STOCKS

News


‘నగదు రవాణా’లో మోసాలు తగ్గుతాయి

Wednesday 10th October 2018
news_main1539148794.png-21005

న్యూఢిల్లీ: ఆర్‌బీఐ నూతన నిబంధనలు నగదు రవాణా రంగానికి మేలు చేస్తాయని సంబంధిత పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. బ్యాంకింగ్‌ రంగానికి సంబంధించి నిత్యం రూ.15,000 కోట్ల నగదు రవాణా చేసే ఈ రంగంలో భద్రత పెరగడంతోపాటు, మరిన్ని ఉద్యోగాలు కూడా వస్తాయని క్యాష్‌ లాజిస్టిక్స్‌ అసోసియేషన్‌ అభిప్రాయపడింది. ఆర్‌బీఐ మార్గదర్శకాలు ఈ రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన విధానాలు తీసుకొచ్చేలా చేస్తాయని, ప్రజాధనానికి భద్రత ఇనుమడిస్తుందని పేర్కొంది. స్వల్ప కాలంలో నిర్వహణ వ్యయాలు పెరిగినప్పటికీ దీర్ఘకాలంలో మాత్రం సమర్థత పెరిగి, మోసాలు తగ్గుతాయని అభిప్రాయపడింది. నగదు రవాణాకు సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆర్‌బీఐ నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. నగదు రవాణా సేవలను అందించే సంస్థలు, వాటి సబ్‌ కాంట్రాక్టర్ల నికర విలువ రూ.100 కోట్ల కంటే తక్కువ ఉండరాదని అన్ని బ్యాంకులను ఆదేశించింది. కనీసం ప్రత్యేకంగా రూపొందించిన 300 వ్యాన్లను నగదు రవాణా సేవల సంస్థ కలిగి ఉండాలని కూడా నిర్దేశించింది. బ్యాంకులు ఈ సేవలను అవుట్‌సోర్స్‌ చేసిన సంస్థలతో ఒప్పందం కాలపరిమితి తీరడం లేదా 2019 మార్చి 31 నాటికి నూతన నిబంధనలను (ఏది ముందు అయితే అది) చేరుకోవాలని కూడా కోరింది. 
అంతర్జాతీయ ప్రమాణాలు...
‘‘నగదు రవాణాలో కనీస ప్రమాణాలను తీసుకురావాలన్న ఆర్‌బీఐ చొరవను స్వాగతిస్తున్నాం. ఆర్‌బీఐ మార్గదర్శకాలు ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి. నగదు నిర్వహణను చాలా దేశాల్లో సెంట్రల్‌ బ్యాంకే నియంత్రిస్తోంది’’ అని ఎస్‌ఐఎస్‌ గ్రూపు ఎండీ రితురాజ్‌ సిన్హా తెలిపారు. స్వల్పకాలంలో వ్యయాలు పెరిగినప్పటికీ... దీర్ఘకాలంలో సమర్థత మెరుగుపడి, మోసాలు తగ్గడం వల్ల ఆదా జరుగుతుందని ఆయన చెప్పారు. ‘‘ఆర్‌బీఐ మార్గదర్శకాలు భద్రతను పెంపొందించడం, రిస్క్‌ను తగ్గించడం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విధానాలను తీసుకురావడమనే లక్ష్యాల కోణంలో ఉన్నాయి. ఆర్‌బీఐ ప్రధాన ఉద్దేశ్యాల్లో ఇదీ ఒకటి’’ అని క్యాష్‌ లాజిస్టిక్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ అనుష్‌ రాఘవన్‌ తెలిపారు. ఈ రంగంలో ఉద్యోగాలు పెరుగుతాయని, భద్రతను పెంచే క్రమంలో క్యాష్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు మరింత మందిని నియమించుకోవాల్సి ఉంటుందన్నారు. 



You may be interested

ముగ్గురు ‘ఆమ్రపాలి’ డైరెక్టర్లకు పోలీసు కస్టడీ

Wednesday 10th October 2018

న్యూఢిల్లీ: తమ ఆదేశాలను పాటించని రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ఆమ్రపాలి గ్రూపుపై సుప్రీంకోర్టు మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అన్ని డాక్యుమెంట్లను ఫోరెన్సిక్‌ ఆడిట్‌ కోసం సమర్పించాలన్న తమ ఆదేశాలను అమలు చేయకుండా, కోర్టుతో దాగుడు మూతలు ఆడుతున్నారంటూ ధర్మాసనం మండిపడింది. జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ యూయూ లలిత్‌తో కూడిన ధర్మాసనం ఆమ్రపాలి గ్రూపునకు చెందిన ముగ్గురు డైరెక్టర్లను పోలీసు కస్టడీకి ఆదేశించింది. ఆమ్రపాలి గ్రూపు డైరెక్టర్లు

ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ రుణ ఖాతా మనుగడలోనే ఉంది: బీవోబీ

Wednesday 10th October 2018

 ముంబై: ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సంస్థ రుణ ఖాతా తమ వద్ద కొనసాగుతూనే ఉందని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీవోబీ) స్పష్టం చేసింది. ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీలకు, హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు రుణాలు మం‍జూరు ఇకపైనా కొనసాగుతుందని తెలిపింది. ‘‘ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కు రుణాలిచ్చి ఉన్నాం. ప్రస్తుతానికి ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సహా ఇతర అన్ని ఎన్‌బీఎఫ్‌సీ ఖాతాలు పనిచేస్తూనే ఉన్నాయి. రేపు ఎలా ఉంటాయన్న దానిపై రేపే మాట్లాడగలం తప్ప ఇప్పుడేమీ చెప్పలేం’’ అని బీవోబీ చీఫ్‌ పీఎస్‌

Most from this category