప్పటికి వరకూ ఈసీబీలకు సంబంధించి పూర్తి 100 శాతం హెడ్జింగ్‌ అవసరంకాగా ఈ ప్రొవిజన్‌ను 70 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. వ్యాపారంలో వచ్చే ఒడిదుడుకులను తట్టుకోడానికి వినియోగించే పెట్టుబడి సాధనాల్ని హెడ్జింగ్‌గా పేర్కొంటారు. మూడు నుంచి ఐదేళ్ల మెచ్యూరిటీ పిరియడ్‌కు (టైర్‌ 1 ఈసీబీ ఫ్రేమ్‌వర్క్‌) ఈ సడలింపు వర్తిస్తుందని తాజా నోటిఫికేషన్‌లో తెలిపింది. ఈ నోటిఫికేషన్‌కు ముందు హెడ్జింగ్‌ల విషయంలోనూ తాజా సవరణ వర్తిస్తుందని, రోలోవర్స్‌లో హెడ్జింగ్‌ను తగ్గించుకోవచ్చని సూచించింది.



You may be interested

క్యూ2లో తగ్గనున్న వృద్ధి జోరు

Tuesday 27th November 2018

ఎస్‌బీఐ రిసెర్చ్‌ అంచనా అధికారిక గణాంకాలు శుక్రవారం న్యూఢిల్లీ: స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018-2019) రెండవ త్రైమాసికంలో (జూలై-సెప్టెంబర్‌) మందగించే అవకాశం ఉందని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) రిసెర్చ్‌ తెలిపింది. గ్రామీణ డిమాండ్‌ మందగమనం తమ అంచనాలకు కారణమని పేర్కొంది. వృద్ధి రేటు 7.5 శాతం నుంచి 7.6 శాతం శ్రేణిలో నమోదయ్యే వీలుందని వివరించింది. మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్‌-జూన్‌) స్థూల దేశీయోత్పత్తి

వెబ్‌చెకిన్‌ ఛార్జీలపై సమీక్ష

Tuesday 27th November 2018

 కేంద్ర పౌర విమానయాన శాఖ వెల్లడి ఇండిగో వివాదంతో నిర్ణయం న్యూఢిల్లీ: విమాన ప్రయాణాలకు సంబంధించి వెబ్ చెకిన్ విధానంలో ఏ సీటు ఎంపిక చేసుకున్నా చార్జీలు వర్తిస్తాయంటూ ఇండిగో ఎయిర్‌లైన్స్ చేసిన ప్రకటన వివాదం రేపడంతో కేంద్ర పౌరవిమానయాన శాఖ (ఎంవోసీఏ) రంగంలోకి దిగింది. ఇలాంటి విధానాలు ప్రస్తుత నిబంధనలకు లోబడే ఉన్నాయా లేదా ఉల్లంఘిస్తున్నాయా అన్న అంశాన్ని సమీక్షించనున్నట్లు మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌లో పేర్కొంది. కొన్ని ఎయిర్‌లైన్స్‌ ప్రస్తుతం అన్ని

Most from this category