STOCKS

News


సెప్టెంబర్‌ 19న రూ.10వేల కోట్ల సెక్యూరిటీల కొనుగోలు: ఆర్‌బీఐ

Saturday 15th September 2018
news_main1537001580.png-20289

ముంబై:- రిజర్వ్‌బ్యాంకు రూ.10వేల కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోలుకు సిద్ధమైంది. ఈ మేరకు ఆర్‌బీఐ శుక్రవారం ఒక ప్రకటనను జారీ చేసింది. ప్రజలు, వాణిజ్యసంస్థలు, ఇతర విత్తసంస్థల నుంచి సెప్టెంబర్‌ 19న బహిరంగ మార్కెట్ కార్యకలాపాల(ఓఎంవో) ద్వారా ప్రభుత్వానికి చెందిన రూ.10వేల కోట్ల విలువైన సెక్యూరిటీలను కొనుగోలు చేస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటనలో తెలిపింది. మార్కెట్లో ద్రవ్య లభ్యత పెంచండంతో పాటు, రూపాయి పతనాన్ని అరికట్టేందుకు సెక్యూరిటీ కొనుగోలు సిద్ధమైనట్లు ఆర్‌బీఐ తెలిపింది. సాధారణంగా ఆర్‌బీఐ ద్రవ్యోల్బణకాలంలో ప్రభుత్వ సెక్యూరిటీలను అమ్ముతుంది. ఆర్థికమాంద్యకాలంలో కొనుగోలు చేస్తుంది.



You may be interested

400బిలియన్‌ డాలర్ల దిగువకు ఫారెక్స్‌ నిల్వలు..!

Saturday 15th September 2018

ముంబై:- రూపాయి పతనం దెబ్బకు ఫారెక్స్ నిల్వలు కరిగిపోతున్నాయి. క్షీణిస్తున్న రూపాయిని ఆదుకోవడానికి రిజర్వు బ్యాంకు మారక ద్రవ్య మార్కెట్‌ (ఫారెక్స్‌)లో డాలర్లను విక్రయిస్తోంది. ఫలితంగా ఈ ఏడాదిలో తొలిసారిగా ఫారెక్స్‌ నిల్వలు తొలిసారిగా 400 బిలియన్‌ డాలర్ల దిగువకు చేరుకున్నాయి. విదేశీ మారకపు (ఫారెక్స్‌) నిల్వలు సెప్టెంబరు 7తో ముగిసిన వారానికి 819.5 మిలియన్‌ డాలర్లు తగ్గి 399.28 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయని ఆర్‌బీఐ వెల్లడించింది. ఫారెక్స్ మార్కెట్‌లో

7,000లోపు ఏ ఫోన్‌ బెటర్‌?

Saturday 15th September 2018

ఎంట్రీ లెవెల్‌ స్మార్ట్‌ఫోన్‌ విభాగంలో ఇటీవల కాలంలో పోటీ బాగా పెరిగింది. కంపెనీలు తక్కువ ధరలో మంచి ఫీచర్లతో ఈ విభాగంలోకి ఎంట్రీ ఇస్తున్నాయి. రూ.7,000లోపు ధరలోని టాప్‌-4 స్మార్ట్‌ఫోన్లను కింద ఇచ్చాం. అవేంటో ఒకసారి చూద్దాం..   ఇన్‌ఫినిక్స్‌ స్మార్ట్‌-2.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5.45 అంగుళాల డిస్‌ప్లే (18:9 రేషియో), 1.5 గిగాహెర్ట్జ్‌ క్వాడ్‌ కోర్‌ మీడియాటెక్‌ ఎంటీ 6739 ప్రాసెసర్‌, 2 జీబీ ర్యామ్‌/16 జీబీ మెమరీ లేదా 3

Most from this category