STOCKS

News


ఆర్‌బీఐ ఏ ఒక్కరిపైనో ఆధారపడి లేదు

Wednesday 12th December 2018
news_main1544591753.png-22848

న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ సంస్థాగత సామర్ధ్యాలు చాలా పటిష్టమైనవని, మార్కెట్లు.. ఎకానమీని చక్కదిద్దేందుకు అవసరమైన చర్యలన్నీ తీసుకోగలదని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్  రాజీవ్ కుమార్ చెప్పారు. ఆర్‌బీఐ ఏ ఒక్కరిపైనో ఆధారపడి పనిచేయదని తెలిపారు. ఆర్‌బీఐ గవర్నర్‌ పదవికి ఉర్జిత్ పటేల్ రాజీనామా చేసిన నేపథ్యంలో రాజీవ్ కుమార్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. "గత రెండేళ్లుగా ఉర్జిత్ పటేల్ అద్భుతంగా పనిచేశారు. అయితే, ఆర్‌బీఐ ఏ ఒక్కరిపైనో ఆధారపడి నడిచేది కాదు. సుదీర్ఘ చరిత్ర ఉన్న ఒక ప్రొఫెషనల్ సంస్థ. ఎవరు ఉన్నా లేకపోయినా దాని కార్యకలాపాలు యథాప్రకారం కొనసాగుతాయి" అని కుమార్ తెలిపారు. ఇందుకోసం అవసరమైన చర్యలన్నీ ప్రభుత్వం తీసుకుంటుందని ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్‌పై జరిగిన సదస్సులో ఆయన చెప్పారు. మరోవైపు, పటేల్ రాజీనామా నేపథ్యంలో రూపాయి క్షీణించడంపై స్పందిస్తూ.. ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని పరిశీలిస్తోందని, తగు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అందరినీ ఆర్థిక సేవల పరిధిలోకి తెచ్చేందుకు (ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ ) మొబైల్ బ్యాంకింగ్ మెరుగైన విధానం కాగలదని కుమార్‌ అభిప్రాయపడ్డారు. ఉద్యోగాలు, ఉపాధి కల్పన, వృద్ధే లక్ష్యంగా ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ ఉండాలని పేర్కొన్నారు. 



You may be interested

జేఎల్‌ఆర్‌ ‘2019 డిస్కవరీ స్పోర్ట్‌’ విడుదల

Wednesday 12th December 2018

 న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల అనుబంధ సంస్థ జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ ఇండియా (జేఎల్‌ఆర్‌).. ‘2019 డిస్కవరీ స్పోర్ట్‌’ పేరుతో నూతన వేరియంట్‌ ఎస్‌యూవీని మంగళవారం విడుదలచేసింది. నూతన ఫీచర్లు, 2.0 లీటర్ల ఇంజినియం డీజిల్ ఇంజిన్ కలిగిన ఈ కారు ధర రూ.44.68 లక్షలుగా నిర్ణయించినట్లు తెలిపింది. ఈ సందర్భంగా జేఎల్ఆర్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ రోహిత్ సూరీ మాట్లాడుతూ.. ‘మెరుగైన పవర్‌ట్రైన్ ఆప్షన్‌ ఉండడం

స్వల్పంగా తగ్గిన పసిడి

Wednesday 12th December 2018

 ఆసియా ట్రేడింగ్‌లో బుధవారం ఔన్స్‌ పసిడి 1డాలరు స్వల్ప పెరుగుదలతో 1,249.30డాలరు వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపుపై సందిగ్ధత, డాలర్‌ ఇండెక్స్‌ పతనం కారణాలతో ఈ వారం ప్రారంభం నుంచి పసిడి 5నెలల గరిష్టం వద్ద స్థిరంగా ట్రేడ్‌ అవుతున్న సంగతి తెలిసిందే. నిన్న రాత్రి అమెరికా మార్కెట్లో ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపు అంచనాలతో యూఎస్‌ బాండ్‌ ఈల్డ్ పెరిగింది. బ్రిటన్‌లో బ్రిగ్జిట్‌ అంశంతో నెలకొన్న రాజకీయ

Most from this category