STOCKS

News


నేటి నుంచీ ఆర్‌బీఐ కీలక సమావేశం

Tuesday 2nd April 2019
news_main1554179556.png-24918

ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మొట్టమొదటి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమీక్షా సమావేశం మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. గురువారం వరకూ మూడు రోజులు ఈ సమీక్షా సమావేశాలు జరుగుతాయి. 4వ తేదీ గురువారం ఆర్‌బీఐ కీలక రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు. ప్రస్తుతం 6.25 శాతం)పై ప్రకటన వస్తుంది. ఆర్థిక వ్యవస్థ మందగమనం నేపథ్యంలో వృద్ధికి ఊపును ఇవ్వడానికి మరో దఫా రేటు కోత ఉండవచ్చని కొందరు విశ్లేషిస్తుండగా, ఇప్పటికే తీసుకున్న రేటు కోత నిర్ణయాలను బ్యాంకింగ్‌ అమలు చేయడంపైనే ఆర్‌బీఐ దృష్టి సారిస్తుందని మరికొందరి విశ్లేషణ. 



You may be interested

మార్కెట్లోకి 2019 ‘రెనో కాప్చర్‌’

Tuesday 2nd April 2019

- ధరల శ్రేణి రూ.9.5లక్షలు–రూ.13లక్షలు ముంబై: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘రెనో’ తాజాగా తన ప్రీమియం ఎస్‌యూవీ ‘కాప్చర్‌’ మోడల్‌లో నూతన వెర్షన్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఇంతకుముందు కంటే ఈకారులో మెరుగైన భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు కంపెనీ ప్రకటించింది. పాదచారుల భద్రతా ప్రమాణాల వంటి అన్ని రకాల దేశీ భద్రతా చట్టాలకు అనుగుణంగా ఈ నూతన వెర్షన్‌ రూపొందినట్లు తెలిపింది. ధరల శ్రేణి రూ.9.5లక్షలు–రూ.13లక్షలుగా ప్రకటించింది. ఎలక్ట్రానిక్ బ్రేక్

ప్రభుత్వ రెండవ పెద్ద బ్యాంకు... బీఓబీ

Tuesday 2nd April 2019

- దేనా, విజయా బ్యాంకుల విలీనం నేపథ్యం - ఎస్‌బీఐ తరువాతి స్థానం - దీనితో మూడవ స్థానంలోకి పీఎన్‌బీ - 18కి తగ్గిన ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య న్యూఢిల్లీ: దేశంలో ప్రభుత్వ రంగ రెండవ బ్యాంకింగ్‌ దిగ్గజంగా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) అవతరించింది. దేనా, విజయాబ్యాంకుల విలీనం ఏప్రిల్‌ 1 నుంచీ లాంఛనంగా అమల్లోకి రావడంతో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తరువాత బీఓబీ రెండవ స్థానంలోకి చేరింది. దీనితో

Most from this category